Saturday, September 29, 2007

నగర రహదారులకు మేమేల తీసిపోవలె

పల్లె రహదారులంటే బురదతో మట్టితో ఉంటాయని చాలమంది అనుకొంటుంటారు {ఒకప్పుడు చాలా ఉండేవనుకోండి}.ఇప్పుడు వాటికి విరుద్దంగా ఉంటాయని--ఉంటున్నాయని--నిరూపించేయాలనే చిన్ని ప్రయత్నం.
ఈ చిత్రాలు చూసి ప్రయత్న ఫలితం మీరే చెప్పడి.
నగర రహదారులకు మేమేల తీసిపోవలె
ట్రాఫిక్ జాములు రెడ్ సిగ్నల్స్ లేవోచ్

కాలుష్యం అంటే మాకేల తెలియును

ధుర్గంధం బురదలు కానవచ్చుటలేదేం

క్లీన్ & గ్రీన్ {మాదగ్గర చెప్పల్సిన అవసరముందా}

ప్రశాంతత జీవన వికాసాలు. కాలుష్యం కానరాని పల్లె అందాలు.
{కావని చెప్పలేరని పందెం}





24 comments:

బ్లాగేశ్వరుడు said...

మొన్న నేను ఊబలంక నుండి ర్యాలి వఱకు నడిచి వెళ్దాం అని అనుకొని నడవడం ప్రారంభించాను. రోడ్డు విశాలంగా ఉన్నది. మంచి కాంక్రీటు రోడ్డు. కాని రోడ్లుకి ఇరుప్రక్కల నిప్పులు

విశ్వనాధ్ said...

taugmహహ్హహ్హ... నిప్పులని తీసిపారేయకండీ

ఏదో కొంచెం వర్షం వచ్చినపుడు తక్క
అవి చుట్టూ పెరిగే మొక్కలకు ఎవరూ ప్రత్యేకించి వేయక్కరలేని సహజ ఎరువులుగా పరిగణించి ఆ టాపిక్ మాయం చేసేసామన్నమాట.

Unknown said...

చక్కని రోడ్డు. ఎంతో ఆహ్లాదమయిన పరిసరాలు. ఇంకేం కావాలి :)

Ramani Rao said...

బాగుంది విశ్వనాధ్ గారు.. ఇది మన మహనగరం (భాగ్యనగరం)MCH వాళ్ళు చూడాలి.. ఎంతో ఆహ్లాదంగా వుంది.. చూస్తుంటే.. CLEAN AND GREEN..

రాధిక said...

ఆహా అదృష్టవంతులే.మా ఊరికీ వేస్తారు తారు రోడ్డు.కానీ ఒక్క వర్షానికి మొత్తం పోయి ఎర్రమట్టి రోడ్డు మిగులుతుంది.కొన్ని కొన్ని సార్లు సగం మట్టి రోడ్డు,సగం తారు రోడ్డు మిగులుతుంది.అప్పుడు త్వరగా మొత్తం మట్టి రోడ్డయిపోతే బాగుండునని దణ్ణాలు పెట్టుకుంటాము.మీరొదిలేసిన టాపిక్కు గురించి నేనస్సలు మాట్లాడను.

రాధిక said...
This comment has been removed by the author.
రాధిక said...

కొబ్బరాకుల గాలి సవ్వడి వినబడట్లేదు,కాలువ మీది గాలులు తగలట్లేదు.... కానీ...ఇక్కడ నేనెంత పరవశాన్ని పొందుతున్నానో మాటల్లో చెప్పలేకపోతున్నాను. నా మనసు ఆ కొబ్బరి చెట్ల మీదుగా తేలిపోతూ ఆ కాలువలో స్నానాలు చేస్తుంది. ఈ ఫొటోలు ఫ్లిక్కర్ లోను,గూగుల్ లోను పెట్టండి.

చాలా చాలా చాలా చాలా చాలా థాంక్స్.

netizen నెటిజన్ said...

నిజమే, ఈ రాదారి బొమ్మల ముందు, ఆ నెటిజన్ "ఎవరు" దిగదిడుపే?

విశ్వనాధ్ said...

మాటలబాబు గారూ-
ప్రవీణ్ గారూ-
రమ గారూ-
రాధిక గారూ-
మరియు
నెటిజన్ గార్లకు
ధన్యవాధాలు.
@రాధికాజీ మీకు ఉపయొగపడతాయనుకొంటే
నా బ్లాగ్ నుండి పొటోలు తీసుకోని వాడుకోండి.
ఇప్పటికే ఈ పొటోలు తెలుగు వికీలో ఉంచాను.{సార్వజనిక ప్రయోజనం కోసం,పశ్చిమగోదావరి జిల్లా వ్యాసంలో}

విహారి(KBL) said...

ఫొటొలు భలే అందంగా వున్నాయి.చల్లని గాలి,చక్కని నేల పల్లెటూరికి మించింది ఎముంటుందండి.

Anonymous said...

విశ్వనాథ్ గారు,

విజయవాడ - గుడివాడ వయా మానికొండ రూట్ గుర్తొచ్చింది. మంచి ఫోటోలు. బానర్ మర్చారేమిటి? నీలం చాలా బాగుంది, దాన్నే కాస్త చిన్నది చేసి పెట్టండి. మరూన్/ఎరుపు అంతగా బాలేదు.

Anonymous said...

విశ్వనాధ్ గారు,

అద్భుతం! పల్లెటూరు మన భాగ్యసీమరా!!! అలాగే మన రైతన్నల దినచర్య (వ్యవసాయ పనులు) కూడా మీ కెమెరా లో బంధించి మాకు అందించండి.కాలం ఒడిలో జారిపోతున్న మా జ్ఞాపకాలని మళ్ళీ గుండెల్లో దాచుకుంటాం.
మీకు నెనెర్లు
-నేనుసైతం

చేతన_Chetana said...

మ్మ్ మ్మ్.. నేను క్రితం వేసవిలో దేశం వచ్చినప్పుడు, గుడుల పేరు చెప్పి ఉభయగొదావరి జిల్లాల్లో చిన్న తిరుపతి, మద్ది, రాయన్నపాలెం, కొత్తపేట (పక్క వేరే ఊర్లో అమ్మవారు ప్రసిద్ధి, పేరు గుర్తురావటంలేదు), అయినవిల్లి, ద్రాక్షారామం తదితర ప్రాంతాలు బాగానే తిరిగలిగాను. ఆ ఙ్నాపకాలు గుర్తొచ్చినాయి.. పల్లెటుళ్ళలో ఆ హాయే వేరు, కాని మొన్న వెళ్ళినప్పుడు చూస్తే, మాకు తెలిసినవాళ్ళలో ఇప్పుడు పెద్దవాళ్ళు తప్ప పిల్లలెవరూ ఉండటంలేదు, చదువులంటూ, ఉద్యోగాలంటూ, ఉద్యోగప్రయత్నాలంటూ, విదేశలంటూ అప్పుడప్పుడు సెలవలకి రావటంతప్ప.. తలుచుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది.

బ్లాగేశ్వరుడు said...

@ చేతన గారు వనపల్లి గ్రామములొ ఉన్న ప్రసిద్ధ పల్లాలమ్మ అమ్మవారి దేవస్థానం గురించి మాట్లాడు తున్నారా. కొప్పు లింగేశ్వరుడిని చూడడానికి వెళ్ళారా? తప్పకుండా చూడావలసిన దేవాలయం

కొత్త పాళీ said...

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గురించి గూగులమ్మ ఏం చెబుతుందో చూద్దామని అడిగితే మీ ప్రొఫైలులో వారి రచనలన్నీ మీకిష్టమైనవిగా ప్రకటించడం కనబడింది. శ్రీపాద రచనలన్నీ చదివినవారు ఈ మధ్య కాలంలో ఎవరూ తగల్లేదు .. చాలా సంతోషంగా ఉంది. వీలు చూసుకుని kottapali at yahoo dot com కి ఒక ముక్క రాయండి.

బ్లాగేశ్వరుడు said...

మీ బ్లాగుని మీరు మళ్ళి సంపాదించుకొన్నారా లేదా???

విహారి(KBL) said...

మీకు విజయదశమి(దసరా)శుభాకాంక్షలు.

బ్లాగేశ్వరుడు said...

మీ బ్లాగుని మీరు మళ్ళి సంపాదించుకొన్నారా ???

విశ్వనాధ్ said...

lEdaMDee naa valana kaalEdu..v

ramya said...

ఏమైంది మీ బ్లాగ్ కి?

విశ్వనాధ్ said...

అవునండీ నాబ్లాగ్ యూజర్నేం యాహూతో... అనుకోకుండా గూగుల్ అకౌంటునుండి డిలేట్ అయిపోయింది. ప్రయత్నించినా పనవలేదు. గూగుల్ వాళ్ళూ చేతులెత్తేసేరు. నేను ప్రస్తుతం వేరే బ్లాగ్ రాస్తున్నాను ఈ లింకులో చూడండి. http://viswanath123.blogspot.com

హృదయ బృందావని said...

Wish You A Very Happy and Prosperous New Year Vishwanath garu :)

రాధిక said...

నా బ్లాగులో మీ బ్లాగుకు లంకె వేస్తున్నాను.అభ్యంతరం వుంటే తెలియచేయగలరు.

Anonymous said...

It was so pleasant to see these pictures. I was glad that i visited u r site. Keep up the good work. Sorry i am not writing in telugu as it would be difficlut for all others to read (I forgot most of how to write).