Monday, July 23, 2007

మిలీనియం పార్క్ { కొన్ని మార్పులతో }

మా ఊరిలో ఉన్న పెద్ద చెరువులు రెండిట్లో మొదటిది రామచంద్ర గ్రంధాలయం వీధిలో బాలసంగం ప్రక్కనుండగా రెండవది బస్టాండ్ ప్రక్కనుంది. బస్టాండ్ వైపుకాక రెండవవైపును పార్కుగా మార్చాలని పంచాయితీవారు అనుకొన్నారు. మా పంచాయితీవారికి ఈ కధా కాలంలో ఏమయిందో తెలియదుగాని పూనకం వచ్హినట్లుగా కొన్ని మంచి పనులు ఎడా పెడా చేసేయడం మొదలు పెట్టారు. అప్పటి మంచి పనులల్లో ఒకటి ఇంటింటికీ నాలుగునాలుగు మొక్కలు పంచడం మరియు రోడ్లప్రక్క పాతేందుకు. అవికూడా చందనం, జామాయిలు, కొబ్బరి, రేగు, పనస లాటి మంచివి. ఈమొక్కలను నర్సరీలనుంచి దిగుమతి చేసుకోకుండా నర్సరీలనుండి అనుభవమున్న పనివాళ్ళను తీసుకొచ్హి దాదాపు ఆరేడునెలలు అదే చెరువు గట్టున పంచాయతీవారే పెంచడంచేసారు. పంచడం అయిపోయాక మిగిలిన మొక్కలు ఏంచేయాలనే అలోచనలోనుంచి పార్కుగా మార్చాలనుకొన్నారేమో. మరి కొద్ది రోజులకు చిన్న పెద్దా మెక్కలతో మధ్యమధ్య సిమెంట్ బెంచీలతో అందమైన పార్క్ ముస్తాబయ్యింది. 2000 ముందు పూర్తవడంతో ఒకటవ తేదీన ప్రారంభోత్సవం చేయించారు. అందరూ మిలీనియం పార్కుగా పిలుస్తూండంతో పంచాయితీ వారే ఆపేరుతో ఒక బోర్డు తగిలించేసారు అలా అదేపేరు స్థిరపడిపోయింది. పగలు పంచాయితీ నౌకర్ ఒకతడు చూసుకొంటూ ఉండేవాడు. రోజూ జనం వచ్హి కాసేపు కూర్చొని వాళ్ళ చుట్టూ గడ్డీ గాదం పీకేసి వెళ్ళిపోయేవారు.అక్కడి వరకూ బాగానేఉన్నా సమస్య మొదలైంది రాత్రి సమయాల్లోనే. బస్టాండ్ దగ్గరగా ఉండటమూ ఆటోవాళ్ళ, టాక్సీ వాళ్ళ 'వాహనములు నిలుపు స్థలమూ దాని ప్రక్కనే అవుటచే రాత్రి సమయములలో వారి స్వేచ్హా ప్రపంచమునకు అడ్డాగా' పార్కు మారునను విషయము వేరు చెప్పనక్కరలేదనుకొనుచున్నాను. అక్కడ ఆనిశీధిలో ఆ నిశాచరులు జరుపు అకౄత్యములు వర్నింపతగనివై ఉండుటచే మరువాటి ఉదయమునకు ఆ ఉధ్యానవనము ఉక్కిరిబిక్కియై మహాసంగ్రామంలో వరిగి పడిఉన్న పీనుగులవలె నేలకూలిన వౄక్షాలతో తెగిపడిన తలల్లా దొరలుతున్న విస్కీ రమ్ము బ్రాందీ మొదలగు ప్రఖ్యాతబ్రాండు మధుపాత్రలతోనూ, ఆరగించలేక వదిలివేయబడిన అర బిరియానీ పొట్లాలతోనూ, బక్షించిన బిరియానీ అప్పటికే తిష్ట వేయబడిన మధువుతో ఇమడక తగవులాడి బయటకురికిన కారణమున ఏర్పడిన పోగులతోనూ, మరునాటిఉదయమునకు సర్వాంగ సుందరముగా దర్శనమిచ్హుచుండేది. వీరికి మేము మాత్రము ఎందుకు తీసిపోవలెననో లేక మా వంతు సహాయము మేమున్నూ చేసెదము అనో అటు చుట్టు ప్రక్కల నివసించెడి పురజనులునూ... తెల్లగా వెన్నెల విరజిమ్మే చంద్రుని గాని మేమున్నాంసుమా అనే కరెంట్ దీపాలను గాని లెక్క చేయక వారివారల పిలగాండ్ర సౌకర్యార్దం చెంబులునూ డొక్కులునూ నీటితో గొనిపోయి పిడకలు చేయించెడివారని ఉదయ సమయమున ముక్కును వేళ్ళతో భందించి ఆరహదారిన వేంచేసెడి పురజనుల కధనం. ఇది నిజము కాదని నొక్కి వక్కాణిస్తూ అడిగిన వారిని కరిచేలా ఉరికేవారక్కడి వారు.................ఇట్లు ప్రజోపయోగార్ధం ఏర్పాటు చేయబడిన ఈ ఉద్యానవనం ఇట్టి అకౄత్య కార్యక్రమములకు వేదికగా శోభించుట ఎంతమాత్రమూ సరిగాదని తక్షణం ఒక కార్యాచరణ ప్రణాళిక ద్వారా ఒంటి మానవుని ఎంక్వయిరీకమీషన్ అను ఒకటి గుబ్బల ఎర్రియ్య అనే గ్రామ పంచాయితీ నౌకరుతో ఏర్పాటు చేయబడినది.తన ఎంక్వయిరీలో భాగంగా పరిశోధనాకార్యక్రమములునెరుపుటకై ఆ రాత్రి వెళ్ళిన ఎర్రియ్య మరునాటి ఉదయం ఆరెంపీ డాట్టర్ మసేనురావు గారి మకాంలో తెల్లని బాండేజీలతో తేలాడని తెలియ వచ్హింది. కారణాల కోసం మిలీనియం పార్క్ పరిసరప్రాంతములయందు వెదుకడానికి ప్రయత్నించగా దొరకినవేమిటనగా......గొల్లిగాడు. మా పిల్లల్నే చింతబరికెతో కొడతాడా, ఆడి చేతులిరిగిపోను. ఆడోళ్ళని కూడా చూడకుండా అంతలేసిమాటలంటాడా ఈడి జిమ్మడిపోను....ఇక వినలేక ఈ కారణాలు సరిపోతాయని పారిపోయిన సంగతి ప్రక్కనపెడదాం.---లోపాయికారీగా తెలిసిన విషయమేమంటే కుమ్మింది ఆడోళ్ళుకాదు ఆటో డ్రైవర్స్ అని కాని వాళ్ళను రెచ్హగొట్టింది మాత్రం వీళ్ళేనట.------ఇక ఎర్రియ్యను ఆ పరిస్థితిలో చూసిన పంచాయితీ పెద్దలు బెద్ద మీటింగ్ బెట్టి కుస్తీలు మల్లగుల్లాలు మరమరాలు తినేయడం పూర్తయ్యేకా తీసుకున్న నిర్ణయం, మరో ఎల్లయ్యనో,పుల్లయ్యనో ఒంటిమనిషి కమీషనర్ గా పెట్టేందుకు సాహసించలేక మిలీనియం పార్కును మిలీనియంలోనే అంతం చేసేయాలని తొక్కి చంపేయగా మిగిలిన మొక్కలనుకూడా పీకించెయ్యాలని నిర్ణయించేసారు... ....బల్లలను మాత్రం వదిలేసారు పిల్లలు బచ్హాలాడుకొనేందుకుఅలా మాఊరి మిలీనియం పార్క్ మట్టికలిసిపోయింది.శిదిలాలు మాత్రం మిగిలేఉన్నాయ్. పార్కు స్థిరమని తలచి ఫొటో తీయనందుకు మదీయకర్మంబిట్లే తగలడినదని మిక్కిలి చింతించుచూ...........శెలవ్."

9 comments:

oremuna said...

ఈ గ్రాంధికం అవిడియా ఏమీ బాగోలేదు

ఐ జస్ట్ స్కిప్ప్డ్ ఇట్

Viswanadh. BK said...

పైత్యము ప్రకోపించినదని తెలియజేసినందులకు
అందుకొనుడీ కృతజ్ఞతలు.
ఈసారి గురి చూసి కొట్టగలందులకు ప్రయత్నించగలవాడను.

కొత్త పాళీ said...

ఒరెమునా గారు చెప్పినది సత్యమని నొక్కి వక్కాణించు చున్నవాడను :-)

రాధిక said...

మా ఊర్లో అయితే రోడ్ వేద్దామని వేసిన కంకరను పొద్దన్నకి మాయం చేసేసారు.ఇలాగే వుంటాయి పల్లెటూర్లలో సంగతులు.

Valluri Sudhakar said...

మీ గ్రాంధిక (?) భాషలో వ్రాసిన పొస్ట్, సర్కారి వారి బ్రహుత్కార్యములలా, మీ ఊరి వారికి మిలేనీయం పార్కులా, సందర్శకులకి కొరుకున పడక నిరుపయోగమవుతున్నది. దయచేసి, సరళమైన భాషలో, అదేనండి, మానవ భాషలో వ్రాసి మమ్ములనుద్దరింపచేయగలరని ప్రర్ధన.

...వల్లూరి

విశ్వనాధ్ said...

ఈ పోష్ట్ ఇంత భీభత్సంగా ఉన్నదని ఊహించలేదు సుమీ
రుచిగా కొరుకుడు పడేలా చేయ ఉపక్రమించుచున్నానని
తెలియచేయ సంతోషించుచున్నాడను

జ్యోతి said...

బచావ్ ప్లీజ్..........

Viswanadh. BK said...

కిస్కో బచానాహై! కైకేలియే బచానాహై!బతాధీజియే.
ఫిర్ భీ ఆప్ కో కిసీకా కామెంట్ దేనా ఆధతీ నహీహై.
జోభీహొ ముజే ఆప్ కీ కామెంట్ మిల్ గాయీ షుకృయా షుకృయా..

oremuna said...

మొదటిది అలాగే ఉంచి, దీన్ని మరొక పోస్టుగా వ్రాయాల్సింది