Thursday, December 12, 2013

కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం

          వికీపీడియా దశాబ్ది ఉత్సవాల సంధర్భంగా తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల అభివృద్ధికి కృషిచేసినవారిని కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం తో సన్మానిస్తున్నది. మీ దృష్టిలో అర్హులైన సభ్యుని లేక మీ పేరునే స్వయంగా ప్రతిపాదన చేయండి. దీని లక్ష్యమేమిటంటే తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల అభివృద్ధికి కృషిచేసిన వ్యక్తులను గుర్తించి సన్మానించటం తద్వారా సభ్యులకు ప్రోత్సాహాన్ని, పునురుత్తేజాన్ని కల్పించడం తద్వారా మరింత వికీ అభివృద్ధికి అ‌వకాశం కల్పించండం. ఎంపిక మండలి ఈ పురస్కారానికి తెలుగులో విజ్ఞాన సర్వస్వానికి నాందిపలికిన కొమర్రాజు లక్ష్మణరావు పేరుబెట్టాలని నిర్ణయించిది. 2013 ఈపురస్కారానికి దశాబ్ది ఉత్సవాల బడ్జెట్ లో 100,000 మొత్తం కేటాయించబడింది. ప్రతి పురస్కార గ్రహీతకు ప్రశంసా పత్రం మరియు 10,000 చొప్పున గరిష్టంగా పది మందికి పురస్కారాలు అందజేస్తున్నది.మీరూ స్వయంగా ఓటింగ్‌లో పాల్గొనవలసిందిగా మనవి...
గడువు: 16 డిసెంబర్ 2013
మరిన్ని వివరాలకు చూడండి

https://te.wikipedia.org/wiki/కొమర్రాజు_వెంకట_లక్ష్మణరావు
https://te.wikipedia.org/wiki/వికీపీడియా:కొమర్రాజు_లక్ష్మణరావు_వికీమీడియా_పురస్కారం

Wednesday, November 27, 2013

నిర్లక్ష్యానికి జవాబు ఈ ఫొటో

నిర్లక్ష్యానికి జవాబు ఈ ఫొటో. ఇది నేషనల్ హైవే నెంబర్ 5. వీళ్ళు పట్టుకొని వేళ్ళాడుతూ వెళ్ళేది లారీని. అదీ ఫుల్ లోడ్ లారీ.....వీళ్ళను ఏమనాలి

Thursday, July 4, 2013

తెలుగు వికీపీడియా - వ్యాసరచన పోటీ

నేటి విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించేందుకు తెలుగు వికీపీడియా తన వంతు కృషి ప్రారంభిస్తోంది. ఈ నేపథ్యంలోనే చదువుకునే విద్యార్థినీ విద్యార్థులకు "చదువు - ఉపాధి" లకు సంబంధించి పలు అంశాలపై వ్యాసరచన పోటీలను నిర్వహిస్తోంది. ఇది విద్యార్థినీ విద్యార్థులలో కొత్త ఆలోచనలకు ఊపిరిపోయడంతోబాటు, చదువరులకు మంచి కెరీర్ ఎంపికలో తోడ్పడగలదని భావిస్తున్నాం.
ఇక్కడ మేము 20 టాపిక్స్ ఇస్తున్నాం. ఈ 20 టాపిక్స్ పై ఎవరైనా ఎన్నయినా రాయవచ్చు. ఒకే అంశంపై ఎంతమందైనా వ్యాసాలు రాయవచ్చు. వ్యాసానికి బొమ్మలు అందాన్ని తెస్తే; సరైన వనరులు వ్యాస నాణ్యతను పెంచుతాయని గమనించండి. ఉత్తమ వ్యాసరచనకు బహుమతులూ ఉంటాయి.

మొదటి బహుమతి - రూ. 1116/-
ద్వితీయ బహుమతి - రూ. 816/-
తృతీయ బహుమతి - రూ. 516/-
కన్సొలేషన్ బహుమతులు - ఐదుగురికి 

విద్య, ఉపాధి అంశానికి సంబంధించి రాయదగిన వ్యాసశీర్షికలు

  1. ఎలా చదువుకోవాలి ?
  2. మంచి మార్కులు రావాలంటే ...
  3. ఉత్తీర్ణతా శాతం పెరగాలంటే ...
  4. సప్లిమెంటరీ రాయడం మంచిదేనా ?
  5. బహుళజాతి సంస్థలు - ఎంపిక విధానం.
  6. పదవ తరతతి తర్వాత ఎందులో చేరాలి ?
  7. విద్యార్థి ఆలోచనా తీరు ఎలా ఉండాలి ?
  8. చదువు కూడా ఒక ఆటే !
  9. వృత్తి విద్యలు - మెళకువలు.
  10. చార్టెడ్ అకౌంటెన్సీ చదవడం సులభమేనా ?
  11. ఇంజనీరింగ్ విద్య - ఉపాధి అవకాశాలు.
  12. వైద్యవిద్యలో రాణించాలంటే ...
  13. ఆర్ట్స్ గ్రూప్ - బంగారు భవిషత్తు.
  14. ర్యాంకుల మాయాజాలం.
  15. ర్యాంకు ముఖ్యమా ? నాలెడ్జి ముఖ్యమా ?
  16. పతోతరగతి, ఇంటర్ లలో బట్టీ విధానం మంచిదేనా ?
  17. లెక్కలంటే చుక్కలు కనిపిస్తున్నాయా ?
  18. జర్నలిజం ఓ ఉపాధి మార్గం.
  19. కార్పొరేట్ పాఠశాలలు- శిక్షణ పొందిన ఉపాధ్యాయుల కొరత
  20. ప్రభుత్వ పాఠశాలలే మేలు!
మరిన్ని వివరాలకై చూడండి
http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%86%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF,_%E0%B0%89%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A7%E0%B0%BF

Saturday, June 15, 2013

'కాజా'


 కాజా అంటే నోరూరని వారుండరు. అందరికీ అందుబాటు ధరలలో ఏ చిన్న షాపులోనైనా దొరికే మంచి మిఠాయిలు, కాజాలు 

 

తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరంలో తయారయ్యే మిఠాయి విశేషం,  'కాజా'  దాని విశిష్టత కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల మన్ననలు పొంది,  ''తాపేశ్వరం కాజా'' గా ప్రసిద్ధి చెందింది.

తాపేశ్వరం గ్రామానికి చెందిన  పోలిశెట్టి సత్తిరాజు  కాజాకు విశిష్టతను ఆపదించినవారిలో ప్రముఖుడు. అప్పట్లో మైదాపిండితో మడతలు పెట్టి కాజాలను కొత్తగా తయారు చేసి పంచదార పాకం పట్టి అమ్మగా వాటి కమ్మదనం, రుచి కారణంగా కొద్దికాలంలోనే కాజా ప్రజాభిమానం పొందింది. క్రమేణా తాపేశ్వరంకాజాగా ప్రశస్తమైంది. 

ఇక్కడి కాజాలు పలు రాకాల సైజులలో లభ్యమౌతాయి. చిట్టి కాజాల దగ్గర నుండి సుమారు ఐదు కేజీల వరకూ బరువుండే జంబో కాజాల వరకూ లభ్యమౌతాయి. 

శుభకార్యాలలో తాపేశ్వరం కాజా కఛ్ఛితంగా ఉండి తీరుతుంది..  సాధారణంగా వాడే సైజులు 50 గ్రాముల నుంచి 500 గ్రాములు వరకు బరువుండే విధంగా రకరకాల సైజులలో వీటిని తయారు చేస్తారు. 1990లో సత్తిరాజు మరణించాక ఆయన వారసులు ఈ వ్యాపారాన్ని ఆధునిక పద్ధతుల్లో నిర్వహించడం మొదలుపెట్టారు. కాజా తయారిలో యంత్రాలను ప్రవేశపెట్టి, కాజాల తయారీని సులభతరం, వేగవంతం చేశారు.

ఈ నాడు ఈ తాపేశ్వరం కాజా తయారీ అనేది ఒక కుటీర పరిశ్రమగా మారినది. రాష్ట్రవ్యాప్తంగా తాపేశ్వరం కాజా పేరుతో 300 వరకు స్వీట్ స్టాల్స్ వివిద పట్టణాలలో గలవు. దీనిపై సుమారు 15000 మందికి పైగా ఉపాది పొందుతున్నారు. 

తాపేశ్వరం నుంచి కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు మొదలైన రాష్ట్రాలకు కాజాలు ఎగుమతి అవుతున్నాయి.

Wednesday, April 10, 2013

అందరికీ ఆహ్వానం


అందరికీ ఆహ్వానం
తెలుగు మీద ప్రేమ, తెలుగుదనంపై అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొనదగిన చైతన్య వేదిక వికీపిడియా చైతన్య వేదిక. అనంతమైన జ్ఞాన సముపార్జనకై ఎక్కడెక్కడొ వెతుకుతూ ఉండే అంతర్జాల జీవులకు జ్ఞా సంపాదనకు, జ్ఞాన దానానికి సరియైన వేదిక వికీపిడియా 
  ఉగాది రోజున జరిగే వికీ చైతన్య వేదికలో పాల్గొని మీ యొక్క ఊరి విసేషాలను, మీకు తెలిసిన సమాచారం ఏదైనా దానిని అందరితో పంచుకొంటూ ముందుకు సాగేందుకు మాతో చేతులు కలపండి.
అబిడ్స్ బిగ్ బజార్ వద్ద కల గోల్డెన్ త్రిషోల్డ్ అని పిలువబడే సరోజినీనాయుడు స్వగృహం లో కరిగే వికీ సదస్సులకు హాజరై అంతర్జాలలంలో తెలుగు ఉనికిని ప్రపంచానికి చాటుదాం.వికీ సదస్సు సాయంత్రం 4 గంటలకు. ఆశక్తి ఉన్నవారు ఉదయం నుండి జరిగే అనేక వికీ విజ్ఞాన అకాడమీలలో పాల్గొనవచ్చు. మరిన్ని వివరాలకు ఈ లింకులు చూడండి  

http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B5%E0%B1%87%E0%B0%B6%E0%B0%82/2013_%E0%B0%A4%E0%B1%86%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B5%E0%B1%87%E0%B0%B6%E0%B0%82


http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE_-_%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B1%87%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9B%E0%B0%BE_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9C%E0%B1%8D%E0%B0%9E%E0%B0%BE%E0%B0%A8_%E0%B0%B8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%AE%E0%B1%81

Friday, March 15, 2013

వికీపీడియా ఉగాది సభకు ఆహ్వానము


ఒకే ఒక్క క్లిక్ తో ప్రపంచ విజ్ఞాన సర్వస్వాన్ని కంటి ముందు సాక్షాత్కరింపజేస్తున్న ఒకే ఒక్క మీడియా వికీపీడియా. దాదాపు ప్రపంచంలోని అన్ని భాషలలో అంతర్జాల విజ్ఞాన సర్వస్వాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన వికీపీడియా రేపటి తరాన్ని విజ్ఞాన సుగంధాలతో సుసంపన్నం చేస్తుందన్నది అక్షర సత్యం...! సమాచార విప్లవంతో ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోతున్న నేపధ్యానికి సూత్రధారిగా అభివర్ణించదగిన వికీపీడియా ప్రారంభమై పుష్కర కాలం గడచినా... వికీపీడియా అంటే ఏమిటి? అనే సందేహం ఇంకా చాలామందిలో ఉండనే ఉంది. అక్షరజ్ఞానం కలిగిన ప్రపంచ జనావళికి అందుబాటులో ఉంటూ, అభ్యుదయ సాధనలో తనవంతు పాత్రను సేవాభావంతో నిర్వహిస్తున్నదే వికీపీడియా...! పదేళ్ళ కిందట ఆంగ్లభాషలో ఆరంభమైన వికీపీడియా అంచెలంచెలుగా ఎదుగుతూ, ఒక్కొక్క భాషను కలుపుకుంటూ అప్రతిహితంగా సాగుతోంది. ప్రపంచంలోని ప్రతి ప్రధాన భాషలో వికీపీడియా తన ప్రభావాన్ని వెదజల్లుతూ నేటికి 271 భాషలకు విస్తరించి, తన విజయయాత్ర కొనసాగిస్తుండగా.... ఆంగ్లవికీ ప్రారంభమైన రెండేళ్ళ తర్వాత మొదలైన తెలుగు వికీపీడియా ఆరంభంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ క్రమక్రమంగా వేగం పుంజుకుంది. భారతీయ భాషలలో తెలుగుభాష ఔన్నత్యాన్నీ, ప్రత్యేకతనూ చాటిచెబ్తోంది.

మన తెలుగు వికీపీడియా గురించి మన తెలుగు వాళ్ళకి తెలుసా? ఎంతమందికి తెలుసు....? ఈ ప్రశ్నకి ‘చాలా తక్కువ మందికి’ అన్న జవాబు వెంటనే వస్తుంది. వికీపీడియా తెలుగులో ఒకటి ఉందన్న విషయమే తెలియనప్పుడు కొత్తవాళ్ళు ఎలా వస్తారు...? తెలుగు వికీపీడియా అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది...? ఈ సమస్యను అధిగమించాలంటే – ఒక మంచి కార్యక్రమము నిర్వహించడంతోబాటు... దినపత్రిక, ఎలక్ట్రానిక్ మీడియాల లో ప్రముఖంగా ప్రచారం పొందగలిగి నప్పుడు మాత్రమే తెవికీ గురించి కొన్ని వేల మందికి ఏకకాలంలో తెలుస్తుంది. తద్వారా – మన రాష్ట్రంలో, మన దేశంలో, ఇతర దేశాలలో ఉన్న తెలుగు ప్రజలకు చేరువ కాగలుగుతాం...! ఇదే ‘తెలుగు వికీపీడియా సర్వ సభ్య సమావేశం’ ముఖ్య ఉద్దేశ్యం...!
ఈ ఉగాది 'తెలుగు వికీ ఉగాది'
ఇది శిక్షణ కార్యక్రమము (ట్రయినింగ్ ప్రోగ్రాం) కాదు
ఇది శిక్షణా కార్యక్రమం (ట్రయినింగ్ ప్రోగ్రాం) కాదు. కేవలం - వికీని తెలుగు ప్రజలకు పరిచయం చేయడం, తెవికీ విస్తృత అభివృద్ధికి కృషి చెయ్యడం - ఈ ' సర్వ సభ్య సమావేశం ’ ప్రధాన లక్ష్యం. అందరం కలిస్తే లక్ష్య సాధన మరింత సులభమవుతుంది. తెవికీ అక్షర సుసంపన్నమవుతుంది. 
తెవికీ గురించి సమాచారం తెలుసుకొని అందులో పాల్గొని తమకు తెలిసిన సమాచారం అందరికీ పంచే అద్భుతమైన అవకాశం కొరకు ఇదే మా ఆహ్వానం.

మరింత సమాచారం కోసం కొరకు ఈ లింకులు చూడండి
వికీ గురించి మరింత
http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%85%E0%B0%82%E0%B0%A4%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A4%E0%B1%80%E0%B0%AF_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE

సమావేశం గురించి మరింత
http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B5%E0%B1%87%E0%B0%B6%E0%B0%82/2013_%E0%B0%A4%E0%B1%86%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B5%E0%B1%87%E0%B0%B6%E0%B0%82