Thursday, January 22, 2015

కరుప్పు సామి (Karuppu Sami)



కరుప్ప సామి అనే ఒక దేవతామూర్తిని తమిళనాడులోని పల్లె ప్రాంతాలలో కొలుస్తారు. దాదాపు మన హనుమాన్ మాదిరిగా పెద్ద మీసాలతో అజానుబాహువుగా కండల దండలతో దర్శనమిచ్చే కరపు సామి ఊరి పొలిమేరల్లో ఎక్కువగా దర్శనమిస్తాడు. 







ఈయన గురించిన కధనాలలో ఒకటి.
రామయణ కాలంలో రామూడు సీతను అడవిలో వదిలేయగా ఆమె వాల్మీకి వద్ద కుశలవులను కంటుంది.  కుశలవులు ఒకరు బంగారు వర్ణంలోనూ, మరొకరు మేఘ వర్ణంలోనూ ఉంటారు. ఒకసారి సీత వాల్మీకి వద్ద ఇద్దరు పిల్లలను వదిలి బయటకు వెళుతుంది. వాల్మీకి ధ్యానంలోకి వెళ్ళి కొంత సమయం తరువాత ధ్యానం నుంది బయటకు వచ్చి చూడగా  కుసుడు కనిపించడు. ఎంత వెదికినా కనిపించక పోవుటచే అదే విధంగా ఉండే ఉండే ఒక శిశువును ధర్భల నుండి పుట్టిస్తాడు. తరువాత సీత తన నిజమైన కుశుని కనుగొన్నపుడు మాయా కుశుని గురించి ఆమెకు వివరించి ఆ కుమారుని కూడా మిగతా ఇద్దరు కుమారులతో పాటుగా పెంచమని చెపుతాడు.
సీత వనవాసానంతరం రాముని వద్దకు చేరుకున్నపుడు, రాముని వద్దకు ఇద్దరు కుశులు వస్తారు. దానితో కొంత అయోమయానికి గురి అయిన రాముడు తన కుమారులతో అగ్నిని దాటి రమ్మంటాడు. నిజమైన కుశుడు, లవుడు దానిని ఏమాత్రం హాని జరగకుండా దాటి వస్తారు. కాని వ్యాస సృష్టి అయిన కుశుని శరీరం మాత్రం నల్లగా కమిలిపోతుంది. రామునికి జరిగినదంతా తెలుస్తుంది. దానితో కాలిన బాలుని దీవించి అతడిని కరుప్ప సామి (నల్లని వాడు) గా పిలిచి తనకు భద్రత కొరకు అనుచరునిగా ఉండమని ఆదేశించాడు.
 

కరుప్ప స్వామి యొక్క రూపం ఒక్క మూతి, కిరీటం మినహాయిస్తే సుమారు హనుమంతునిలానే ఉంటుంది. చేతిలో కత్తి, డాలు, కర్ర లాంటివి పట్టుకొని ఊరికి రక్షకునిలా ఉంటాడు. దేవాలయాలు ఉండవు కాని ఊరి మొదలు లేదా చివరలలో ఈ విగ్రహాలు ఉంటాయి. కరుపస్వామి మూర్తులలో ఎక్కువగా నల్లగా ఉన్నా కూడా హనుమంతునిలా అనేక రంగుల్లో కూడా ఉంటాయి.

Saturday, November 29, 2014

రా.. రా.. రౌడి, రా.. రా.. రౌడి


రా.. రా.. రౌడి, రా.. రా.. రౌడి,  రా.. రా.. రౌడి రా..రా.. అనే సరికి రౌడీఫెలో సినిమాకు వెళ్ళా, కొల్లేరు, లోసరి ప్రాంతాలను అందంగా తెరకెక్కించారు. సీరియస్ కామెడీ బాగా పేలింది. డవిలాగులు బావున్నాయి. సినిమా నిజంగానే బావుంది. అయితే సినిమాలోలా నిజ్జంగానే జరిగుంటే ఇంకా బావుండు అనిపించింది.


చిన్నప్పటి నుండి కొల్లేరు పెద్దింట్లమ్మ ఉత్సవాలకు వెళ్ళే నాలాంటి వారికి అలా అనిపించడం ఏమాత్రం తప్పుకాదు. కొల్లేరును నాశనం చెయ్యాలని కంకణం కట్టుకొన్న రాజకీయ, అరాజకీయ శక్తులను నాశనం చేసే కధాంశం ఉన్న ఈ సినిమాలోలా నిజంగా జరగాలి. ఎపుడో జ్నాపకాలలో, నీటిని చీల్చుకువెళుతున్న పడవ క్రిందుగా దాగుడుమూతలాడే చేపలు, రొయ్యలు, పీతలు ఇతర జలజీవాలు అద్దం లాంటి నీటిలో అద్భుతంగా కనిపించే తైలవర్ణచిత్రం లాంటి కొల్లేరు. ప్రతి సంవత్సరం మసకబారుతూ సన్నబడిపోతుంటే ఇక వెళ్ళడం అనవసరం అనుకోవడం మళ్ళీ సంవత్సరం బయలుదేరటం పరిపాటి అయిపోయింది.

కాని మేము వెళుతున్న లాంచి ప్రమాదం జరిగి దాన్నుంచి బయట పడిన తరువాత మళ్ళీ వెళ్ళలేదు. ఇపుడు సినిమాలో కొల్లేరు పరిశరాలు చూసాక ఇక వెళ్ళే అవసరమేలేదు అనిపించింది.

Wednesday, November 26, 2014

గౌతమీ గ్రంధాలయం

గౌతమీ గ్రంధాలయం ఇది కందుకూరి వీరేశలింగం  గారిచే బలపర్చబడిన 20 వేల పై చిలుకు గ్రంధాల భాండాగారం. మొదట రెండు చిన్న గ్రంధాలయాలైన వాసురాయ, రత్నకవి కలగలిపి ఏర్పడినదే గౌతమీ గ్రంధాలయం. దీనికి గ్రంధాలయ సంఘ కార్య దర్శి అయిన పాటూరి నాగేశ్వర రావు గారి ప్రోద్భలం వలన 1920లో వావిలాల గోపాల కృష్ణయ్య గారి సహకారంతో  లైబ్రరీ ప్రాంతీయ స్థితి పొందినది. 1979 లోప్రభుత్వం దీని నిర్వహణ చేపట్టింది.చదువరులు, పుస్తక సేకరణలు పెరుగుదలతో లైబ్రరీ రాజమండ్రి లో టౌన్‌హాల్ కు తరలించబడింది.

లైబ్రరీ కంచిమర్తి సీతారామ చంద్రరావు (Kanchumarti Seetaramachandra Rao)  , జైపూర్ శ్రీ రాజా విక్రమార్క దేవ వర్మ రాజా (1869-1951) (Jaipur Raja Vikrama Deva Varma) , చిలకమర్తి లక్ష్మీ నరసింహం (Chilakamarti Laksmi Narasimham) , భమిడిపాటి కామేశ్వరరావు (Bhamidipati Kameswara Rao) , కాశీనాధుని నాగేశ్వర రావు పంతులు (Kasinathuni Nageswararao)  , కట్టమంచి రామలింగా రెడ్డి (Cattamanchi Ramalinga Reddy), పాటూరి నాగభూషణం వంటి వ్యక్తులు పోషకులుగా ప్రఖ్యాతిని కలిగి ఉన్నది.

దీనినికేవలం గ్రంధాలయంలా నిర్వహించడం కాకుండా
* విద్యార్ధులకు ఉపయుక్తంగా కాంపిటీషన్ విభాగం,
* డిజిటల్ లైబ్రరీ కంప్యూటర్ విభాగం,
* పేపర్ విభాగం,
* గ్రంధ విభాగం
* బయట గోడపై రోజువారీ కార్యక్రమాల వివరాలు వివరాల నమోదు
ఇలా విడగొట్టబడి ఉండటం వలన చదువరులకు మంచి అనుభూతినిస్తుంది. 
More About In English  -  https://en.wikipedia.org/wiki/Gowtami_Grandhalayam

Saturday, June 7, 2014

So be care before buy EPSON

So be care before buy EPSON
నా దగ్గరున్న epson printer రిపేరుకొస్తే (ప్రింట్ ఇచ్చినపుడు ఇంక్ ముద్దలు ముద్దలుగా పడుతుంది) పాలకొల్లు నుండి 80 కి.మీలు ప్రయాణించి రాజమండ్రి ఎప్‌సన్ సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్ళాను. సాయంత్రం రమ్మని ఇందులో ఇంక్ లేదు ప్రింట్ చూడ్డానికి పట్టుకెళ్ళిపొండి అన్నీ సెట్ చేసాం, ప్రోబ్లం ఏం లేదు అన్నాడు. ఇంటికి తీసుకొచ్చి ఇంక్ తెచ్చి చూస్తే ఆన్ బటన్స్ రెడ్ కలర్ బ్లింకింగ్ చూపిస్తుంది తప్ప మరేం రావడం లేదు. వాళ్ళకు ఫోన్ చేస్తే మళ్ళీ పట్టుకు రండి చూస్తాం అన్నారు. మళ్ళీ చూసినందుకు చార్జెస్ పడుతాయా అని అడిగితే పడుతాయి అన్నాడు.
నేను వెంటనే EPSON కంపెనీకి ఫోన్ చేస్తే వారెంటీ ఉందా అన్నాడు లేదన్నాను. అయితే మేము కంప్లెయింట్ తీసుకోలేము అన్నాడు. మళ్ళీ మీరు సర్వీస్ చార్జెస్ పే చేయాల్సిందే అన్నారు. అదేం ఆనందమో అర్ధం కాలా ?. వారెంటీ అయిపోతే కంపెనీ జవాబుదారీ కాదనేది నాకస్సలు కొరుకుడు పడని సత్యం. శతకోటి లింగాల్లో మనమో బోడి లింగం కనుక ... మూసుకొని మళ్ళీ వాడి దగ్గరకే తీసుకెళ్ళడం తప్ప మరేం చేయలేమనేదీ సత్యమే (లేదంటే విజయవాడో, హైదరాబాదో వెళ్ళాలి :))

Thursday, December 12, 2013

కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం

          వికీపీడియా దశాబ్ది ఉత్సవాల సంధర్భంగా తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల అభివృద్ధికి కృషిచేసినవారిని కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం తో సన్మానిస్తున్నది. మీ దృష్టిలో అర్హులైన సభ్యుని లేక మీ పేరునే స్వయంగా ప్రతిపాదన చేయండి. దీని లక్ష్యమేమిటంటే తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల అభివృద్ధికి కృషిచేసిన వ్యక్తులను గుర్తించి సన్మానించటం తద్వారా సభ్యులకు ప్రోత్సాహాన్ని, పునురుత్తేజాన్ని కల్పించడం తద్వారా మరింత వికీ అభివృద్ధికి అ‌వకాశం కల్పించండం. ఎంపిక మండలి ఈ పురస్కారానికి తెలుగులో విజ్ఞాన సర్వస్వానికి నాందిపలికిన కొమర్రాజు లక్ష్మణరావు పేరుబెట్టాలని నిర్ణయించిది. 2013 ఈపురస్కారానికి దశాబ్ది ఉత్సవాల బడ్జెట్ లో 100,000 మొత్తం కేటాయించబడింది. ప్రతి పురస్కార గ్రహీతకు ప్రశంసా పత్రం మరియు 10,000 చొప్పున గరిష్టంగా పది మందికి పురస్కారాలు అందజేస్తున్నది.మీరూ స్వయంగా ఓటింగ్‌లో పాల్గొనవలసిందిగా మనవి...
గడువు: 16 డిసెంబర్ 2013
మరిన్ని వివరాలకు చూడండి

https://te.wikipedia.org/wiki/కొమర్రాజు_వెంకట_లక్ష్మణరావు
https://te.wikipedia.org/wiki/వికీపీడియా:కొమర్రాజు_లక్ష్మణరావు_వికీమీడియా_పురస్కారం

Wednesday, November 27, 2013

నిర్లక్ష్యానికి జవాబు ఈ ఫొటో

నిర్లక్ష్యానికి జవాబు ఈ ఫొటో. ఇది నేషనల్ హైవే నెంబర్ 5. వీళ్ళు పట్టుకొని వేళ్ళాడుతూ వెళ్ళేది లారీని. అదీ ఫుల్ లోడ్ లారీ.....వీళ్ళను ఏమనాలి

Thursday, July 4, 2013

తెలుగు వికీపీడియా - వ్యాసరచన పోటీ

నేటి విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించేందుకు తెలుగు వికీపీడియా తన వంతు కృషి ప్రారంభిస్తోంది. ఈ నేపథ్యంలోనే చదువుకునే విద్యార్థినీ విద్యార్థులకు "చదువు - ఉపాధి" లకు సంబంధించి పలు అంశాలపై వ్యాసరచన పోటీలను నిర్వహిస్తోంది. ఇది విద్యార్థినీ విద్యార్థులలో కొత్త ఆలోచనలకు ఊపిరిపోయడంతోబాటు, చదువరులకు మంచి కెరీర్ ఎంపికలో తోడ్పడగలదని భావిస్తున్నాం.
ఇక్కడ మేము 20 టాపిక్స్ ఇస్తున్నాం. ఈ 20 టాపిక్స్ పై ఎవరైనా ఎన్నయినా రాయవచ్చు. ఒకే అంశంపై ఎంతమందైనా వ్యాసాలు రాయవచ్చు. వ్యాసానికి బొమ్మలు అందాన్ని తెస్తే; సరైన వనరులు వ్యాస నాణ్యతను పెంచుతాయని గమనించండి. ఉత్తమ వ్యాసరచనకు బహుమతులూ ఉంటాయి.

మొదటి బహుమతి - రూ. 1116/-
ద్వితీయ బహుమతి - రూ. 816/-
తృతీయ బహుమతి - రూ. 516/-
కన్సొలేషన్ బహుమతులు - ఐదుగురికి 

విద్య, ఉపాధి అంశానికి సంబంధించి రాయదగిన వ్యాసశీర్షికలు

  1. ఎలా చదువుకోవాలి ?
  2. మంచి మార్కులు రావాలంటే ...
  3. ఉత్తీర్ణతా శాతం పెరగాలంటే ...
  4. సప్లిమెంటరీ రాయడం మంచిదేనా ?
  5. బహుళజాతి సంస్థలు - ఎంపిక విధానం.
  6. పదవ తరతతి తర్వాత ఎందులో చేరాలి ?
  7. విద్యార్థి ఆలోచనా తీరు ఎలా ఉండాలి ?
  8. చదువు కూడా ఒక ఆటే !
  9. వృత్తి విద్యలు - మెళకువలు.
  10. చార్టెడ్ అకౌంటెన్సీ చదవడం సులభమేనా ?
  11. ఇంజనీరింగ్ విద్య - ఉపాధి అవకాశాలు.
  12. వైద్యవిద్యలో రాణించాలంటే ...
  13. ఆర్ట్స్ గ్రూప్ - బంగారు భవిషత్తు.
  14. ర్యాంకుల మాయాజాలం.
  15. ర్యాంకు ముఖ్యమా ? నాలెడ్జి ముఖ్యమా ?
  16. పతోతరగతి, ఇంటర్ లలో బట్టీ విధానం మంచిదేనా ?
  17. లెక్కలంటే చుక్కలు కనిపిస్తున్నాయా ?
  18. జర్నలిజం ఓ ఉపాధి మార్గం.
  19. కార్పొరేట్ పాఠశాలలు- శిక్షణ పొందిన ఉపాధ్యాయుల కొరత
  20. ప్రభుత్వ పాఠశాలలే మేలు!
మరిన్ని వివరాలకై చూడండి
http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%86%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF,_%E0%B0%89%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A7%E0%B0%BF

Saturday, June 15, 2013

'కాజా'


 కాజా అంటే నోరూరని వారుండరు. అందరికీ అందుబాటు ధరలలో ఏ చిన్న షాపులోనైనా దొరికే మంచి మిఠాయిలు, కాజాలు 

 

తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరంలో తయారయ్యే మిఠాయి విశేషం,  'కాజా'  దాని విశిష్టత కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల మన్ననలు పొంది,  ''తాపేశ్వరం కాజా'' గా ప్రసిద్ధి చెందింది.

తాపేశ్వరం గ్రామానికి చెందిన  పోలిశెట్టి సత్తిరాజు  కాజాకు విశిష్టతను ఆపదించినవారిలో ప్రముఖుడు. అప్పట్లో మైదాపిండితో మడతలు పెట్టి కాజాలను కొత్తగా తయారు చేసి పంచదార పాకం పట్టి అమ్మగా వాటి కమ్మదనం, రుచి కారణంగా కొద్దికాలంలోనే కాజా ప్రజాభిమానం పొందింది. క్రమేణా తాపేశ్వరంకాజాగా ప్రశస్తమైంది. 

ఇక్కడి కాజాలు పలు రాకాల సైజులలో లభ్యమౌతాయి. చిట్టి కాజాల దగ్గర నుండి సుమారు ఐదు కేజీల వరకూ బరువుండే జంబో కాజాల వరకూ లభ్యమౌతాయి. 

శుభకార్యాలలో తాపేశ్వరం కాజా కఛ్ఛితంగా ఉండి తీరుతుంది..  సాధారణంగా వాడే సైజులు 50 గ్రాముల నుంచి 500 గ్రాములు వరకు బరువుండే విధంగా రకరకాల సైజులలో వీటిని తయారు చేస్తారు. 1990లో సత్తిరాజు మరణించాక ఆయన వారసులు ఈ వ్యాపారాన్ని ఆధునిక పద్ధతుల్లో నిర్వహించడం మొదలుపెట్టారు. కాజా తయారిలో యంత్రాలను ప్రవేశపెట్టి, కాజాల తయారీని సులభతరం, వేగవంతం చేశారు.

ఈ నాడు ఈ తాపేశ్వరం కాజా తయారీ అనేది ఒక కుటీర పరిశ్రమగా మారినది. రాష్ట్రవ్యాప్తంగా తాపేశ్వరం కాజా పేరుతో 300 వరకు స్వీట్ స్టాల్స్ వివిద పట్టణాలలో గలవు. దీనిపై సుమారు 15000 మందికి పైగా ఉపాది పొందుతున్నారు. 

తాపేశ్వరం నుంచి కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు మొదలైన రాష్ట్రాలకు కాజాలు ఎగుమతి అవుతున్నాయి.

Wednesday, April 10, 2013

అందరికీ ఆహ్వానం


అందరికీ ఆహ్వానం
తెలుగు మీద ప్రేమ, తెలుగుదనంపై అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొనదగిన చైతన్య వేదిక వికీపిడియా చైతన్య వేదిక. అనంతమైన జ్ఞాన సముపార్జనకై ఎక్కడెక్కడొ వెతుకుతూ ఉండే అంతర్జాల జీవులకు జ్ఞా సంపాదనకు, జ్ఞాన దానానికి సరియైన వేదిక వికీపిడియా 
  ఉగాది రోజున జరిగే వికీ చైతన్య వేదికలో పాల్గొని మీ యొక్క ఊరి విసేషాలను, మీకు తెలిసిన సమాచారం ఏదైనా దానిని అందరితో పంచుకొంటూ ముందుకు సాగేందుకు మాతో చేతులు కలపండి.
అబిడ్స్ బిగ్ బజార్ వద్ద కల గోల్డెన్ త్రిషోల్డ్ అని పిలువబడే సరోజినీనాయుడు స్వగృహం లో కరిగే వికీ సదస్సులకు హాజరై అంతర్జాలలంలో తెలుగు ఉనికిని ప్రపంచానికి చాటుదాం.వికీ సదస్సు సాయంత్రం 4 గంటలకు. ఆశక్తి ఉన్నవారు ఉదయం నుండి జరిగే అనేక వికీ విజ్ఞాన అకాడమీలలో పాల్గొనవచ్చు. మరిన్ని వివరాలకు ఈ లింకులు చూడండి  

http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B5%E0%B1%87%E0%B0%B6%E0%B0%82/2013_%E0%B0%A4%E0%B1%86%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B5%E0%B1%87%E0%B0%B6%E0%B0%82


http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE_-_%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B1%87%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9B%E0%B0%BE_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9C%E0%B1%8D%E0%B0%9E%E0%B0%BE%E0%B0%A8_%E0%B0%B8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%AE%E0%B1%81

Friday, March 15, 2013

వికీపీడియా ఉగాది సభకు ఆహ్వానము


ఒకే ఒక్క క్లిక్ తో ప్రపంచ విజ్ఞాన సర్వస్వాన్ని కంటి ముందు సాక్షాత్కరింపజేస్తున్న ఒకే ఒక్క మీడియా వికీపీడియా. దాదాపు ప్రపంచంలోని అన్ని భాషలలో అంతర్జాల విజ్ఞాన సర్వస్వాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన వికీపీడియా రేపటి తరాన్ని విజ్ఞాన సుగంధాలతో సుసంపన్నం చేస్తుందన్నది అక్షర సత్యం...! సమాచార విప్లవంతో ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోతున్న నేపధ్యానికి సూత్రధారిగా అభివర్ణించదగిన వికీపీడియా ప్రారంభమై పుష్కర కాలం గడచినా... వికీపీడియా అంటే ఏమిటి? అనే సందేహం ఇంకా చాలామందిలో ఉండనే ఉంది. అక్షరజ్ఞానం కలిగిన ప్రపంచ జనావళికి అందుబాటులో ఉంటూ, అభ్యుదయ సాధనలో తనవంతు పాత్రను సేవాభావంతో నిర్వహిస్తున్నదే వికీపీడియా...! పదేళ్ళ కిందట ఆంగ్లభాషలో ఆరంభమైన వికీపీడియా అంచెలంచెలుగా ఎదుగుతూ, ఒక్కొక్క భాషను కలుపుకుంటూ అప్రతిహితంగా సాగుతోంది. ప్రపంచంలోని ప్రతి ప్రధాన భాషలో వికీపీడియా తన ప్రభావాన్ని వెదజల్లుతూ నేటికి 271 భాషలకు విస్తరించి, తన విజయయాత్ర కొనసాగిస్తుండగా.... ఆంగ్లవికీ ప్రారంభమైన రెండేళ్ళ తర్వాత మొదలైన తెలుగు వికీపీడియా ఆరంభంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ క్రమక్రమంగా వేగం పుంజుకుంది. భారతీయ భాషలలో తెలుగుభాష ఔన్నత్యాన్నీ, ప్రత్యేకతనూ చాటిచెబ్తోంది.

మన తెలుగు వికీపీడియా గురించి మన తెలుగు వాళ్ళకి తెలుసా? ఎంతమందికి తెలుసు....? ఈ ప్రశ్నకి ‘చాలా తక్కువ మందికి’ అన్న జవాబు వెంటనే వస్తుంది. వికీపీడియా తెలుగులో ఒకటి ఉందన్న విషయమే తెలియనప్పుడు కొత్తవాళ్ళు ఎలా వస్తారు...? తెలుగు వికీపీడియా అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది...? ఈ సమస్యను అధిగమించాలంటే – ఒక మంచి కార్యక్రమము నిర్వహించడంతోబాటు... దినపత్రిక, ఎలక్ట్రానిక్ మీడియాల లో ప్రముఖంగా ప్రచారం పొందగలిగి నప్పుడు మాత్రమే తెవికీ గురించి కొన్ని వేల మందికి ఏకకాలంలో తెలుస్తుంది. తద్వారా – మన రాష్ట్రంలో, మన దేశంలో, ఇతర దేశాలలో ఉన్న తెలుగు ప్రజలకు చేరువ కాగలుగుతాం...! ఇదే ‘తెలుగు వికీపీడియా సర్వ సభ్య సమావేశం’ ముఖ్య ఉద్దేశ్యం...!
ఈ ఉగాది 'తెలుగు వికీ ఉగాది'
ఇది శిక్షణ కార్యక్రమము (ట్రయినింగ్ ప్రోగ్రాం) కాదు
ఇది శిక్షణా కార్యక్రమం (ట్రయినింగ్ ప్రోగ్రాం) కాదు. కేవలం - వికీని తెలుగు ప్రజలకు పరిచయం చేయడం, తెవికీ విస్తృత అభివృద్ధికి కృషి చెయ్యడం - ఈ ' సర్వ సభ్య సమావేశం ’ ప్రధాన లక్ష్యం. అందరం కలిస్తే లక్ష్య సాధన మరింత సులభమవుతుంది. తెవికీ అక్షర సుసంపన్నమవుతుంది. 
తెవికీ గురించి సమాచారం తెలుసుకొని అందులో పాల్గొని తమకు తెలిసిన సమాచారం అందరికీ పంచే అద్భుతమైన అవకాశం కొరకు ఇదే మా ఆహ్వానం.

మరింత సమాచారం కోసం కొరకు ఈ లింకులు చూడండి
వికీ గురించి మరింత
http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%85%E0%B0%82%E0%B0%A4%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A4%E0%B1%80%E0%B0%AF_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE

సమావేశం గురించి మరింత
http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B5%E0%B1%87%E0%B0%B6%E0%B0%82/2013_%E0%B0%A4%E0%B1%86%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B5%E0%B1%87%E0%B0%B6%E0%B0%82