Saturday, November 29, 2014

రా.. రా.. రౌడి, రా.. రా.. రౌడి


రా.. రా.. రౌడి, రా.. రా.. రౌడి,  రా.. రా.. రౌడి రా..రా.. అనే సరికి రౌడీఫెలో సినిమాకు వెళ్ళా, కొల్లేరు, లోసరి ప్రాంతాలను అందంగా తెరకెక్కించారు. సీరియస్ కామెడీ బాగా పేలింది. డవిలాగులు బావున్నాయి. సినిమా నిజంగానే బావుంది. అయితే సినిమాలోలా నిజ్జంగానే జరిగుంటే ఇంకా బావుండు అనిపించింది.


చిన్నప్పటి నుండి కొల్లేరు పెద్దింట్లమ్మ ఉత్సవాలకు వెళ్ళే నాలాంటి వారికి అలా అనిపించడం ఏమాత్రం తప్పుకాదు. కొల్లేరును నాశనం చెయ్యాలని కంకణం కట్టుకొన్న రాజకీయ, అరాజకీయ శక్తులను నాశనం చేసే కధాంశం ఉన్న ఈ సినిమాలోలా నిజంగా జరగాలి. ఎపుడో జ్నాపకాలలో, నీటిని చీల్చుకువెళుతున్న పడవ క్రిందుగా దాగుడుమూతలాడే చేపలు, రొయ్యలు, పీతలు ఇతర జలజీవాలు అద్దం లాంటి నీటిలో అద్భుతంగా కనిపించే తైలవర్ణచిత్రం లాంటి కొల్లేరు. ప్రతి సంవత్సరం మసకబారుతూ సన్నబడిపోతుంటే ఇక వెళ్ళడం అనవసరం అనుకోవడం మళ్ళీ సంవత్సరం బయలుదేరటం పరిపాటి అయిపోయింది.

కాని మేము వెళుతున్న లాంచి ప్రమాదం జరిగి దాన్నుంచి బయట పడిన తరువాత మళ్ళీ వెళ్ళలేదు. ఇపుడు సినిమాలో కొల్లేరు పరిశరాలు చూసాక ఇక వెళ్ళే అవసరమేలేదు అనిపించింది.

Wednesday, November 26, 2014

గౌతమీ గ్రంధాలయం

గౌతమీ గ్రంధాలయం ఇది కందుకూరి వీరేశలింగం  గారిచే బలపర్చబడిన 20 వేల పై చిలుకు గ్రంధాల భాండాగారం. మొదట రెండు చిన్న గ్రంధాలయాలైన వాసురాయ, రత్నకవి కలగలిపి ఏర్పడినదే గౌతమీ గ్రంధాలయం. దీనికి గ్రంధాలయ సంఘ కార్య దర్శి అయిన పాటూరి నాగేశ్వర రావు గారి ప్రోద్భలం వలన 1920లో వావిలాల గోపాల కృష్ణయ్య గారి సహకారంతో  లైబ్రరీ ప్రాంతీయ స్థితి పొందినది. 1979 లోప్రభుత్వం దీని నిర్వహణ చేపట్టింది.చదువరులు, పుస్తక సేకరణలు పెరుగుదలతో లైబ్రరీ రాజమండ్రి లో టౌన్‌హాల్ కు తరలించబడింది.

లైబ్రరీ కంచిమర్తి సీతారామ చంద్రరావు (Kanchumarti Seetaramachandra Rao)  , జైపూర్ శ్రీ రాజా విక్రమార్క దేవ వర్మ రాజా (1869-1951) (Jaipur Raja Vikrama Deva Varma) , చిలకమర్తి లక్ష్మీ నరసింహం (Chilakamarti Laksmi Narasimham) , భమిడిపాటి కామేశ్వరరావు (Bhamidipati Kameswara Rao) , కాశీనాధుని నాగేశ్వర రావు పంతులు (Kasinathuni Nageswararao)  , కట్టమంచి రామలింగా రెడ్డి (Cattamanchi Ramalinga Reddy), పాటూరి నాగభూషణం వంటి వ్యక్తులు పోషకులుగా ప్రఖ్యాతిని కలిగి ఉన్నది.

దీనినికేవలం గ్రంధాలయంలా నిర్వహించడం కాకుండా
* విద్యార్ధులకు ఉపయుక్తంగా కాంపిటీషన్ విభాగం,
* డిజిటల్ లైబ్రరీ కంప్యూటర్ విభాగం,
* పేపర్ విభాగం,
* గ్రంధ విభాగం
* బయట గోడపై రోజువారీ కార్యక్రమాల వివరాలు వివరాల నమోదు
ఇలా విడగొట్టబడి ఉండటం వలన చదువరులకు మంచి అనుభూతినిస్తుంది. 
More About In English  -  https://en.wikipedia.org/wiki/Gowtami_Grandhalayam

Saturday, June 7, 2014

So be care before buy EPSON

So be care before buy EPSON
నా దగ్గరున్న epson printer రిపేరుకొస్తే (ప్రింట్ ఇచ్చినపుడు ఇంక్ ముద్దలు ముద్దలుగా పడుతుంది) పాలకొల్లు నుండి 80 కి.మీలు ప్రయాణించి రాజమండ్రి ఎప్‌సన్ సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్ళాను. సాయంత్రం రమ్మని ఇందులో ఇంక్ లేదు ప్రింట్ చూడ్డానికి పట్టుకెళ్ళిపొండి అన్నీ సెట్ చేసాం, ప్రోబ్లం ఏం లేదు అన్నాడు. ఇంటికి తీసుకొచ్చి ఇంక్ తెచ్చి చూస్తే ఆన్ బటన్స్ రెడ్ కలర్ బ్లింకింగ్ చూపిస్తుంది తప్ప మరేం రావడం లేదు. వాళ్ళకు ఫోన్ చేస్తే మళ్ళీ పట్టుకు రండి చూస్తాం అన్నారు. మళ్ళీ చూసినందుకు చార్జెస్ పడుతాయా అని అడిగితే పడుతాయి అన్నాడు.
నేను వెంటనే EPSON కంపెనీకి ఫోన్ చేస్తే వారెంటీ ఉందా అన్నాడు లేదన్నాను. అయితే మేము కంప్లెయింట్ తీసుకోలేము అన్నాడు. మళ్ళీ మీరు సర్వీస్ చార్జెస్ పే చేయాల్సిందే అన్నారు. అదేం ఆనందమో అర్ధం కాలా ?. వారెంటీ అయిపోతే కంపెనీ జవాబుదారీ కాదనేది నాకస్సలు కొరుకుడు పడని సత్యం. శతకోటి లింగాల్లో మనమో బోడి లింగం కనుక ... మూసుకొని మళ్ళీ వాడి దగ్గరకే తీసుకెళ్ళడం తప్ప మరేం చేయలేమనేదీ సత్యమే (లేదంటే విజయవాడో, హైదరాబాదో వెళ్ళాలి :))