జీవితంలో వేగం పెరిగి కొన్ని చిన్న చిన్న ఆనందాలను దూరం చేసుకొంటున్నాం. కొంచెం సమయం చిక్కించుకొని తోటపని లాంటివి చేసుకొంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, మెదడు ఫ్రెష్ అవుతుంది.కాదా? ఉదయాన్నే లేచి నిన్న పాతిన మొలకలు ఎంత పెరిగాయో, ఏ మొగ్గలు పువ్వులుగా మారాయో, ఏ పూత పిందెలుగా మారాయో, చూసుకొంటూ, వాటిని శుభ్రం చేయడం నీళ్ళు పోయడం పెద్ద పనేంకాదుకధ.
అరె భయ్ ! గీడ కాలు పెట్టనీకి జాగ లేదు. గీ అపార్ట్ మెంట్లల మొక్కల్ గిక్కల్ అంటవ్. ఏడనుంచ్హొచ్హినవ్ దిమాఖ్ గిట్ట ఖరాభయిందర.
అరే ఏందే అన్న గట్లంటవ్. మొక్కలు పెంచనీకి జగా కావల్నా ఏంది. ప్లాంట్లున్నయ్ గాదె ఈడ కిడికిల ఒగటి, ఆడ టివి పక్కనొకటి, గాడ బెడ్రూంల జాగా ఉండెగాదె ఆడొకటి, ఇటు చూడన్నా గిసంటి ప్లేస్ల గులాప్పూల మొక్కెడితే రూంకేం అందమొత్తదన్నా........
ఇలా చెయ్యచ్హు అని నే చెపాల్సిన అవసరం లేదు. అందరికీ తెలుసు కాకుంటే కొంచెం బద్దకం. ప్రొద్ధుటే లేచేందుకే ఎంతో కష్టపడాలి, ఇక ఇలాంటి చిన్న చిన్న పనులు చేయాలంటే మరెంత కష్టపడాలో .
తెల్లవారుజామున తీసిన రెండు ఫొటోలను ఇక్కడిచ్హాను. చూసి మీరానందిస్తే నాకూ ఆనందమే.
అందులో ఒక ఫొటో నే తయారు చేసిన మడి. చూసారుగా ఇది చాలా చిన్నపని కొంత నేల గడ్డపారతో తవ్వి మట్టి గడ్డలను చిన్నగా చిదిపి ఒక బకెట్ నీళ్ళు పోసి మెత్తగా ఉన్న మట్టిలో మెంతులుఒకప్రక్క, ధనియాలు ఒకప్రక్క, గోంగూర విత్తనాలు ఒక ప్రక్క, ఇలా ఎన్నైనా వేయచ్హు. మా అమ్మగారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్ గా తీసుకొచ్హుకుంటారు. వాళ్ళకూ వీళ్ళకూ కూడా ఇస్తుంటారు. చూసారా చిన్నపని వలన తాజా సరుకు దాంతో ఆరోగ్యం దాంతరువాత ఆనందం.
4 comments:
Hai Vissu, I have seen your blog just now. మీ బ్లాగ్ చదువుతున్నప్పుడు యండమూరి వారి 'ఆనందోబ్రహ్మ' లో సోమయాజి పాత్ర గుర్తొస్తుంది.
photos are very good, content as well!
మీకా పాత్ర గుర్తొచ్హేలా నాబ్లాగున్నందుకు నాకానందంగా ఉందండి. tankyou werymuch.
కిరణ్మయి గారూ మీక్కూడా.
విశ్వనాథ్ గారూ
మా సీతారామపురాన్ని భలేగా పోల్చేసారండీ.మా ఊరుకు అటు సముద్రం,ఇటు గోదావరి కూడా ఉన్నాయండీ.నిజమే మా ఊరి చుట్టూ జీడిమామిడి, మామిడి,సపోటా,శీతాఫలం తోటలే.సరుగుడు తోటలకు మా ప్రాంతం ప్రసిద్ధం.మా ఊరికి పెట్టని కోటలు కోరాడులు (అంటే ఒకరి భూమికి మరొకరి భూమికి సరిహద్దులుగా ఇసుక దిబ్బలు వేసి వాటి మీద బ్రహ్మజెముడు, నాగజెముడు పాతుతారు)సీతాకాలంలో మంచు కమ్ముకున్న మా ఊరులో బారులు తీరిన తెల్లటి బ్రహ్మజెముడు పువ్వులను చూసితీరాల్సిందే . మా ఊరు చాలా అందంగా, అద్భుతంగా ఉంటుందండి.
Post a Comment