కాజా అంటే నోరూరని వారుండరు. అందరికీ అందుబాటు ధరలలో ఏ చిన్న షాపులోనైనా దొరికే మంచి మిఠాయిలు, కాజాలు
తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరంలో తయారయ్యే మిఠాయి విశేషం, 'కాజా' దాని విశిష్టత కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల మన్ననలు పొంది, ''తాపేశ్వరం కాజా'' గా ప్రసిద్ధి చెందింది.
తాపేశ్వరం గ్రామానికి చెందిన పోలిశెట్టి సత్తిరాజు కాజాకు విశిష్టతను ఆపదించినవారిలో ప్రముఖుడు. అప్పట్లో మైదాపిండితో మడతలు పెట్టి కాజాలను కొత్తగా తయారు చేసి పంచదార పాకం పట్టి అమ్మగా వాటి కమ్మదనం, రుచి కారణంగా కొద్దికాలంలోనే కాజా ప్రజాభిమానం పొందింది. క్రమేణా తాపేశ్వరంకాజాగా ప్రశస్తమైంది.
ఇక్కడి కాజాలు పలు రాకాల సైజులలో లభ్యమౌతాయి. చిట్టి కాజాల దగ్గర నుండి సుమారు ఐదు కేజీల వరకూ బరువుండే జంబో కాజాల వరకూ లభ్యమౌతాయి.
శుభకార్యాలలో తాపేశ్వరం కాజా కఛ్ఛితంగా ఉండి తీరుతుంది.. సాధారణంగా వాడే సైజులు 50 గ్రాముల నుంచి 500 గ్రాములు వరకు బరువుండే విధంగా రకరకాల సైజులలో వీటిని తయారు చేస్తారు. 1990లో సత్తిరాజు మరణించాక ఆయన వారసులు ఈ వ్యాపారాన్ని ఆధునిక పద్ధతుల్లో నిర్వహించడం మొదలుపెట్టారు. కాజా తయారిలో యంత్రాలను ప్రవేశపెట్టి, కాజాల తయారీని సులభతరం, వేగవంతం చేశారు.
ఈ నాడు ఈ తాపేశ్వరం కాజా తయారీ అనేది ఒక కుటీర పరిశ్రమగా మారినది. రాష్ట్రవ్యాప్తంగా తాపేశ్వరం కాజా పేరుతో 300 వరకు స్వీట్ స్టాల్స్ వివిద పట్టణాలలో గలవు. దీనిపై సుమారు 15000 మందికి పైగా ఉపాది పొందుతున్నారు.
తాపేశ్వరం నుంచి కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు మొదలైన రాష్ట్రాలకు కాజాలు ఎగుమతి అవుతున్నాయి.
No comments:
Post a Comment