ఒక వీళ్ళు వాళ్ళు అని కాక ప్రపంచం మొత్తం అనేక ప్రాంతాలలో వాహనాల వెనుక పేర్లు రాయడం జరుతుంటుంది. అయితే పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, ఉత్తర భారతంలోనూ ఉండే లారీల శైలి విభిన్నంగా ఉంటుంది. వాళ్ళు వాహనాలను అద్భుతంగా అలంకరించడం మాత్రమే కాక మంచి పేర్లు కూడా రాయిస్తుంటారు. ఒకప్పుడు మనవాళ్ళు సినిమా పబ్లిసిటీ కొరకు ప్రత్యేకంగా రిక్షాలను చేయించి వాటికి తారల పోటోలను మంచిరంగులలో వేయించి బాగా అలంకరించి వాటిని ఊరూరా తిప్పుతూ సినిమా పాంప్లెట్స్ పంచుతుండేవారు. ఇప్పట్లో వాహనాల అలంకరణ పెద్దగా చేయకపోయినా పేర్లు పెట్టడం మాత్రం బాగా ఫాలో అవుతున్నారు. అలాంటి వాహానాల వెనుక పేర్లను అందరం చూస్తూనే ఉంటాం.
ముఖ్యంగా ఆటోల వాళ్ళు పేట్టే పేర్లు కొన్ని చాలా బావుంటాయి. కొందరు ఫిలాసఫీకి సంబందించినవి, మరికొందరు పాపులర్ కోట్స్, మరికొందరు హాస్యం, కొందరు సెటైర్స్, కొందరు సామెతలు ఇలా ఎన్నో చిత్ర విచిత్రమైన పేర్లు పెడుతుంటారు. యముడికి మొగుడు, వేటగాడు, పులి, రుస్తుం, లాంటి సినిమా పేర్లు కూడా రాస్తుండేవారు. ఇక ఇప్పటి యువ డ్రైవర్లు కొత్త సినిమా పేర్లను మార్చి మార్చి వాడుతూ ఎప్పూడూ కొత్తగా తమ వాహనం కనిపించేలా చేసుకుంటున్నారు. ఆ మద్య నేనొకటి చూసా పాపులర్ అయిన రింగ్ టోన్ వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీని ఒక ఆటో వెనుక ఇలా మార్చారు,
అంత క్రియేటివిటీ ఉంటుంది మన డ్రైవర్లలో. మంచి వెరైటీగా ఉంటాయి అలాంటి కొన్నిటిని చూడండి.

"వీలైతే నలుగురు పాసింజర్లు కుదిరితే ఒక కిరాయి" అని.
అంత క్రియేటివిటీ ఉంటుంది మన డ్రైవర్లలో. మంచి వెరైటీగా ఉంటాయి అలాంటి కొన్నిటిని చూడండి.
- నన్ను ముట్టుకోవద్దు
- కదలడు వదలడు
- నీ ముద్దు నాకు వద్దు
- ఆంద్రా కింగ్
- నిదానమే ప్రధానము
- నీ ఏడుపే నా ఎదుగుదల
- అన్నదమ్ముల సవాల్
- అన్నా తమ్ముడు
- రాణి రాజు
4 comments:
నేనూ చూస్తుంటా....
ఒక లారీ వెనకాల "ఒళ్ళు భద్రం తమ్ముడు"అని ఉంది.
"నన్ను చూసి ఏడవకురా" ఇది కూడా ఒకటి అందులో:-)
అబ్జర్వేషన్ బాగుంది. `అందరికళ్ళూ ఆమె పైన, ఆమె కళ్ళు నాపైన,` లాంటివి తమాషాగా ఉంటాయి.
baagunnaayi :)
Post a Comment