Saturday, November 29, 2014

రా.. రా.. రౌడి, రా.. రా.. రౌడి


రా.. రా.. రౌడి, రా.. రా.. రౌడి,  రా.. రా.. రౌడి రా..రా.. అనే సరికి రౌడీఫెలో సినిమాకు వెళ్ళా, కొల్లేరు, లోసరి ప్రాంతాలను అందంగా తెరకెక్కించారు. సీరియస్ కామెడీ బాగా పేలింది. డవిలాగులు బావున్నాయి. సినిమా నిజంగానే బావుంది. అయితే సినిమాలోలా నిజ్జంగానే జరిగుంటే ఇంకా బావుండు అనిపించింది.


చిన్నప్పటి నుండి కొల్లేరు పెద్దింట్లమ్మ ఉత్సవాలకు వెళ్ళే నాలాంటి వారికి అలా అనిపించడం ఏమాత్రం తప్పుకాదు. కొల్లేరును నాశనం చెయ్యాలని కంకణం కట్టుకొన్న రాజకీయ, అరాజకీయ శక్తులను నాశనం చేసే కధాంశం ఉన్న ఈ సినిమాలోలా నిజంగా జరగాలి. ఎపుడో జ్నాపకాలలో, నీటిని చీల్చుకువెళుతున్న పడవ క్రిందుగా దాగుడుమూతలాడే చేపలు, రొయ్యలు, పీతలు ఇతర జలజీవాలు అద్దం లాంటి నీటిలో అద్భుతంగా కనిపించే తైలవర్ణచిత్రం లాంటి కొల్లేరు. ప్రతి సంవత్సరం మసకబారుతూ సన్నబడిపోతుంటే ఇక వెళ్ళడం అనవసరం అనుకోవడం మళ్ళీ సంవత్సరం బయలుదేరటం పరిపాటి అయిపోయింది.

కాని మేము వెళుతున్న లాంచి ప్రమాదం జరిగి దాన్నుంచి బయట పడిన తరువాత మళ్ళీ వెళ్ళలేదు. ఇపుడు సినిమాలో కొల్లేరు పరిశరాలు చూసాక ఇక వెళ్ళే అవసరమేలేదు అనిపించింది.

No comments: