Tuesday, July 15, 2008
రహదారిమిత్రులు
మా ఊరు నరసాపురం, నిదదవోలుల మద్య మెయిన్ రోడ్డు నుండి రెండు, రెండున్నర కిలో మీటర్లు లోపలికుంటుంది. అందువలన రాత్రి పది దాటాక "రాత్రి" సినిమా మొదటిపార్టులా ఉంటుంది అక్కడి వాతావరణం. మనిషన్న వాడు కనిపించడు, లోపలికెళ్ళేందుకు ఏ విధమైన వాహనాలు ఉండవు. పదకొండు అయితే ఇక మరీ భయంకరం. దారంతా కొన్ని చోట్ల తప్ప పూర్తిగా కరెంటు దీపాలు కూడా ఉండవు. ఆ సమయంలో ఏ ముఖ్యమైన పని మీద అయినా ఆలస్యం అయిన వాళ్లకు చచ్చే చావే.
అనవసరంగా వచ్చాం రా' బాబూ అనుకొంటూ నడుస్తున్న వాళ్ళకు వెనుకగా దీపాల వెలుగుతోపాటు మోటార్ సైకిల్ సౌండ్ వినిపిస్తుంది. వెనుక సీటుపై పెద్ద అల్యూమినియం పాలకేను, దానికి రెండుప్రక్కలా మరో రెండు పాలకేనులు, ముందువైపు రెండు ఇత్తడి బిందెలు, ఇంకా డ్రైవింగ్ సీటుపై ఒక భారీ ఆకారం కనిపిస్తుంది. అది పాల వ్యాపారం చేసే గుబ్బల శ్రీనివాస్ అనే శాల్తీది. దారిలో నడిచెళ్లేది ఒకరే అయితే సీటులోనే ఏదో విదంగా ఇరికించి వాళ్ళనువాళ్ళకు కావలసిన ఇంటి దగ్గర్లోని దారిలో దించేస్తాడు. ఇద్దరుంటే వెనక సీటుపై కల పాలకేనుపై కూర్చోబెట్టి పడిపోకుండా ఎలా పట్టుకోవాలో సూచనలు ఇచ్చి భయ్యమని పోనిస్తాడు. ఆ సమయంలో ఎవరున్నా అక్కడ జరిగేదదే. మీ కేం భయ్యం లేదు నేను తీస్కేల్తా కదా జాగర్తగా అని భరోసాతో సైతం తీసుకెళ్లడం రోజూ పాల వ్యాపారం చేసి పొద్దుపోయిన తరువాత వచ్చే అతని అలవాటు. అసలే పాలకేను దానిపై మరో మనిషి కూర్చుంటే ఎలా ఉంటుంది. సింహాసనం మీద రాజు కూర్చున్నట్టుగా అనిపిస్తుటుంది అలా ఎప్పుడైనా ఎవరినైనా తీసుకొస్తున్నపుడు చూస్తే
ఇక రెండవ వ్యక్తి - పేపరు విలేకరిగా పనిచేస్తూ పదకొండు గంటలకు వచ్చే మారుతి. అతని సైకిల్ ప్రయాణంలో ప్రతిరోజూ ఎవరో ఒకరు ఊరి వరకూ రావడం కూడా మామూలుగా కనిపించే దృశ్యమే. కొత్తవాళ్ళు మొహమాట పడుతారేమోనని అడిగి మరీ తీసుకెళ్ళడం ఇతడి ప్రత్యేకత.
అలసట పని ఒత్తిడి లాంటివి వారికి ఉండవా అనుకొంటాం మేము. పని చేసి చేసి అలసిపోయి కూడా రాత్రి సమయంలోలో అలా ఒకరికి హెల్ప్ చేయాలని అనుకోవడం అదీ తెలియని వారికి సైతం.
కనిపించకుందా సేవ చేసే ఇలాంటి వాళ్ళు నిజంగా గొప్పోళ్ళు
అవునా? కాదా?
Posted by
Viswanadh. BK
at
3:03 PM
7
comments
Labels: మా ఊరి సంగతులు
Tuesday, April 8, 2008
హైదరా'బాధ 'లో
బ్లాగు మిత్రులందరకూ వందనాలు. మరి కొందరి బ్లాగు మిత్రులతో నేనుకూడా చేరేందుకు గ్రేటర్ అని గుర్తించిన అత్యంత చెత్త, కాలుష్య నగరమైన భాగ్యనగరమునకు జీవనోపాధికొరకై ఉధ్యోగము వెతుకుతూ వచ్చేసాను.కొంత వరకూ బాగుగనే ఉన్నా- ఎక్కువ కష్టకార్యమనబడినది మటుకు గధి వెతుకులాట అని తెలియబడినది. అందులోనూ పెండ్లి అయిన వారికి కొన్ని మినహాయింపులు కలవులెండి. కేవలం బ్రహ్మచారులమైన మమ్మే నిజముగా చారులలన్నట్లుగా ట్రీట్ చేస్తూ షాదీ అయిందా అని అడిగి లేదనంగానే 'చల్ చల్ రూమ్ గీమ్ నయ్' అని తరిమేస్తున్నారు.కావున బాధలకు పేరు పడిన హైదరా'బాధ 'లో ఎంతో ఓపికతో నివసిస్తూన్న యావన్మంది బ్రహ్మచారి బ్లాగ్మిత్రులకూ మనవి చేయునది ఏమనగా నాకు అత్యవసరముగా కూకట్పల్లి,హౌసింగ్ బోర్డ్, నిజాం పేట్ ఏరియాలలో ఏదో ఒక చోట ఒక గది కావలెను. మీకు లేదా మీ మిత్రులకు తెలిసిన' గది' విశేషాలు ఉంటే నాకు తెలియ చేయగలరని మనవి.
kiran kumar chava గారు చెప్పినందున బడ్జెట్ విషేషాలు కూడా చేర్చుతున్నాను. అద్దె - రెండు నుండి మూడు వేల వరకూ భరించగలను.వంట - వండుకొనుట 'సేప్ఫ్' అని తేలిన మిదట అలా డిసైడ్ అయిపోయాను.
పోస్టు ఇచ్చిన తరువాత
కొందరు ఇచ్చిన జవాబులు బావున్నా అవేవీ నాకు ఉపయోగ పడువిధంగా లేవు. దయచేసి నాకు ఉపయోగంగా జవాబులు ఉంటే మరింత సంతోషపడి ఉండేవాడిని
సదా కృతజ్ఞతలతో మీ.... విశ్వనాధ్
Posted by
Viswanadh. BK
at
8:03 PM
8
comments
Labels: హైదరాబాద్ విశేషాలు.
Sunday, March 2, 2008
పట్టి
పట్టి అంటే మళయాళ బాషలో కుక్క. మళయాళీలు పోడా పట్టి అంటూ ఉంటారు. మనది ఆ పట్టి కాదు. కాలవలను, బోదెలను దాటేందుకు ఒక దుంగను అడ్డుగా వేస్తుంటారు. గోదావరి జిల్లాలలో అలా కాలవలపై ఉండే దుంగలను పట్టి అని వ్యవహరిస్తుంటారు. తాటి, కొబ్బరి చెట్లను ఇలా ఎక్కువగా వినియోగిస్తుంటారు. చిన్న కాలవలకు చెట్ల కొమ్మలను వాడుతుంటారు. తమ పంట చేలకు నీళ్ళు పెట్టేందుకు ఈ పట్టి అనేదాన్ని ఆధారం చేసుకొని తాటాకులతో, కొబ్బరి ఆకులతో ఒక దడిలా కడతారు. దాంతో నీరు కొంతవరకూ ఆగి వాళ్ళ చేలలోకి వెళుతుంటుంది. పట్టి అనే వీటిపై నడి చేందుకు కొంత ప్రావీణ్యం అవసరం. అదే వర్షాకాలమైతే మరీ అద్భుతమైన ప్రావీణ్య అవసరం. కొత్త వారైతే నేర్వకుండానే డాన్సు చేయచ్చు తడిచిన వీటిపై. అయిటే అలాంటి సంధర్భాలలో కూడా పొలాల్లో పని చేసే కూలీలు పెద్ద మోపులను తలపై పెట్టుకొని సునాయాసంగా చక చకా నడిచి వెళ్ళిపోతుంటారు దీనిపై.
మా ఇంటికి దగ్గరలో చిన్న కాలువలు చాలా ఉన్నాయి. చిన్నప్పటి నుండీ పొలాలలో తిరగటం అలవాటైన నాకు అలాంటి పట్లపై నడవటం అలవాటే. అందుకే ఇలా. 
కాకుంటే మా స్నేహితుల పరిస్థితేమిటో మీరూ చూడండి."
Posted by
Viswanadh. BK
at
1:24 PM
5
comments
Saturday, September 29, 2007
నగర రహదారులకు మేమేల తీసిపోవలె
Posted by
Viswanadh. BK
at
10:48 AM
24
comments
Tuesday, September 18, 2007
మాఊరంటే నాకిష్టం
వేమూరి వేంకటేశ్వరరావు, మాఊరంటే నాకిష్టం : {తుని వ్యాసభాగము నుండి}
రైల్ మీల్భోజనం-విషయంలో కూడ తుని పర్యాటకులని బాగానే ఆకర్షించిందని చెప్పవచ్చు. ఆవిరి యంత్రాలు ఇంకా బాగా చలామణీలో ఉన్న రోజులలో నీళ్ళు తాగడానికి తునిలో ప్రతి రైలు బండి విధిగా కనీసం పదిహేను నిమిషాలు ఆగవలసి వచ్చేది. అంతే కాకుండా మెడ్రాసు మెయిలు (2 అప్), హౌరా మెయిలు (1 డౌన్), రెండూ మధ్యాహ్నం భోజనాల వేళకి తునిలో ఆగేవి. అలాగే సాయంకాలం భోజనాల వేళకి నైన్ డౌన్, టెన్ అప్ ఆగేవి. ఒక్క మొదటి తరగతి ప్రయాణీకులకి తప్ప భోజనం రైలు పెట్టెలోకే సరఫరా అయే సదుపాయం ఆ రోజులలో ఉండేది కాదు. కనుక తుని ‘మీల్స్ హాల్ట్’. తునిలో భోజనం బాగుండేదని ఉత్తరాది వారు, దక్షిణాది వారు కూడ చెప్పేవారు. భోజనం తర్వాత కిళ్ళీకి కూడ తుని ప్రసిద్ధమే. తుని ఊరు మట్టిలో ఏమి ఉందో కాని అక్కడ పెరిగే తమలపాకుల రుచి ఇంతా అంతా కాదు. దేశం అంతా ప్రసిద్ధి. విజయనగరం తమలపాకులు అరిటాకుల్లా ఉండేవి. తుని ఆకుల్లో కవటాకులు నోట్లో వేసుకుంటే ఇలా కరిగి పోయేవి. తుని తమలపాకులు లేకపోతే కాకినాడలో నూర్జహాన్ కిళ్ళీ ఉండేదే కాదు. హొటల్లో భోజనం చేసి, కోటయ్య కొట్లో కాజా కొనుక్కు తిని, తర్వాత నూర్జహాన్ కిళ్ళీ వేసుకుని సినిమాకి వెళ్ళటం అంటే పాత రోజులలో ఒక లగ్జరీ. తుని స్టేషను నుండి బయలుదేరి, రైలు కట్ట వెంబడి నడచి తాండవ నది మీద ఉన్న రైలు వంతెనని దాటుకుని పాయకరావుపేట వైపు వెళితే, అక్కడ ఎడం పక్కని ఒక పెద్ద బియ్యపు మిల్లు, దాని పక్కని కొండంత ఎత్తున, పిరమిడ్ లా ఒక ఊక పోగు, వీటికి వెనక ఒక పెద్ద మేడ కనిపిస్తాయి. ఊక అమ్మి ఆ మేడ కట్టేరని మా ఊళ్ళో ఒక వదంతి ఉంది. అందుకని దానిని ఊక మేడ అనేవారు. ఎందుకూ పనికిరాదనుకునే ఊకని పేడతో కలిపి పిడకలు చెయ్యవచ్చనీ, ఇటిక ఆవాలలో వేసి కాల్చ వచ్చనీ, కాలిన ఊక నుసితో పండ్ల పొడి చెయ్యవచ్చనీ గమనించి, అటువంటి “పనికిమాలిన” ఊకని అమ్మి మేడలు కట్టగలిగే చాకచక్యం మా ఊరి వర్తకులకి ఉందనిన్నీ అప్పుడు తెలిసింది. స్టేషన్‌కి ఎదురుగా ఉన్న కిళ్ళీ బడ్డీ దగ్గర గోలీ సోడా తాగి, ఆ పక్కనే ఉన్న రీడింగ్ రూం కి వెళ్ళి పేపరు చదవటం చాలమందికి దైనందిన కార్యక్రమాలలో ఒకటిగా ఉండేది. రీడింగ్ రూము అంటే లైబ్రరి కాదు. ఇరవై అడుగులు పొడుగున్న ఒక పెద్ద గది, ఆ గది నిండుగా ఈ కొస నుండి ఆ కొసకి ఒక పొడుగాటి బల్ల, దానికి రెండు వైపులా కుర్చీలు. బల్ల మీద రెండో మూడో ఇంగ్లీషు దిన పత్రికలు, ఒకటో, రెండో తెలుగు దిన పత్రికలు, ఏదో నామకః వారపత్రికలు, ఉండేవి. వాటి కోసం గది ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉండేది. ఎనాటమీ లేబులో శవాన్ని కోసినట్లు, పేపరుని ఏ కీలుకా కీలు విడగొట్టేసి, తలో మూలకీ పట్టుకు పోయి చదువుకునే వారు. ముందు పేజీ ఒకడు నిలబడి చదువుతూ ఉంటే, దాని వెనక పేజీ మరొకడు ఒంగుని చదివే వాడు.ఈ గది పక్కగా చిన్న కొట్టు. అందులో ఒక రేడియో ఉండేది. ఆ రేడియోనే బయట అరుగు మీద ఉన్న లవుడ్ స్పీకర్ కి తగిలించేవారు. సాయంకాలం ఐదింటికి వార్తలు, ఆ తర్వాత సంగీతం పెట్టేవారు. తునిలో ఉన్న సామాన్య జనసందోహానికి అదొక్కటే రేడియో. రీడింగ్ రూము బయట అరుగు మీద ఎప్పుడూ ఎవ్వరో ఒకరు చదరంగం ఆడుతూ ఉండేవారు. ఆడేవాళ్ళు ఇద్దరు, చూసే వారు, సలహాలు ఇచ్చేవారు పది మంది! అరిగిపోయిన ఆ చదరంగం బల్ల మీద గళ్ళు కనిపించేవే కావు.పూర్వకాలంలో ఎప్పుడో ఒక నాడు జ్యెష్ఠా దేవి (పెద్దమ్మ), లక్ష్మీ దేవి (చిన్నమ్మ) “నేను బాగుంటానంటే నేను బాగుంటాను” అని రివాజుగా తగువాడుకున్నారుట. తగువాడుకుని, మరెక్కడా ఊళ్ళే లేనట్టు, తునిలో సెట్టి గారింటికి తగువు తీర్చమని వచ్చేరుట. సెట్టి గారి గొంతుకలో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. ఎటు తీర్పు చెప్పినా చిక్కే! ఆలోచించి, “అమ్మా, చిన్నమ్మా! నువ్వలా లోపలికి వస్తూంటే బాగున్నావు. చూడు జ్యెష్టమ్మా! నువ్వు అలా బయటకి వెళుతూంటే బాగున్నావు,” అని తీర్పు చెప్పేరుట. తెలుగు భాషలో తుని తగువు తీర్చినట్లు లేదా తుంతగువులు తీరవుగాని అన్న జాతీయానికి వెనకనున్న గాథ ఇది. ఇలా కర్ర విరగకుండా, పాము చావకుండా మాట్లాడే చాకచక్యం తుని వర్తకులకే ఉందని చెబుతారు...
నాకు ఈ వ్యాసభాగం చాలా నచ్చింది.కాని తెలుగు వికీలో ఈ వ్యాసాన్ని ఎడిట్ చేస్తున్నప్పుడు ఈ భాగాలనుండి చాలావరకూ కత్తిరించి తీసేయాల్సి రావడం బాగా అనిపించలేదు. కత్తిరించే భాగాలను ఒక టపాగా ఇస్తే... అనే ఆలోచన రావడంతో ఇది ఇలా మీ ముందుకొచ్చింది.
Posted by
Viswanadh. BK
at
4:30 PM
8
comments
Tuesday, September 11, 2007
అమ్మాయి ఎందుకేడుస్తుంది.
ఈ మద్య మా ఫ్రెండ్స్ నన్ను బాగా మోసేస్తున్నారు. అనుకోకుండా వాళ్ళకో కారణం దొరికేసింది. ఆమద్య మంచి మూడ్లో ఉన్నపుడు ఒక అందమైన అమ్మాయి చిత్రాన్ని భీభత్సంగా గీకేసాం... అయితే మనమెంత భీభత్సంగా గీకామో ఆ బొమ్మ అంత సున్నితంగా వచ్హేసింది. సరే బావుంది కదాని రూముకు తీసుకుపోయి చిన్నగా ఫ్రేం కట్టి గోడకు తగిలించా. అదిగో అదే పెద్ద తప్పయి పోయింది.... ఇంతకూ నే వేసిన లేదా గీసిన చిత్రం ఏమిటంటే విచారగా ఏడుస్తున్న ఒక అమ్మాయి. ఇక అప్పటినుండి దాన్నెవడు చూస్తే వాడు నన్ను మోసేయటం మొదలెట్టారు. ఒరే ఎందుకురా ఆ అమ్మయిని అలా ఏడిపిస్తావ్ అంటాడొకడు. ఏరా ఏంచేసావురా ఆ అమ్మాయి అలా ఏడుస్తుంది అంటాడింకొకడు. ఎందుకురా అ అమ్మాయి ఎప్పుడూ ఏడుస్తుంటుంది అంటాడు మరొకడు. రోజూ ఎందుకురా అలా ఏడిపిస్తావ్ అడిగిందేదో ఇవ్వచ్హుగా ఎవరూ లేరనుకున్నవా తాట వలుస్తా అంటాడొకడు. ఈ రోజు కూడానా! రోజూ ఏడిపిస్తానే ఉంటవేంట్రా మరో డైలాగ్.. నాన్ స్టాప్ క్రైయింగ్లో గిన్నిస్ కెళ్ళాలనేంట్రా.... ఇలా నా మెదడు 'తడిగిణతోం తడిగిణతోం' అని వాయించేసుకుంటున్నారు. ప్రతిరోజూ.... ఇక వాళ్ళ బాధ పడలేక అక్కడినుంచి పీకేసి స్కాన్ చేసేసాను. ఇక చించి కుప్పతొట్లో ఆ బొమ్మను...అప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది...
Posted by
Viswanadh. BK
at
6:32 PM
20
comments
Wednesday, August 22, 2007
పాపికొండల్లో రెండవ పోష్ట్.
ఇంతకు ముందు పోష్టులో కొంతవరకూ రాసాను ఇది కొనసాగింపు. మా ప్రయాణ ప్రయాణ విశేషాలలో రాజమండ్రి నుండి ఆ సాయంత్రం టికెట్స్ తీసుకొని వెనక్కొచ్హిన మేము శనివారం రాత్రి రాజమండ్రి వెళ్ళాలని నిర్ణయించుకొన్నాము. ఆదివారం ఉదయం 5 గంటలకు రేవులో ఉండాలని చెప్పారు. ఉదయం 5 గంటలంటే ఎవడులేస్తాడు. అందుకనే ముందురోజన్నమాట. అనుకున్నట్లుగా శనివారం సాయంత్రం మూటా ముల్లే సర్దుకొని అందరం బయలుదేరాం. మెయిన్ రోడ్డుకు వచ్హి ఎంతసేపు ఎదురు చూసినా రాజమండ్రి బస్సు మాత్రం రాలేదు. 'చత్ మంచి టైంలో బయలుదేరలేదురా మనం' మావాళ్ళకామెంట్స్ మొదలైనయ్. మరి బస్సే కావాలంటె ఇలాగే ఉంటుంది.ఏదో ఓదాంట్లో పోయేదానికి మరికొందరు నసుగుతుండటంతో అప్పుడే వచ్హిన రాజమండ్రి క్వారీ లారీ ఆపి దబదబా పైకెక్కేసారంతా..రావులపాలెం కడియం మీదుగా వేమగిరి రూట్లో రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గరగా వదిలేసిపోయాడు లారీవాడు. రోడ్డు మీద అంగుళానికో గొయ్యిఉండటం వలన లారీవాడు వచ్హిన స్పీడుకి మేము వెనుక ఎక్కడానికి సరిపోవడంతో ఎవడూ కొట్టకుండానే తన్నులు తిన్నవాళ్ళలా అయిపోయింది మా పరిస్థితి.అక్కడి నుండి పడుతూలేస్తూ ఆటోలకోసం వెతకటం మొదలెట్టారు. కాళీగా ఉన్న ఒక ఆటో వచ్హింది. అది అలా ఆగటం ఆలస్యం నేనంటే నేనని టపటపా ఎక్కేసారు. ఆరుగురెక్కవలసిన ఆటోలో పదిమంది ఎక్కేయడంతో ఆటోవాడు బిత్తరపోయి పోలీసులు పట్టుకుంటారు సార్ ఇంతమందెక్కేస్తే ఆన్నాడు. ఒరేయ్ నువ్వు దిగరా! అంటే కాదు నువ్వు దిగరా! అనుకొంటూ మొత్తానికి నలుగురు బయట పడ్డారు. వెంటనే ఇంకో రెండు ఆటోలు రావడంతో అందరం చకచకా ఎక్కేసాం. తిన్నగా మార్కండేయస్వామి గుడి దగ్గర దిగి అటుప్రక్కగా ఉన్న ఆర్యవైశ్య సత్రానికి వెళ్ళాం. ఒక రూము తీసుకొని బ్యాగులన్నీ ఒక మూల పడేసి స్నానాలు వగైరా పూర్తి చేసుకొని రోడ్లమీద పడ్డాం. కాసేపు అలాలా తిరిగి ముందే వివరాలు తెలియడంవలన మరుసటి రోజుకు ఏమేమికావాలో తీసేసుకోవాలనుకొన్నాం. బిస్చెట్ పాకెట్స్ , హౌసీగేం పాకెట్ మరియు పుస్తకం, చిప్స్ పాకెట్స్ , యాపిల్స్ , ఒక ప్లాస్టిచ్ చాప ఇలా చాలా ఐటెంలు తీసుకొన్నారు. అన్నీ కొనడం అయిపోయాక అక్కడ మంచి భోజనహొటల్ గురించి కొంత సమాచారం సేకరించి ఒక హొటెల్ కెళ్ళి భోజనం కానిచ్హి మెల్లగా తిరిగి రూముకు బయలుదేరాం. గదిలో ఒకేచాప ఉంది మేము ఒకటి కొని తెచ్హాం రెండిటితో ఇంతమంది ఎడ్జస్ట్ అవడం కష్టం కాబట్టి సత్రం వాళ్ళను బ్రతిమాలో మరెలాగో మరో రెండు చాపలు సంపాదించారు. తీసుకొచ్హిన చాపలు వేయటమే ఆలస్యం అన్నట్టుగా ఒరేయ్ నేనిక్కడరా,కొంచెం పక్కకి జరగరా, ఒరేయ్ నువ్విక్కడనుంచి పోరా,ఒరేయ్ నాక్కొంచెం చోటివ్వండిరా,నేనిక్కడ పడుకోనెహె పందిగాడు మీదకాళ్ళేస్తున్నాడు,ఏయ్ పక్కకు జరుగెహె,ఇలా అరుచుకొంటూ అడ్డదిడ్డంగా వాలిపోయారు ఉదయం 4 గంటలకు లేచి చకచకా కాలకౄత్యాలు ముగించి ఎవడి బ్యాగ్ వాడు భుజాన తగిలించి అందరూ తయారయిపోయారు. తయారవడం అయ్యారుగాని ఎవడూ కడలడం లేదు. పరిస్థితి ఏమిటంటే ! టీ గాని కాఫీ గాని పడితేతప్ప కదలనని మొరాయించే సాల్తీలు చాలాఉన్నాయి మా గ్రూపులో. బయటి పరిస్థితి చూస్తే చీకటి,చలి, ఇప్పుడెడు షాపులు తెరుచుకూర్చుంటాడు. సరే చూద్దాం లెమ్మని కొంతదూరం చూస్తూ పోయాం. టీ బడ్డీలైతే బొచ్హెడున్నాయిగానీ అన్నీ షర్టర్లు దించేసో బరకాల్తో మూసేసో ఉన్నాయ్ . మావాళ్ళు టీ పట్టు వదలని విక్రమార్కుల్లా ఒక గోనెలబరకం లోపల నిద్రపోతున్న టీబడ్డీ ఆసామిని బ్రతిమాలోబామాలో మొత్తమ్మీద లేపారు. పాపం అతను వీళ్ళ గోల పడలేక స్టవ్ వెలిగించి టీ కాచి ఇచ్హేంతవరకూ వదల్లేదు. తేనీటి సేవనం అయ్యాక సంత్రుప్తి పడి మావాళ్ళంతా హుషారుగా రేవు వైపుగా నడక సాగించారు. ఉదయం మేము వెళ్ళేసరికే రేవులో విపరీతంగా జనం వచ్హిఉన్నారు. అప్పటికే రెండు వెళ్ళి పోగా ఇంకా వరుసలో నాలుగున్నాయి. మేము టికెట్స్ ఇచ్హే దగ్గరకు వెళ్ళి మా టికెట్స్ చూపించి ఎందులో కూర్చోవాలో అడిగాము. మీఇష్టం నాలుగిట్లో ఎందులోనైనా ఎక్కచ్హు. అవన్నీ ఒకదాని వెనుక ఒకటి బయలుదేరేవే. అన్నాడు.ముందుగా ఉన్నది అప్పటికే సగంపైగా నిండిపోవడం వలన కాళీగా ఉన్న రెండవదాంట్లోకెళ్ళాం. అన్నిటికీ పైన కార్పెట్స్ వేసిఉన్నాయి కూర్చొనేందుకు వీలుగా. వెళ్ళిన మమ్మల్ని డైవర్ అడిగాడు. పైకెళతారా! లోనికెళతారా! అని. ముందుగా తెలిసిఉండటంవలన పైనే కూర్చుంటాం అని చెప్పాం. అప్పటికి టెంట్ వేయలేదు. కొంచెం ఎండ వచ్హాక వేస్తానన్నాడు.సరేనని చెప్పులు ప్రక్కన విడిచి కూర్చున్నాం అందరం.
వాతావరణం ఆహ్లాదంగా ఉండి మావాళ్ళు ఉత్సాహాంగా మాటల్లో పడ్డారు. రాజమండ్రి వైపు ఒడ్డును అనుసరించి కొతదూరంవరకూ వెళ్ళి ఆపై గోదారి నడి మధ్యకు తిరిగింది. అంత ప్రొద్దున్నే కూడా అక్కడక్కడా పైపైకి తొంగి చూస్తున్న ఇసుక దిబ్బల మధ్య చిన్నచిన్న పడవల్లో వలలతో చేపలు పట్టుకొంటూ చాలా మంది కనిపిస్తున్నారు.
బహుశా ఉదయపు మార్కెట్టుకు వేయడానికనుకుంటా. వాళ్ళందరినీ దాటుకుంటూ కొవ్వూరు మీదుగా పట్టిసీమ వైపుగా సాగిపోయింది. నీళ్ళమధ్య ఉండుట వలననుకుంటా ఒకవైపునుండి మాదిరిగా ఎండ వస్తున్నా చలిగాలి వీస్తుంది. ఏడున్నర ఎనిమిది మధ్యలో అందరికీ పేపర్ ప్లేట్లలో టిఫిన్ ఇవ్వడం మొదలెట్టారు. అందరూ ఎగబడి తీసుకోడం మెదలెట్టారు. అవును పాపం అప్పటికే అందరికీ కడుపులో ఎలకలు పరుగెడుతున్నాయ్. ప్లేట్ లో మూడు మైసూర్ బోండా రెండుగరిటెల ఉప్మా తీసుకొచ్హి ఇచ్హాడొకతను అందులో కొబ్బరి చట్నీ లాంటిదేదో కూడా ఉంది. తినడం పూర్తయినతరువాత టీ తీసుకొచ్హారు వేగంగా వెళ్ళే నావ చుట్టూనీళ్ళు చల్లటి వాతావరణంలో అలా టీ తీసుకొనే మజానే మజా.
అల్పాహారం అయింతరువాత మరికొంత సేపట్లో మీడియం బ్రిడ్జి లాటి కొవ్వూరు గ్యాస్ పైప్ లైన్ కనిపించింది. సింగిల్ లైన్ వారది కట్టారు పెద్ద సైజ్ పైపులను గోదావరిమీదుగా కలుపుతూ వెళ్ళేందుకు.
దూరంగా మసకమసకగా పట్టీసీమ దేవాలయం కనుపిస్తున్నది. దగ్గరకు వెళ్ళే కొద్దీ మరింత అందంగా నీళ్ళలో ప్రతిఫలిస్తూ గోదావరి మధ్యలో చిన్న దీవి
.అసలలాంటి ఫీలింగ్ రాని దేవాలయం దేవాలయంలానే అనిపించదు. క్యూలలో గుద్దుకొంటూ తోసుకొంటూ కేకలు గొడవ మధ్య ప్రశాంతంగా దేవుని ముందు నిల్చుని ఒక్క క్షణమైనా ధ్యానించగలమా. అటువంటి చోట్లకు వెళ్ళి ప్రయోజనమే లేదు ఏదో మనమూ వెళ్ళాం అనుకోవడంతప్ప. "
Posted by
Viswanadh. BK
at
3:47 PM
6
comments
Wednesday, August 15, 2007
Thursday, August 9, 2007
TOUR OF PAAPI KONDALU.
గోదావరి మీద పోలవరం వద్ద బ్రిడ్జి కడుతున్నారని పేపర్లలో వార్తలు చదువుతుంటే బాధగా అనిపించింది. ఈదెబ్బతో పాపికొండలు మటాష్ అయిపోతాయి, వాటర్ ప్లోటింగ్ లేక గోదావరి కూడా ఇప్పుడు విజయవాడ తరువాత పిల్లకాలువలా పారే కౄష్ణా నదిలా తెల్ల మొహంతో ఇసుక మేటలను మాత్రమే చూపిస్తుందనుకుంటా, గోదావరిలో స్నానం చేయాలనుకొనే రాజమండ్రి వాసులంతా పాపం మైలు దూరం లోనికి నడువాల్సొస్తుందేమో రేవులనుండి. ఇలా ఆలోచించిన నాకు ఒక్క సారి పాపికొండలు టూర్ వెళితే బావుండు అనిపించింది. ఈసారి ఊరెళితే తప్పక ప్రయత్నించాలి లేకుంటే మళ్ళీ చూసే అవకాశం వస్తుందో రాదో అనుకున్నాను. మొన్న సంక్రాంతికి ఊరెళ్ళానుగాని చాలారోజులు పనుల వత్తిడిలో బయలుదేరుటకు కాదుకదా కనీసం అలోచించేందుకు కూడా వీలవలేదు. కాని విచిత్రంగా ఇదేవిషయమ్మీద మా స్నేహితులే చర్చ లేవదీసారు. అదెలానంటే మేము సాధారణంగా సాయంత్రాలు మిలీనియం పార్కు అనబడే చెరువు గట్టున సమావేశం అవుతుంటాము.మా ఫ్రెండ్స్ లో ఎవరిని ఎప్పుడు కలవాలన్నా అక్కడే దొరకుతారు. {మిలీనియం పార్క్ అనబడే దీని కధ నా పాత పోష్టులో చూడచ్హు } పోలవరం బ్రిడ్జ్ గురించి వాళ్ళూ కూడా నాలాగే అనుకోవడం జరిగిందని టూర్ ప్లాన్ చేయలనుకుంటున్నారని వాళ్ళ మాటాలద్వారా నాకు తెలిసింది. ఇప్పుడు నువ్వున్నావు గనుక నువ్వేళ్ళేలోగా ఏదో ఒకరోజు డిసైడ్ చేద్దాం అన్నారు. నాకింకేం కావాలి కాగలకార్యం గంధర్వులే తీర్చారన్నట్టుగా అయింది. తరువాత మాటల్లో ఎంతమంది వస్తారు? ఎలా వెళ్ళాలి? టికెట్లు బుక్ చేయడం ఎలా? లాటి డిస్కషన్ తో కొంత సమయం గడిచాక ముందుగా సమాచారం కోసం నెట్ లో వెతికేందుకు వెళ్ళాం.ఎన్ని రకాలుగా సెర్చ్లు చూసినా ఎలా టైప్ చేసినా మాక్కావలసిన సమాచారం మాత్రం సరిగా దొరకలేదు.ఇలా కాదుగాని అసలు ఎందరొస్తారో తెలుసుకోండి డైరెక్టుగా రాజమండ్రి పోయి వివరాలు టికెట్లు రెడూ తేవచ్హు.అన్నారు. సరి. ఉన్న జనం పన్నెండు. అనుమానంగా లేదా ఊగీసలాడేవారు ఏడు. మొత్తం పందొమ్మిది. సాయంత్రానికి కంఫం చేసి చెప్పమన్నాం ఎంతమంది ఖచ్హితంగా వచ్హేదీ... ఆరోజు సాయంత్రానికి పదహారు మందితో లిస్ట్ మాకప్పచెప్పారు. మరుసటి రోజు ఉదయం నేను మరో ఇద్దరు కలసి రాజమండ్రి బయలుదేరాం.
రాజమండ్రి మాకు రెండు వైపులనుండి వెళ్ళచ్హు. ఇటునుండి కొవ్వూరు మీదుగానూ, అటునుండి రావులపాలెం మీదుగానూ. చిత్రంగా ఎటెళ్ళినా రెండుసార్లు గోదారి క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఇటు నిడదవోలు దాటాక విజ్జేశ్వరం చిన్నపాయనూ, తరువాత కొవ్వూరు నుంచి రాజమండ్రి బ్రిడ్జి మీదుగానూ. ఆవైపుగా మొదట సిద్ధాంతం బ్రిడ్జి మీదుగా, తరువాత రావులపాలెం - గోపాలపురం బ్రిడ్జి మీదుగానూ.
Posted by
Viswanadh. BK
at
5:30 PM
11
comments

.jpg)
.jpg)
.jpg)

.jpg)
.jpg)



















