Thursday, May 14, 2009

మా ఊరి గ్రంధఆలయము

శ్రీ రామచంద్ర గ్రంథాలయము.
మాఊరి గ్రంధాలయము గూర్చి ఎంత చెప్పినా తక్కువే అనుకోవచ్చు నిజానికి అది మాకొక బడి, ఒడి స్నేహితుడిలాంటిది. నా చిన్నపుడు ఊహ తెలియకముందే మానాన్నగారితో కలసి ఆ గ్రంధాలయంలో అడుగు పెట్టానని తెలుసు. చందమామ చేతికిచ్చి ఆయన పేపరు చదువుతుంటే చందమామ,బొమ్మరిల్లు లో బొమ్మలు చూడటం అటు తరువాత ఊసుబోక చదివేవాళ్ళను చూడటం, పుస్తకాలు పేపర్లు ఎగరకుండా పెట్టే చిన్న చెక్కముక్కలతో బల్లలమీద మోదటం, అందరూ హటాత్తుగా నన్నే చూస్తుంటె ఏమీ తెలియని వాడిలా చటుక్కున మానాన్న ప్రక్కకెళ్ళి దాక్కోడం జ్ఞాపకమున్నది.
తరువాత
వచ్చీరాని చదువుతో కధలు చదవటానికి పడిన అవస్థ జ్ఞాపకమున్నది. ఆపై ట్వింకిల్ పుస్తకాల సీరియల్స్, పంచతంత్రం, గలివర్ యాత్రలు, సింధుబాద్ సాహసాలు, పరమానందయ్య శిష్యుల కధలు, రామకృష్ణమఠం వారి అందమైన రంగుల పుస్తకాలైన బొమ్మలకధలు, పిల్ల రామాయణం, బొమ్మల భారతం, లాంటి వాటి నుండి ఎగురుకుంటూ వారపత్రికలు, మాసపత్రికలు లాంటి పుస్తకాలకు అలవటుపడటం ఠంచనుగా వారం వారం చదవటం తెలుసు. వాటి తరువాత తరమైన మదుబాబు,పానుగంటి లాంటి డిటెక్టివు పుస్తకాలు శెలవు,శెలవుల్లోనూ రోజుల తరబడి కూర్చొని చదవటమ్. మా వాళ్ళు చదువు చదవక పనికిమాలిన పుస్తకాలు చదువుతున్నానని కోప్పడటం తెలుసు. అటునుండి వేసవి శెలవుల్లో రుచిమరిగి ఇప్పటి వరకూ విడవలేకున్న నవల్ల గురించి చెప్పేదేముంది మీకే తెలుసు. ఇదంతా ఎందుకంటే నాకా అదృష్టం మా గ్రంధాలయం వలనన్నమాట.

అటువంటి గ్రంధాలయం గురించి కుతంత చిన్నగా చెప్పేసి మిగించేత్తాను. 1870 లో స్థాపించబడిన ఈ గ్రంథాలయము జిల్లాలోనే అతి పెద్ద గ్రంధాలయములలో ఒకటి.. మొదట చిన్న తాటాకు పాకలో మొదలైన ఈ గ్రంధాలయము 1914 లో పండిత రుద్రరాజు నరసింహరాజుగారి ప్రోత్సాహముతో భవనముగా రూపుదిద్దుకొని 1962 కు రెండు అంతస్తులుగా ఒకేసారి రెండువందలమంది చదువుకోగల సౌకర్యాలు కలిగిన అతి పెద్ద గ్రంధాలయముగా మార్పు చెందినది. ఇది కాదు అది అని కాకుండా...తెలుగు బాషలో ప్రచురించబడే ప్రతి పత్రికా (దిన, పంచ, వార, పక్ష, మాస) ఇక్కడ చూడగలం. ప్రసిద్ద గ్రంధాలనుండి సామాన్య రచయితల నవలల వరకూ అన్నీ ఇక్కడ ఉంటాయి. అక్కడ ఉన్న కొన్ని పుస్తకాల లిష్ట్ రాద్దామనుకొన్నాను కాని మొదలెట్టి వరకూ వచ్చేసరికి నాకు నీరసమొచ్చేసింది. ఇక మిగతావేం రాస్తాం. వదిలేసాం ఓపికున్నపుడు రాద్దాం లే అని. ఎలాగూ వీటిని వికీలో ఎక్కించాలి కనుక లిష్ట్ పూర్తి చేసి తీరతామన్న మాట.


* అద్భుత రామాయణము - అనగారి వెంకతకృష్ణరాయడు.
* అద్భుతోత్తరరామాయనము - నాదెళ్ళపురుషోత్తముడు.
* ఆధ్యాత్మరామాయణము - కోటమరాజు నాగయామాత్యుడు.వావిళ్ళవారు
* అనిరుద్ద చరిత్రము - కనుపర్తి అబ్బయామాత్యుడు. సాహిత్యాకాడమీ
* అభినవాంధ్ర విష్ణుపురానము - అఛ్యుతరామామాత్యుతకవి.
* అమరజీవి అల్లూరి - దండు వెంకటరామరాజు.
* అభినవ భారతము - మతకపల్లి మాధవకవిమంజువాణి ఏలూరు
* అరుణాచల ఖండము - జనమంచి శేషద్రిశర్మ
* ఆంధ్రశ్రీమద్రమాయనము 7 సంపుటములు- జనమంచి శేషద్రిశర్మ
* ఆంధ్రవాల్మీకి రామాయణము 7అ సంపు - వావికొలను సుబ్బారావు.
* ఆంద్రమహాబారతము - నన్నయ,త్క్కన,ఎర్రాప్రగడ.వావిళ్ళ్ళవారు
* ఆంధ్రపురానము - మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి
* ఆంధ్ర బ్రహ్మాండపురాణము - జనమంచి శేషద్రిశర్మ తణుకు
* ఆంధ్ర భవిష్యపురానము - మల్లాది సూర్యనారాయణశఅస్త్రి. తణుకు
* ఆంధ్రలింగపురాణము - ములుగు చంద్రమౌళీశ్వరశాస్త్రి. రజతముధ్రాక్షరశాల.
* ఆంధ్రస్కాందపురాణము - జనమంచి శేషద్రిశర్మ
* ఉత్తరరామాయనము- కంకటి పాపరాజు.వావిళ్ళ
* ఉత్తర హరి వంశము - నచనసోముడు వావిళ్ళ
* కపిలదేవహూతి సంవాదము - పోతన. బాలభక్త సమాజము పోడూరు.
* కవి కర్ణరపాయనము - సంకుసాల నృసింహకవి.
* కంద రామాయణముం గంధపెద వీరభద్రరఅవు. రామానంధగౌడీయ మఠము.కొవ్వూరు.

5 comments:

రాధిక said...

గ్రంధాలయమది అందరిదీ - పుస్తకములందరి నేస్తములే

తాడేపల్లి said...

"...నిజానికి అది మాకొక బడి,వడి స్నేహితుడిలాంటిది..."

వడి = వేగం
ఒడి = కూర్చున్నప్పుడు కాళ్ళ ఆధారంతో ఏర్పడే ప్రదేశం (క్రోడమ్)

[ఒ] కి [వ్] ప్రత్యామ్నాయం కాదు.

Viswanadh. BK said...

@తాడేపల్లి గారూ కృతజ్నతలు. ఒడిగా మారుస్తున్నాను.

నేస్తం said...

నేను కాలేజ్ లో ఉన్న గ్రంధాలయం తప్ప బయట గ్రంధాలయానికి ఒక్క మారు వెళ్ళలేదు ఇండియాలో ..ఈ సారి ఇండియా వచ్చినపుడు తప్పని సరి వెళ్ళాలి

Anonymous said...

Can you also provide the Wiki Link, that you write. You write really some very interesting stuff.