కరుప్ప సామి అనే
ఒక దేవతామూర్తిని తమిళనాడులోని పల్లె ప్రాంతాలలో కొలుస్తారు. దాదాపు మన హనుమాన్
మాదిరిగా పెద్ద మీసాలతో అజానుబాహువుగా కండల దండలతో దర్శనమిచ్చే కరపు సామి ఊరి
పొలిమేరల్లో ఎక్కువగా దర్శనమిస్తాడు.
ఈయన గురించిన
కధనాలలో ఒకటి.
రామయణ కాలంలో
రామూడు సీతను అడవిలో వదిలేయగా ఆమె వాల్మీకి వద్ద కుశలవులను కంటుంది. కుశలవులు ఒకరు బంగారు వర్ణంలోనూ, మరొకరు మేఘ వర్ణంలోనూ ఉంటారు. ఒకసారి సీత
వాల్మీకి వద్ద ఇద్దరు పిల్లలను వదిలి బయటకు వెళుతుంది. వాల్మీకి ధ్యానంలోకి వెళ్ళి
కొంత సమయం తరువాత ధ్యానం నుంది బయటకు వచ్చి చూడగా
కుసుడు కనిపించడు. ఎంత వెదికినా కనిపించక పోవుటచే అదే విధంగా ఉండే ఉండే ఒక
శిశువును ధర్భల నుండి పుట్టిస్తాడు. తరువాత సీత తన నిజమైన కుశుని కనుగొన్నపుడు
మాయా కుశుని గురించి ఆమెకు వివరించి ఆ కుమారుని కూడా మిగతా ఇద్దరు కుమారులతో
పాటుగా పెంచమని చెపుతాడు.
సీత వనవాసానంతరం
రాముని వద్దకు చేరుకున్నపుడు, రాముని వద్దకు
ఇద్దరు కుశులు వస్తారు. దానితో కొంత అయోమయానికి గురి అయిన రాముడు తన కుమారులతో
అగ్నిని దాటి రమ్మంటాడు. నిజమైన కుశుడు, లవుడు దానిని ఏమాత్రం హాని జరగకుండా దాటి వస్తారు. కాని వ్యాస సృష్టి అయిన
కుశుని శరీరం మాత్రం నల్లగా కమిలిపోతుంది. రామునికి జరిగినదంతా తెలుస్తుంది.
దానితో కాలిన బాలుని దీవించి అతడిని కరుప్ప సామి (నల్లని వాడు) గా పిలిచి తనకు
భద్రత కొరకు అనుచరునిగా ఉండమని ఆదేశించాడు.
కరుప్ప స్వామి
యొక్క రూపం ఒక్క మూతి, కిరీటం
మినహాయిస్తే సుమారు హనుమంతునిలానే ఉంటుంది. చేతిలో కత్తి, డాలు, కర్ర లాంటివి పట్టుకొని ఊరికి రక్షకునిలా ఉంటాడు. దేవాలయాలు ఉండవు కాని ఊరి
మొదలు లేదా చివరలలో ఈ విగ్రహాలు ఉంటాయి. కరుపస్వామి మూర్తులలో ఎక్కువగా నల్లగా
ఉన్నా కూడా హనుమంతునిలా అనేక రంగుల్లో కూడా ఉంటాయి.
No comments:
Post a Comment