Friday, March 15, 2013

వికీపీడియా ఉగాది సభకు ఆహ్వానము


ఒకే ఒక్క క్లిక్ తో ప్రపంచ విజ్ఞాన సర్వస్వాన్ని కంటి ముందు సాక్షాత్కరింపజేస్తున్న ఒకే ఒక్క మీడియా వికీపీడియా. దాదాపు ప్రపంచంలోని అన్ని భాషలలో అంతర్జాల విజ్ఞాన సర్వస్వాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన వికీపీడియా రేపటి తరాన్ని విజ్ఞాన సుగంధాలతో సుసంపన్నం చేస్తుందన్నది అక్షర సత్యం...! సమాచార విప్లవంతో ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోతున్న నేపధ్యానికి సూత్రధారిగా అభివర్ణించదగిన వికీపీడియా ప్రారంభమై పుష్కర కాలం గడచినా... వికీపీడియా అంటే ఏమిటి? అనే సందేహం ఇంకా చాలామందిలో ఉండనే ఉంది. అక్షరజ్ఞానం కలిగిన ప్రపంచ జనావళికి అందుబాటులో ఉంటూ, అభ్యుదయ సాధనలో తనవంతు పాత్రను సేవాభావంతో నిర్వహిస్తున్నదే వికీపీడియా...! పదేళ్ళ కిందట ఆంగ్లభాషలో ఆరంభమైన వికీపీడియా అంచెలంచెలుగా ఎదుగుతూ, ఒక్కొక్క భాషను కలుపుకుంటూ అప్రతిహితంగా సాగుతోంది. ప్రపంచంలోని ప్రతి ప్రధాన భాషలో వికీపీడియా తన ప్రభావాన్ని వెదజల్లుతూ నేటికి 271 భాషలకు విస్తరించి, తన విజయయాత్ర కొనసాగిస్తుండగా.... ఆంగ్లవికీ ప్రారంభమైన రెండేళ్ళ తర్వాత మొదలైన తెలుగు వికీపీడియా ఆరంభంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ క్రమక్రమంగా వేగం పుంజుకుంది. భారతీయ భాషలలో తెలుగుభాష ఔన్నత్యాన్నీ, ప్రత్యేకతనూ చాటిచెబ్తోంది.

మన తెలుగు వికీపీడియా గురించి మన తెలుగు వాళ్ళకి తెలుసా? ఎంతమందికి తెలుసు....? ఈ ప్రశ్నకి ‘చాలా తక్కువ మందికి’ అన్న జవాబు వెంటనే వస్తుంది. వికీపీడియా తెలుగులో ఒకటి ఉందన్న విషయమే తెలియనప్పుడు కొత్తవాళ్ళు ఎలా వస్తారు...? తెలుగు వికీపీడియా అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది...? ఈ సమస్యను అధిగమించాలంటే – ఒక మంచి కార్యక్రమము నిర్వహించడంతోబాటు... దినపత్రిక, ఎలక్ట్రానిక్ మీడియాల లో ప్రముఖంగా ప్రచారం పొందగలిగి నప్పుడు మాత్రమే తెవికీ గురించి కొన్ని వేల మందికి ఏకకాలంలో తెలుస్తుంది. తద్వారా – మన రాష్ట్రంలో, మన దేశంలో, ఇతర దేశాలలో ఉన్న తెలుగు ప్రజలకు చేరువ కాగలుగుతాం...! ఇదే ‘తెలుగు వికీపీడియా సర్వ సభ్య సమావేశం’ ముఖ్య ఉద్దేశ్యం...!
ఈ ఉగాది 'తెలుగు వికీ ఉగాది'
ఇది శిక్షణ కార్యక్రమము (ట్రయినింగ్ ప్రోగ్రాం) కాదు
ఇది శిక్షణా కార్యక్రమం (ట్రయినింగ్ ప్రోగ్రాం) కాదు. కేవలం - వికీని తెలుగు ప్రజలకు పరిచయం చేయడం, తెవికీ విస్తృత అభివృద్ధికి కృషి చెయ్యడం - ఈ ' సర్వ సభ్య సమావేశం ’ ప్రధాన లక్ష్యం. అందరం కలిస్తే లక్ష్య సాధన మరింత సులభమవుతుంది. తెవికీ అక్షర సుసంపన్నమవుతుంది. 
తెవికీ గురించి సమాచారం తెలుసుకొని అందులో పాల్గొని తమకు తెలిసిన సమాచారం అందరికీ పంచే అద్భుతమైన అవకాశం కొరకు ఇదే మా ఆహ్వానం.

మరింత సమాచారం కోసం కొరకు ఈ లింకులు చూడండి
వికీ గురించి మరింత
http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%85%E0%B0%82%E0%B0%A4%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A4%E0%B1%80%E0%B0%AF_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE

సమావేశం గురించి మరింత
http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B5%E0%B1%87%E0%B0%B6%E0%B0%82/2013_%E0%B0%A4%E0%B1%86%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B5%E0%B1%87%E0%B0%B6%E0%B0%82

No comments: