బ్లాగు మిత్రులందరకూ వందనాలు. మరి కొందరి బ్లాగు మిత్రులతో నేనుకూడా చేరేందుకు గ్రేటర్ అని గుర్తించిన అత్యంత చెత్త, కాలుష్య నగరమైన భాగ్యనగరమునకు జీవనోపాధికొరకై ఉధ్యోగము వెతుకుతూ వచ్చేసాను.కొంత వరకూ బాగుగనే ఉన్నా- ఎక్కువ కష్టకార్యమనబడినది మటుకు గధి వెతుకులాట అని తెలియబడినది. అందులోనూ పెండ్లి అయిన వారికి కొన్ని మినహాయింపులు కలవులెండి. కేవలం బ్రహ్మచారులమైన మమ్మే నిజముగా చారులలన్నట్లుగా ట్రీట్ చేస్తూ షాదీ అయిందా అని అడిగి లేదనంగానే 'చల్ చల్ రూమ్ గీమ్ నయ్' అని తరిమేస్తున్నారు.కావున బాధలకు పేరు పడిన హైదరా'బాధ 'లో ఎంతో ఓపికతో నివసిస్తూన్న యావన్మంది బ్రహ్మచారి బ్లాగ్మిత్రులకూ మనవి చేయునది ఏమనగా నాకు అత్యవసరముగా కూకట్పల్లి,హౌసింగ్ బోర్డ్, నిజాం పేట్ ఏరియాలలో ఏదో ఒక చోట ఒక గది కావలెను. మీకు లేదా మీ మిత్రులకు తెలిసిన' గది' విశేషాలు ఉంటే నాకు తెలియ చేయగలరని మనవి.
kiran kumar chava గారు చెప్పినందున బడ్జెట్ విషేషాలు కూడా చేర్చుతున్నాను. అద్దె - రెండు నుండి మూడు వేల వరకూ భరించగలను.వంట - వండుకొనుట 'సేప్ఫ్' అని తేలిన మిదట అలా డిసైడ్ అయిపోయాను.
పోస్టు ఇచ్చిన తరువాత
కొందరు ఇచ్చిన జవాబులు బావున్నా అవేవీ నాకు ఉపయోగ పడువిధంగా లేవు. దయచేసి నాకు ఉపయోగంగా జవాబులు ఉంటే మరింత సంతోషపడి ఉండేవాడిని
సదా కృతజ్ఞతలతో మీ.... విశ్వనాధ్
8 comments:
హై ధరా బాదు నకు స్వాగతం!
మీకు తొందరలోనే రూమ్ దొరకు గాక!!
బడ్జట్ కూడా వ్రాస్తే బాగుండేది
అంటే : అద్దె మూడు వేల వరకూ పెట్టగలను, తిండి వండుకోగలను :) లేదా దగ్గరలో మెస్సు ఉండవలెను వంటివి అన్నమాట :!
BTW this remainds me of http://oremuna.com/blog/?p=974
విశ్వనాధ్ గారు పోనీ షాదీ చేసుకోండి,పెళ్ళి వల్ల కలిగే సౌకర్యాలలో ఇదీ ఒకటన్న మాట మీ అబ్బాయిలకి:)
@ రానారే గారు,అంత చెడ్డగా.. అలా యేం అనుకోరు గానీ, ఉండనే ఉందిగా బ్రహ్మచారి కోతులతో సమానమని :) అందుకే ఇవ్వనని ఉంటారు.
విశ్వనాథ్ గారు,
రమ్య గారి సలహా అంత చెడ్డగా ఏమీ లేదు మరి, చూడండి! మాకో ఇల్లు కొండాపూర్ లో ఉంది గానీ,మీరు కొంచెం లేటయ్యారు. అది అద్దెకు ఇవ్వబడినది.
సూచనలు సలహాలు ఇచ్చిన మీకు నా కృతజ్ఞతలు. సూచనలు బావున్న అవి నాకు అంతగా ఉపయోగపడేలా లేనందుకు చాలా విచారంగా ఉంది. కనీసం ఒక్కటయినా ఉపయోగపడేదుంటే బావుండేది. అయినా మీకు నా ధన్యవాధములే....
సూచనలు సలహాలు ఇచ్చిన మీకు నా కృతజ్ఞతలు. సూచనలు బావున్న అవి నాకు అంతగా ఉపయోగపడేలా లేనందుకు చాలా విచారంగా ఉంది. కనీసం ఒక్కటయినా ఉపయోగపడేదుంటే బావుండేది. అయినా మీకు నా ధన్యవాధములే....
మీలా నే నేను కూడా అద్దెగది భాదితుడనే. పదేళ్ళక్రితం హైదరాబాదుకు పొట్టచేతబట్టుకొని వచ్చిన తరువాత వారంలోనే వుద్యొగం సంపాదించా కానీ అద్దె ఇల్లు మాత్రం 2 నెలలకు దొరికింది.అప్పుడే అనుకున్నా నేనెప్పుడైనా ఇల్లు కడితే అద్దెకు ఇవ్వాల్సి వస్తే బ్రహ్మచారులకు మాత్రమే అని బోర్డు పెట్టాలని.ఇల్లు కట్టటం అయ్యింది.అద్దెకు ఇవ్వడం అయ్యింది. మా ఇల్లు వూరికి ఈ చివర ఇ.సి.ఐ.ఎల్ దగ్గర ప్చ్: లేకపోతే మీ కే అద్దెకు ఇచ్చేవాడిని.
ఛాలా బాగా రాసారండి. Superb.
Post a Comment