Wednesday, April 29, 2009

ఏడు వారాల నగలు.


ఏడు వారాల నగల గురించి వినే ఉంటారు. రోజుకు కొన్ని నగల చొప్పున
ఏడు రోజులకూ కేటాయించబడిన నగలను ధరించేవారు అప్పటి రోజులలో.
తిదులను, నక్షత్రాలను, రాశులను అనుసరించి ఒక్కోరోజు ఒక్కో సెట్ నగలన్నమాట.

అవేమిటో చూద్దామా (కాదు చదువుదాం)


ఆదివారం - సూర్యుని కోసం కెంపుల కమ్ములు, హారాలు మొదలగునవి.
సోమవారం - చంద్రుని కోసం ముత్యాల హారాలు, గాజులు మొదలగునవి
మంగళ వారం - కుజునికోసం పగడాల దండలు, ఉంగరాలు
బుధ వారం - బుధుని కోసం పచ్చల పతకాలు, గాజులు మొదలగునవి.
గురువారం - బౄహస్పతి కోసం పుష్యరాగపు కమ్ములు, వడ్డాణము, ఉంగరాలు.
శుక్రవారం - శుక్రుని కోసం వజ్రాల హరాలు, ముక్కు పుడక మొదలగునవి.
శనివారం - శనికోసం నీల మణి హారలు, ఉంగరాలు మొదలగునవి.

ఇది నిజానికి నా మూసేయాలనుకొనే http://viswanath123.blogspot.com/ బ్లాగులోనిది. ఇది ౨౦౦౭లో రాసాను.

1 comment:

Unknown said...

విశ్వనాథ్ గారూ,
కమ్ములు ని, కమ్మలు(పోగులు) గా మార్చగలరు.... Please

నేను మా అమ్మమ్మ గారి దగ్గర ఈ ఏడు వారాల నగలు చూశాను, చాలా చిన్నప్పుడు...
కానీ, ఈ వర్గీకరణ వుంటుందని ఇప్పుడే తెలుసుకున్నాను..Many Thanks