Monday, October 5, 2009

వాసవీధామ్

పెనుగొండ అంటే చాలా మంది ఎరిగి ఉండచ్చు. అది వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవాలయము ద్వారా ప్రసిద్ది చెందింది. ఇటీవల వరకూ ఎక్కువగా తెలియక పోయినా ఇక ఇటుపై తప్పక గొప్పగా ప్రసిద్ది చెందవచ్చు.
ఇది చదవండి మీకూ తెలుస్తూంది.

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవికి పలు ఆలయాలున్నాయి. వీటిలో ప్రసిద్ధి చెందిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ అనే పట్టణంలో ఉన్నది. ఆలయంలో ఏడు అంతస్థులతో ఉన్న గాలి గోపురం వివిధ వర్ణాలతో,చక్కటి శిల్ప కళతో అలరారుతూ ఉంటుంది. ఇది వైశ్యులకు పవిత్ర క్షేత్రం. పెనుగొండ క్షేత్రాన్ని వైశ్యుల కాశీ గా భావిస్తారు.

ఆర్యవైశ్యుల కులదైవమయిన శ్రీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి ఆలయము చారిత్రక నేపద్యము కలిగి ఉన్నది. నిజానికి ఆలయము శ్రీ నగరేశ్వరస్వామి వారి దేవస్థాన ప్రాంగణములోనే వేరొక ప్రక్క నిర్మింపబడినది. తరువాత గోపురము మరియు విశ్రాంతి మందిరములు కళ్యాణ మండపము ఇత్యాదులతో అభివృద్ది చేయుటచే పెద్ద యాత్రా స్థలముగా మారినది.నేను పెనుగొండ వెళ్ళి చాలా కాలం అయింది. మద్య జరిగిన మార్పులు చూస్తే చాలా బాగా అనిపించాయి. వాసవీ ధామ్ అని పేరుతో పెద్ద ప్రాజెక్టు చేపట్టారు. అసలు వాసవి ఆలయమే ఊరికి ఒక వైపు చక్కని పచ్చపొలాల ప్రక్కగా ఉంటుంది. దీనికి తోడు ఎదురుగా పెద్ద కాలువ ప్రవహిస్తుంటుంది. అలాంటి వాతావరణానికి గుడికి కొద్ది దూరంగా అనేక ఎకరాల పంట చేలను పూడ్చి నిర్మణాలు చేపట్టారు. ఇక్కడ యాత్రికులకు అనేక కాటేజీలు, వాసవి గురించిన సమస్త వివరాలూ ప్రదర్శించే పెద్ద ప్రదర్శన శాల, ద్యాన మందిరాలు , స్టార్ హొటలూ, అనేక చిన్న దేవాలయాలు ఇలా అనేకం నిర్మాణంలో ఉన్నాయి. లోనివైపుగా వాసవీమాత అగ్నిలో దహనమౌతున్న ప్రతిమను సహజంగా ఉండేలా రూపొందించారు.
ఇవన్నీ ఒక ఎత్తు తొంభై అడుగుల పైబడిన వాసవీ మాత విగ్రహం. ఇది ప్రస్తుతం సిమెంటుతో నిర్మించారు, తరువాత ఇలానే దీనిపై కాంస్యపు పలకలను తయారు చేస్తారట. దానిని రోడ్డువైపుగా వాసవీ ధామ్ ప్రధాన ద్వారం వైపు నిర్మించారు. చూడండి అద్భుతంగా ఉన్నది.

Thursday, May 14, 2009

మా ఊరి గ్రంధఆలయము

శ్రీ రామచంద్ర గ్రంథాలయము.
మాఊరి గ్రంధాలయము గూర్చి ఎంత చెప్పినా తక్కువే అనుకోవచ్చు నిజానికి అది మాకొక బడి, ఒడి స్నేహితుడిలాంటిది. నా చిన్నపుడు ఊహ తెలియకముందే మానాన్నగారితో కలసి ఆ గ్రంధాలయంలో అడుగు పెట్టానని తెలుసు. చందమామ చేతికిచ్చి ఆయన పేపరు చదువుతుంటే చందమామ,బొమ్మరిల్లు లో బొమ్మలు చూడటం అటు తరువాత ఊసుబోక చదివేవాళ్ళను చూడటం, పుస్తకాలు పేపర్లు ఎగరకుండా పెట్టే చిన్న చెక్కముక్కలతో బల్లలమీద మోదటం, అందరూ హటాత్తుగా నన్నే చూస్తుంటె ఏమీ తెలియని వాడిలా చటుక్కున మానాన్న ప్రక్కకెళ్ళి దాక్కోడం జ్ఞాపకమున్నది.
తరువాత
వచ్చీరాని చదువుతో కధలు చదవటానికి పడిన అవస్థ జ్ఞాపకమున్నది. ఆపై ట్వింకిల్ పుస్తకాల సీరియల్స్, పంచతంత్రం, గలివర్ యాత్రలు, సింధుబాద్ సాహసాలు, పరమానందయ్య శిష్యుల కధలు, రామకృష్ణమఠం వారి అందమైన రంగుల పుస్తకాలైన బొమ్మలకధలు, పిల్ల రామాయణం, బొమ్మల భారతం, లాంటి వాటి నుండి ఎగురుకుంటూ వారపత్రికలు, మాసపత్రికలు లాంటి పుస్తకాలకు అలవటుపడటం ఠంచనుగా వారం వారం చదవటం తెలుసు. వాటి తరువాత తరమైన మదుబాబు,పానుగంటి లాంటి డిటెక్టివు పుస్తకాలు శెలవు,శెలవుల్లోనూ రోజుల తరబడి కూర్చొని చదవటమ్. మా వాళ్ళు చదువు చదవక పనికిమాలిన పుస్తకాలు చదువుతున్నానని కోప్పడటం తెలుసు. అటునుండి వేసవి శెలవుల్లో రుచిమరిగి ఇప్పటి వరకూ విడవలేకున్న నవల్ల గురించి చెప్పేదేముంది మీకే తెలుసు. ఇదంతా ఎందుకంటే నాకా అదృష్టం మా గ్రంధాలయం వలనన్నమాట.

అటువంటి గ్రంధాలయం గురించి కుతంత చిన్నగా చెప్పేసి మిగించేత్తాను. 1870 లో స్థాపించబడిన ఈ గ్రంథాలయము జిల్లాలోనే అతి పెద్ద గ్రంధాలయములలో ఒకటి.. మొదట చిన్న తాటాకు పాకలో మొదలైన ఈ గ్రంధాలయము 1914 లో పండిత రుద్రరాజు నరసింహరాజుగారి ప్రోత్సాహముతో భవనముగా రూపుదిద్దుకొని 1962 కు రెండు అంతస్తులుగా ఒకేసారి రెండువందలమంది చదువుకోగల సౌకర్యాలు కలిగిన అతి పెద్ద గ్రంధాలయముగా మార్పు చెందినది. ఇది కాదు అది అని కాకుండా...తెలుగు బాషలో ప్రచురించబడే ప్రతి పత్రికా (దిన, పంచ, వార, పక్ష, మాస) ఇక్కడ చూడగలం. ప్రసిద్ద గ్రంధాలనుండి సామాన్య రచయితల నవలల వరకూ అన్నీ ఇక్కడ ఉంటాయి. అక్కడ ఉన్న కొన్ని పుస్తకాల లిష్ట్ రాద్దామనుకొన్నాను కాని మొదలెట్టి వరకూ వచ్చేసరికి నాకు నీరసమొచ్చేసింది. ఇక మిగతావేం రాస్తాం. వదిలేసాం ఓపికున్నపుడు రాద్దాం లే అని. ఎలాగూ వీటిని వికీలో ఎక్కించాలి కనుక లిష్ట్ పూర్తి చేసి తీరతామన్న మాట.


* అద్భుత రామాయణము - అనగారి వెంకతకృష్ణరాయడు.
* అద్భుతోత్తరరామాయనము - నాదెళ్ళపురుషోత్తముడు.
* ఆధ్యాత్మరామాయణము - కోటమరాజు నాగయామాత్యుడు.వావిళ్ళవారు
* అనిరుద్ద చరిత్రము - కనుపర్తి అబ్బయామాత్యుడు. సాహిత్యాకాడమీ
* అభినవాంధ్ర విష్ణుపురానము - అఛ్యుతరామామాత్యుతకవి.
* అమరజీవి అల్లూరి - దండు వెంకటరామరాజు.
* అభినవ భారతము - మతకపల్లి మాధవకవిమంజువాణి ఏలూరు
* అరుణాచల ఖండము - జనమంచి శేషద్రిశర్మ
* ఆంధ్రశ్రీమద్రమాయనము 7 సంపుటములు- జనమంచి శేషద్రిశర్మ
* ఆంధ్రవాల్మీకి రామాయణము 7అ సంపు - వావికొలను సుబ్బారావు.
* ఆంద్రమహాబారతము - నన్నయ,త్క్కన,ఎర్రాప్రగడ.వావిళ్ళ్ళవారు
* ఆంధ్రపురానము - మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి
* ఆంధ్ర బ్రహ్మాండపురాణము - జనమంచి శేషద్రిశర్మ తణుకు
* ఆంధ్ర భవిష్యపురానము - మల్లాది సూర్యనారాయణశఅస్త్రి. తణుకు
* ఆంధ్రలింగపురాణము - ములుగు చంద్రమౌళీశ్వరశాస్త్రి. రజతముధ్రాక్షరశాల.
* ఆంధ్రస్కాందపురాణము - జనమంచి శేషద్రిశర్మ
* ఉత్తరరామాయనము- కంకటి పాపరాజు.వావిళ్ళ
* ఉత్తర హరి వంశము - నచనసోముడు వావిళ్ళ
* కపిలదేవహూతి సంవాదము - పోతన. బాలభక్త సమాజము పోడూరు.
* కవి కర్ణరపాయనము - సంకుసాల నృసింహకవి.
* కంద రామాయణముం గంధపెద వీరభద్రరఅవు. రామానంధగౌడీయ మఠము.కొవ్వూరు.

Wednesday, April 29, 2009

ఉపచార విధానం

పూజా విధానంలో ఇంటికి వచ్చిన పెద్దలను ఎలా గౌరవిస్తారోఅలానే షోడశోపచారములలో కూడా భగవానుని అలాగే గౌరవిస్తారు.అలా పూజా పరంగా భగవానుని మర్యాద చేయడం ఉపచార విధానం.వాటి గురించి కొంత తెలుసుకొందాం.


ఆవాహనము -- మనస్ఫూర్తిగా ఇంట్లోకి ఆహ్వానించడం

ఆసనము -- వచ్చిన వారిన్ని కూర్చోబెట్టడం

పాద్యము -- కాళ్ళుకడుగుకొనేందుకు నీళ్ళివ్వడం

అర్ఘ్యము -- చేతులు శుభ్రపరచడం

ఆచమనీయము -- దాహమునకు నీళ్ళీవ్వడము

స్నానము -- ప్రయాణ అలసటతొలగుటకు స్నానింపచేయడం

వస్త్రము -- స్నానాంతరము పొడి బట్టలివ్వడం

యజ్ఞోపవీతము -- మార్గమద్యలో మైల పడిన యజ్ఞోపవీతమును మార్చడం

ఏడు వారాల నగలు.


ఏడు వారాల నగల గురించి వినే ఉంటారు. రోజుకు కొన్ని నగల చొప్పున
ఏడు రోజులకూ కేటాయించబడిన నగలను ధరించేవారు అప్పటి రోజులలో.
తిదులను, నక్షత్రాలను, రాశులను అనుసరించి ఒక్కోరోజు ఒక్కో సెట్ నగలన్నమాట.

అవేమిటో చూద్దామా (కాదు చదువుదాం)


ఆదివారం - సూర్యుని కోసం కెంపుల కమ్ములు, హారాలు మొదలగునవి.
సోమవారం - చంద్రుని కోసం ముత్యాల హారాలు, గాజులు మొదలగునవి
మంగళ వారం - కుజునికోసం పగడాల దండలు, ఉంగరాలు
బుధ వారం - బుధుని కోసం పచ్చల పతకాలు, గాజులు మొదలగునవి.
గురువారం - బౄహస్పతి కోసం పుష్యరాగపు కమ్ములు, వడ్డాణము, ఉంగరాలు.
శుక్రవారం - శుక్రుని కోసం వజ్రాల హరాలు, ముక్కు పుడక మొదలగునవి.
శనివారం - శనికోసం నీల మణి హారలు, ఉంగరాలు మొదలగునవి.

ఇది నిజానికి నా మూసేయాలనుకొనే http://viswanath123.blogspot.com/ బ్లాగులోనిది. ఇది ౨౦౦౭లో రాసాను.

Friday, January 23, 2009

మావుళ్ళమ్మభీమవరం మావుళ్ళమ్మ విజయవాడ కనకదుర్గ తరువాత అంతటి మహిమాన్వితమైన తల్లిగా కొలిచే దేవత.
పోయిన సారి పండుగకు ఇంటికి వెల్లినపుడూ భీమవరం వెళ్ళా ఆ విశేషాలు వికీలో రాస్తూ బ్లాగులో కూడా ఇస్తే భావుంటుందని రాస్తున్నా....
దశాబ్దాల క్రిందట భీమవరం అనే కుగ్రామమంలో వెలసిన అమ్మవారు విపరీతమైన ప్రజాదరణ పొందుతూ శక్తి
స్వరూపిణిగా విలసిల్లుతూ ఉన్నది. ఆమె విశిష్ట రూపం దేవతలలో మరెవరికీ కానరాదని అంటారు.చారిత్రక నేపధ్యాన్ని అనుసరించి మావుళ్ళమ్మ వారి చరిత్రవిశేషాలు విధంగా ఉన్నాయి. 1880 వైశాఖ మాసం రోజులల్లో భీమవరం గ్రామానికి చెందిన మారెళ్ళ మంచిరాజు, గ్రంది అప్పన్నలకు అమ్మవారు కలలో కనిపించి తాను వెలసిన ప్రాంతాన్ని గురించి చెపుతూ ఇక్కడే తనకు ఆలయం నిర్మించాలని కోరినది. మరుసటి రోజున వారిరువురు ఆప్రాంతానికి వెదుకగా అమ్మవారి విగ్రహం లభ్యమయినది. అటునుండి వారు అక్కడ ఒక పాక వేసి అమ్మవారిని అక్కడ నిలిపిఉంచారు. మామిడితోటలో వెలసిన అమ్మవారిని తొలినాళ్ళలో మామిళ్ళమ్మగా తదనంతరం మావుళ్ళమ్మగా పిలవటం అలవాటయ్యింది. అప్పన్న, మంచిరాజులు ఉన్న మోటుపల్లివారి వీధిలో ఉన్న అమ్మవారిని భీమవరం నడి మద్యకు తీసుకొచ్చారు. అమ్మవారికి జాతర ఉత్సవాలు వేరువేరుగా జరుపుతారు. మొదట్లో అమ్మవారికి అర్చకుడిగా ఒక రజకుడు ఉండేవాడు. అందువలన రజక సంఘం ఆద్వర్యంలో ఒకసారి పండ్ల, పూల, వర్తక సంఘము వారి ఆద్వర్యంలో ఒకసారి ఉత్సవాలు జరుగుతాయి.
ఇప్పుడూన్న మావుళ్ళమ్మ వారు శాంత స్వరూపిణిగా ఉంటారు. కొన్నేళ్లక్రితం వరకూ ఉగ్రరూపిణిగా ఉండే అమ్మవారిని చూచేందుకు భయపడేవిధంగా ఉండే అమ్మవారిని అనేక సార్లు మార్చుకొంటూ ఇప్పటి రూపానికి తీసుకొచ్చారు.
గ్రామానికి చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యులు అనే శిల్పి ద్వారా అమ్మవారి పునర్నిర్మాణం జరిగింది. గర్భాలయానికి నిండుగా అమ్మవారికి రూపాన్నిచ్చాడూ. అయితే అప్పటికి ప్రలయభీకరంగా ఉన్న అమ్మవారిని శిల్పి గ్రంధి నర్సన్న కుమారుడు అప్పారావు శాంత స్వరూపిణిగా తీర్చిదిద్దారు. గర్భాలయానికి ఇరుప్రక్కలా అహింసకు ప్రతీకలైన రామకృష్ణ పరమ హంస, గౌతమ బుద్దుడు " విగ్రహాలను చెక్కారు.

మెంటే వెంకటస్వామి పూర్వికులు, అల్లూరి రామరాజు, భీమరాజుల కుటుంభీకులు అమ్మవారి పుట్టింటి వారు గానూ, గ్రంధి అప్పన్న, తదితరులు అమ్మవారి అత్తింటివారుగానూ వ్యవహరిస్తారు.
ఇక్కడ ఉత్సవాలకు ఎప్పటికప్పుడు వ్యయం పెరుగుతూ ఉన్నది. ప్రస్తుత లెక్కల ప్రకారం నలభై లక్షల నుండి యాభై లక్షల వరకూ ఉన్నది. సారి ఉత్సవాలకు వేసిన సెట్టింగ్స్ ఇవన్నీ. ఇక ఒక్కొక్కరోజు నాలుగు ప్రసిద్ద కళాకారుల ప్రోగ్రాములు ఇక్కడ మామూలు. వాటిలో సురభి నాటకాలు కనీసం పది ఉంటాయిట( రోజూ ప్రోగ్రాముల లిస్టు పేపరుకు అదేలెండి జిల్లా ఎడిసిం లో వస్తుందట)

స్వర్ణ శోభితమైన మావుళ్ళమ్మ సన్నిధి భక్తులకే కాదు అనేకానేక కాళాకారులకూ గుర్తింపునిచ్చే వేధికగా వెలుగొందుతున్నది. ఇక్కడ సనామనం పొందిన కొందరు కళాకారులు.