Wednesday, December 12, 2012

కుల దృవీకరణ ధరఖాస్తు పూర్తి చేసారా ?

మీరెవరైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కుల దృవీకరణ ధరఖాస్తు పూర్తి చేసారా ఎపుడైనా ?
అయితే చూడండి అందులో కొన్ని విచిత్రాలు గోచరిస్తాయి (ఇమేజ్ చూడండి)


ఏ కాలంలోనూ తాత పేరు అక్కరలేదు
తాత భార్య అక్కరలేదు
తండ్రి తాత పేరు కావాలి
ముత్తత సంతానం కావాలి
ఇక 8 లో మాత మహుడు
10 లో మాతా మహులు (బహుశా మాతామహులు చాలా మంది ఉంటారని వీళ్ళ అభిప్రాయం కాబోలు
చిన్న బాక్స్ ఇచ్చి అందులో మతము, జన్మస్థానము, పూర్తి చిరునామా రాయమని ఇచ్చారు.
దానికంటే చిన్న బాక్సులో విధ్యా విషయమములు మరియు విధ్యా సంస్థల పూర్తి చిరునామా వివరాలు
ఇక ముత్తత, తండ్రితాత, మాతామహుడు, అమ్మమ్మ, ముత్తత సంతానం (తాత సంతానం కాదండోయ్), వాళ్ళ జన్మతేదీలు అన్నీ కావాలట.


ఆ మద్య నాకు ఫేమిలీ సర్టిఫికేట్ అవసరమైతే దాని కోసం సర్కస్ ఫెట్లు చేయాల్సివచ్చింది. అప్లై చేసిన 75 రోజులకు 40 సార్లు తిరగగా చచ్చీ చెడీ ఇచ్చారు. మొహాలు విసుగ్గా పెట్టుకొని రెండవ ప్రపంచ యుద్దం చేస్తున్న లెవెల్లో అంత త్వరగా ఎలా అవుతుందండీ ఎన్ని చేయాలి అని మాట్ల్లాడేవారు దానికోసం వెళ్ళినపుడెల్లా
మండల ఆఫీసు దగ్గర ఒకాయన అన్నాడు ఇలా,
రెవెన్యూ వాళ్ళు అంటే వేళాకోళంకాదండీ బబూ అచ్చం ఎండమావే చూస్తే దగ్గరలోనే నీళ్ళున్నట్టుంటాయి తీరా దగ్గరకెళితే ఎక్కడొ మైళ్ళ దూరంలో కనిపిస్తాయి అని
నిజం కదా...........

Wednesday, November 21, 2012

మాకూ ఉంటాయ్ పేర్లు

             ఒక వీళ్ళు వాళ్ళు అని కాక ప్రపంచం మొత్తం అనేక ప్రాంతాలలో వాహనాల వెనుక పేర్లు రాయడం జరుతుంటుంది. అయితే పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, ఉత్తర భారతంలోనూ ఉండే లారీల శైలి విభిన్నంగా ఉంటుంది. వాళ్ళు వాహనాలను అద్భుతంగా అలంకరించడం మాత్రమే కాక మంచి పేర్లు కూడా రాయిస్తుంటారు. ఒకప్పుడు మనవాళ్ళు సినిమా పబ్లిసిటీ కొరకు ప్రత్యేకంగా రిక్షాలను చేయించి వాటికి తారల పోటోలను మంచిరంగులలో వేయించి బాగా అలంకరించి వాటిని ఊరూరా తిప్పుతూ సినిమా పాంప్లెట్స్ పంచుతుండేవారు. ఇప్పట్లో వాహనాల అలంకరణ పెద్దగా చేయకపోయినా పేర్లు పెట్టడం మాత్రం బాగా ఫాలో అవుతున్నారు. అలాంటి వాహానాల వెనుక పేర్లను అందరం చూస్తూనే ఉంటాం. 


         ముఖ్యంగా ఆటోల వాళ్ళు పేట్టే పేర్లు కొన్ని చాలా బావుంటాయి. కొందరు ఫిలాసఫీకి సంబందించినవి, మరికొందరు పాపులర్ కోట్స్, మరికొందరు హాస్యం, కొందరు సెటైర్స్, కొందరు సామెతలు ఇలా ఎన్నో చిత్ర విచిత్రమైన పేర్లు పెడుతుంటారు. యముడికి మొగుడు, వేటగాడు, పులి, రుస్తుం, లాంటి సినిమా పేర్లు కూడా రాస్తుండేవారు. ఇక ఇప్పటి యువ డ్రైవర్లు కొత్త సినిమా పేర్లను మార్చి మార్చి వాడుతూ ఎప్పూడూ  కొత్తగా తమ వాహనం కనిపించేలా చేసుకుంటున్నారు. ఆ మద్య నేనొకటి చూసా పాపులర్ అయిన రింగ్ టోన్ వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీని ఒక ఆటో వెనుక ఇలా మార్చారు, 
"వీలైతే నలుగురు పాసింజర్లు కుదిరితే ఒక కిరాయి" అని.

అంత క్రియేటివిటీ ఉంటుంది మన డ్రైవర్లలో. మంచి వెరైటీగా ఉంటాయి అలాంటి కొన్నిటిని చూడండి.
  • నన్ను ముట్టుకోవద్దు
  • కదలడు వదలడు
  • నీ ముద్దు నాకు వద్దు
  • ఆంద్రా కింగ్
  • నిదానమే ప్రధానము
  • నీ ఏడుపే నా ఎదుగుదల
  • అన్నదమ్ముల సవాల్
  • అన్నా తమ్ముడు
  • రాణి రాజు

Thursday, November 15, 2012

బుడుగు, పిడుగు

           "ఈ బొమ్మ నేను. నా పేరు బుడుగు. ఇంకోపేరు పిడుగు. ... ఇంకో అస్సలుపేరుంది. ఇప్పుడు చెప్పడానికి టైము లేదు. కావలిస్తే మా నాన్నని అడుగు"

        ఇది బుడుగు పరిచయం. బుడుగు గురించి తెలియని తెలుగు వారు తక్కువ. ఎందువలన అంటే ఆ పుస్తకం అంత ఫేమస్. బాపు గారి బొమ్మల కారణంగా అది మరింత ఫేమస్ అయ్యి అయ్యి అయ్యి  బుడుగు కాస్తా పిడుగయ్యాడు.
బుడుగు ఆలోచనలు  అనంతం. అవి మనకు అందవు. అలాటి కూని చూడండి.
  • నా అంతవాడు నేను. నన్ను ఎవరూ కొట్టకూడదు. నేను నిఝంగా పెద్దవాడినే అనుకో. ఐతే వాళ్ళే నన్ను కుర్రకుంకా అంటారుగా. అందుకని కొట్టకూడదు.
  • సిగరెట్లు తెల్లగా ఉంటాయిలే. వీటిని బాబాయిలాంటి కుర్రవాళ్ళు కాలుస్తారు. .. మరి నేను పెద్దవాడినిగా. అందుకనే కాలవను. నేను ఇంఖా పెద్దవాణ్ణయ్యాకా జెటకా బండియేనా రైలింజనేనా తోలుతానుగా. అందుకని బీడీలు దాస్తాననుకో. అప్పుడు చెవులో పెట్టుకోవాలిగా. బీడీలు బామ్మ వత్తుల పెట్టెలో దాస్తే భద్రంగా ఉంటాయి...
  • అగరొత్తులు నల్లగా ఉంటాయి. వాటిని గోడమీద గుచ్చి కాలుస్తారు. సిగరెట్లేమో నోట్లో గుచ్చి కాలుస్తారు.
  • ధైర్యం అంటే పోలీసుతో మాట్లాడ్డం. ధైర్యం అంటే సుబ్బలష్మితో మాట్లాడ్డం అని కూడా అర్ధం అట. ఇలా అని బాబాయి చెప్పాడు.
  • డికేష్టివురావు అంటే నాకు తెలీదు. బాబాయికీ తెలీదు. వాడికి కూడా తెలీదట. డికెష్టివురావుకు పెద్ద మీసాలున్నాయి. డికెష్టింగ్ చేసేప్పుడు అవి పెట్టుకోవాలట. అప్పుడు టుపాకీ కూడా పట్టుకోవాలట.
  • బళ్ళోకెళ్ళకుండా ఉండాలంటే చొక్కా ఇప్పేసి ముందుగా ఎండలో నించోవాలి. అప్పుడు వీపుమీద పొట్టమీద జొరం వచ్చేస్తుంది. అప్పుడు పరిగేఠుకుని అమ్మదగ్గిరికెళ్ళి గబగబా చూడూ బళ్ళోకెళ్ళద్దని చెప్పూ అనాలి. లాపోతే జెరం చల్లారిపోతుంది. బామ్మకి చెప్పేస్తే చాలు. .. కడుపునెప్పి మంచిది కాదు ఎందుకంటే పకోడీలు చేసుకొని మనకు పెట్టకుండా తినేస్తారు. అందుకని తలనొప్పి అన్నిటికన్నా మంచిది. ఇది కూడా బామ్మకే చెప్పాలి.
  • అయిసు ఫ్రూటువాడిని పిలిచి ముందుగా రెండు ఎంగిలి చేసెయ్యాలి. అప్పుడు అమ్మ కొనిపెడుతుంది. తరవాత ప్రెవేటు చెబుతుందనుకో. ఈ పెరపంచకంలో ప్రెవేటు లేకుండా మనకి ఏం రాదుగదా మరి?
  • ఒక మేష్టారేమో చెవి కుడివైపుకు మెలిపెడతాడు. ఇంకో కొన్నాళ్ళకి కొత్తవాడొస్తాడు కదా? వాడేమో ఎడమవైపుకి మెలిపెడతాడు. ఇలా అవుతే చెవి పాడైపోదూ? అందుకని ఎటేపు మెలెట్టాలో కొత్తమేష్టరు ముందుగా పాతమేష్టరును కనుక్కుని రావాలి.
  • ఈ పెద్దవాళ్ళు ఒకోసారి అబద్ధం చెబితే తిడతారు. ఒకోసారి నిఝెం చెబితే కూడా ప్రెవేటు చెప్పేస్తారు.
  • చంపడానికి ఇప్పుడు రాచ్ఛసులు అయిపోయారట. అందుకని మనం పదమూడో ఎక్కం, సిబి పాఠం ఇవన్నీ చదూకోవాలట. అవన్నీ వచ్చేస్తే రాచ్ఛసులు చచ్చిపోతారట. మనం బాగా చదూకుని ప్ఫది కాణీలో, వంద కాణీలో తెచ్చినా రాచ్ఛసులు చచ్చిపోతారట. లాపోతే సీగాన పెసూనాంబనిచ్చి పెళ్ళి చైరన్నమాట. ఇలాగని మా రాద చెప్పింది. రాధంటే అమ్మలే.

ఇవి బుడుగు ఆలోచనలు, అద్భుతంగా ఉండే ఇలాంటి మాటలు ఎన్ని సార్లు చదివినా మనసుకు హాయిగా ఉంటుందనడంలో సందేహం లేదు. 
మీరూ మీ పిల్లలతో హాయిగా నవ్వుకోవాలంటే వెంటనే కొనండి బుడుగు.
ఇలాంటి మంచి పుస్తకాలు మన ఇళ్ళలో లేకపోవడం అంటే మన పిల్లలకు మనం చాలా దూరం చేస్తున్నట్టే.

Wednesday, September 19, 2012

గురు ధీం

http://www.youtube.com/watch?v=jmCSBadJcw4

Music Director : A. R. Rehman
Singer : Chithra K. S., Madras Chorale Group, A. R. Rehman

నాకు నచ్చిన మంచి ప్రోత్సాహక ధీం సాంగ్స్ లలో ఇది ఒకటి. కంఫోజింగ్ మీనింగ్ కూడా బావుండే సినిమా

jaage hain deer tak
hamen kuch deer sone do
thodi se raat aur hai
subah to hone do
aadhe adhure khwaab jo
pure na ho sake
ek baar phir se neend mein
woh khwaab bone do
మేలుకొన్నాం చాలా సమయం దాకా
మమ్ము కొంత సమయం నిద్రించనివ్వు
ఇంకా రాత్రి ఉంది
ఉదయం కానివ్వు
మద్యలో ఉన్న కల
పూర్తి కాలేకపొతుంది
మరొక్క సారి నిద్రలో
ఆ కలలోకి పోనివ్వు

Wednesday, August 29, 2012

పగటి వేషాలు

             పగటి వేషాల గురించి తెలియని వారు మనలో చాలా తక్కువ. ప్రస్తుతం చాలా తక్కువ మంది ఉన్నా వారు కూడా పల్లెలలో మాత్రమే కాక పట్తణాలలో కూడా తిరగటం వలన పగటి వేషాల గురించి తెలుసు. అయితే వ్యత్యాసం ఎక్కడంటే ఇప్పటి తరం వాళ్ళు వాళ్ళను అడుక్కొనేవారుగా అనుకోవడం. వారు చెప్పేది అర్ధం కాకపోవడం........ పగటి వేషాలు ప్రజా వినోదం ప్రధాన ఆశయంగా, ప్రజల ఆశలకూ, ఆశయాలకూ దర్పణంగా మనదేశంలో బహుళ ప్రచారం పొందాయి. ప్రత్యేకంగా పగటిపూట ప్రదర్శంచే వేషాలు కావడం వల్ల వీటికి "పగటి వేషాలు" అని నామకరణం వచ్చింది....... పగటి వేషాలలో ఉండే గొప్పతనం ఇతరుల్ని నమ్మించడం. ఒకనాటి పరిపాలకుల దృష్టికి ప్రజల సమస్యలను తీసుకు రావడం, వర్గమానాలను చేరవేయడం కొరకు ప్రధానంగా ఈ ప్రదర్శనలు ప్రచారంలోకి వచ్చాయని ప్రతీతి.

  రోజూ మా వీధికి వచ్చే ఒకటి రెండు వేషధారులను మీకు అందిస్తున్నాను చూడండి. వారు రోజుకొకరు చొప్పున వంతుల వారీ మారుతూ ఉంటారు.
                 
                          పగటివేషాల లక్ష్యం వ్యంగ్యమే. వీరికి రంగస్థలం అంటూ లేదు. ఇంటిగడప, వీధులు, సందులు, గొందులు, అన్ని వీరి రంగస్థలాలే. ప్రదర్శన సమయాల్లో ప్రేక్షకులు, ప్రదర్శకుల మధ్య వ్యత్యాసముండదు. పగటివేషాల్లో కొన్నింటిలో సంభాషణలకు ప్రాధాన్యత ఉంటే మరికొన్నింటిలో పద్యాలకు, అడుగులకు , వాద్యాలకు ప్రాధాన్యత ఉంటుంది. ..... బుడబుడకల వేషం, ఎరుకలసాని వేషం, బోడి బ్రాహ్మణ స్త్రీ వేషం వంటి వాటిలో సంభాషణలకు ప్రాముఖ్యత ఉంటుంది. పురాణ వేషల్లో హార్మోనియం, తబలా వంటి వాద్యాలతో పాటు యక్షగాన శైలిలో ప్రదర్శన ఉంటుంది. కుల సంబంధమైన పగటివేషాలు సంఘంలోని అనేక కులాల వారి జీవనవిధానాన్ని వ్యంగ్యంగా ప్రదర్శిస్తాయి. ప్రతి కులాన్ని గురించి తెలియ చేస్తూ ఆ కులాలపై సమాజం యొక్క అభిప్రాయాలను విమర్శిస్తాయి.
                  
               సంచారిపగటివేషాల వాళ్ళు దాదాపుగా సంచారజీవనం చేస్తూ ప్రదర్శనలిస్తుంటారు. వీళ్ళనే "బహు రూపులు" అనికూడా అంటారు. పగటివేషాల ప్రదర్శన ఒక ఊళ్ళొ నెలల పాటు ఉంటుంది. ప్రతి రోజు ప్రదర్శించి తరువాత చివరి రోజున సంభావనలు తీసుకుంటారు. వచ్చిన సంభావన అందరు పంచుకుంటారు.... వీరు ఆహార్యం, అలంకరణ పట్ల శ్రద్ద వహిస్తారు. సంభాషణలు, వీరు చెప్పే పద్యాలు రక్తి కట్టిస్తాయి. ప్రాచీన కాలంలో అనేక పగటివేషాలు ప్రదర్శింపబడేవి. కాని ఇప్పుడు అన్ని వేషాలు వేయడం లేదు. కారణం జీవనంలో వచ్చిన మార్పులేనని వీరు చెబుతారు. ఒకప్పుడు బోడి బాపనమ్మ వేషం వేసేవారు. కాని ఉదయమే ఈ విధవ మోహం చూడలేమని ఈ వేషంతో మా యింటి వద్దకు రావద్దని చెప్పడం మూలాన ఈ వేషం వేయడంలేదని వీరు వివరించారు. అట్లే కులాలకు , మతాలకు చెందిన సాత్తని వేషం, బ్రాహ్మణ వేషం వంటివి వేయడంలేదు. వీరు ప్రదర్శించే వేషాలలో అర్థనారీశ్వర వేషం ప్రత్యేకమైనది. ఈ వేషం మేకప్ వేయడానికి దాదాపుగా 3 గంటల సమయం పడుతుందని, సాయంకాలం దాకా ఈ మేకప్ ఉండాలికాబట్టి ప్రత్యేకమైన రంగులు వాడతామని వీరు చెబుతారు. ఒకే వ్యక్తి స్త్రీ , పురుష వేషాలు ధరించి సంభాషణలు చెప్పడం అంటే సామాన్యం కాదు. ప్రస్తుత సమాజానికి కొన్ని కళారూపాలు దూరం అవుతున్నవి వాటిలో ఇదే ముందుండడం భాదాకరం... వీరిని ఆదరించేవారూ, అభిమానించేవారూ, కనీసం ప్రభుత్వ పరంగా, ఇతరత్రా ఆర్ధిక సహాయం చేసేవారూ కరువవడంతో రాబోయే రోజులలో పగటి వేషాలు పగటి కలలే అవుతాయి.