"ఈ బొమ్మ నేను. నా పేరు బుడుగు. ఇంకోపేరు పిడుగు. ... ఇంకో అస్సలుపేరుంది.
ఇప్పుడు చెప్పడానికి టైము లేదు. కావలిస్తే మా నాన్నని అడుగు"
ఇది బుడుగు పరిచయం. బుడుగు గురించి తెలియని తెలుగు వారు తక్కువ. ఎందువలన అంటే ఆ పుస్తకం అంత ఫేమస్. బాపు గారి బొమ్మల కారణంగా అది మరింత ఫేమస్ అయ్యి అయ్యి అయ్యి బుడుగు కాస్తా పిడుగయ్యాడు.
బుడుగు ఆలోచనలు అనంతం. అవి మనకు అందవు. అలాటి కూని చూడండి.
ఇవి బుడుగు ఆలోచనలు, అద్భుతంగా ఉండే ఇలాంటి మాటలు ఎన్ని సార్లు చదివినా మనసుకు హాయిగా ఉంటుందనడంలో సందేహం లేదు.
మీరూ మీ పిల్లలతో హాయిగా నవ్వుకోవాలంటే వెంటనే కొనండి బుడుగు.
ఇలాంటి మంచి పుస్తకాలు మన ఇళ్ళలో లేకపోవడం అంటే మన పిల్లలకు మనం చాలా దూరం చేస్తున్నట్టే.

- నా అంతవాడు నేను. నన్ను ఎవరూ కొట్టకూడదు. నేను నిఝంగా పెద్దవాడినే అనుకో. ఐతే వాళ్ళే నన్ను కుర్రకుంకా అంటారుగా. అందుకని కొట్టకూడదు.
- సిగరెట్లు తెల్లగా ఉంటాయిలే. వీటిని బాబాయిలాంటి కుర్రవాళ్ళు కాలుస్తారు. .. మరి నేను పెద్దవాడినిగా. అందుకనే కాలవను. నేను ఇంఖా పెద్దవాణ్ణయ్యాకా జెటకా బండియేనా రైలింజనేనా తోలుతానుగా. అందుకని బీడీలు దాస్తాననుకో. అప్పుడు చెవులో పెట్టుకోవాలిగా. బీడీలు బామ్మ వత్తుల పెట్టెలో దాస్తే భద్రంగా ఉంటాయి...
- అగరొత్తులు నల్లగా ఉంటాయి. వాటిని గోడమీద గుచ్చి కాలుస్తారు. సిగరెట్లేమో నోట్లో గుచ్చి కాలుస్తారు.
- ధైర్యం అంటే పోలీసుతో మాట్లాడ్డం. ధైర్యం అంటే సుబ్బలష్మితో మాట్లాడ్డం అని కూడా అర్ధం అట. ఇలా అని బాబాయి చెప్పాడు.
- డికేష్టివురావు అంటే నాకు తెలీదు. బాబాయికీ తెలీదు. వాడికి కూడా తెలీదట. డికెష్టివురావుకు పెద్ద మీసాలున్నాయి. డికెష్టింగ్ చేసేప్పుడు అవి పెట్టుకోవాలట. అప్పుడు టుపాకీ కూడా పట్టుకోవాలట.
- బళ్ళోకెళ్ళకుండా ఉండాలంటే చొక్కా ఇప్పేసి ముందుగా ఎండలో నించోవాలి. అప్పుడు వీపుమీద పొట్టమీద జొరం వచ్చేస్తుంది. అప్పుడు పరిగేఠుకుని అమ్మదగ్గిరికెళ్ళి గబగబా చూడూ బళ్ళోకెళ్ళద్దని చెప్పూ అనాలి. లాపోతే జెరం చల్లారిపోతుంది. బామ్మకి చెప్పేస్తే చాలు. .. కడుపునెప్పి మంచిది కాదు ఎందుకంటే పకోడీలు చేసుకొని మనకు పెట్టకుండా తినేస్తారు. అందుకని తలనొప్పి అన్నిటికన్నా మంచిది. ఇది కూడా బామ్మకే చెప్పాలి.
- అయిసు ఫ్రూటువాడిని పిలిచి ముందుగా రెండు ఎంగిలి చేసెయ్యాలి. అప్పుడు అమ్మ కొనిపెడుతుంది. తరవాత ప్రెవేటు చెబుతుందనుకో. ఈ పెరపంచకంలో ప్రెవేటు లేకుండా మనకి ఏం రాదుగదా మరి?
- ఒక మేష్టారేమో చెవి కుడివైపుకు మెలిపెడతాడు. ఇంకో కొన్నాళ్ళకి కొత్తవాడొస్తాడు కదా? వాడేమో ఎడమవైపుకి మెలిపెడతాడు. ఇలా అవుతే చెవి పాడైపోదూ? అందుకని ఎటేపు మెలెట్టాలో కొత్తమేష్టరు ముందుగా పాతమేష్టరును కనుక్కుని రావాలి.
- ఈ పెద్దవాళ్ళు ఒకోసారి అబద్ధం చెబితే తిడతారు. ఒకోసారి నిఝెం చెబితే కూడా ప్రెవేటు చెప్పేస్తారు.
- చంపడానికి ఇప్పుడు రాచ్ఛసులు అయిపోయారట. అందుకని మనం పదమూడో ఎక్కం, సిబి పాఠం ఇవన్నీ చదూకోవాలట. అవన్నీ వచ్చేస్తే రాచ్ఛసులు చచ్చిపోతారట. మనం బాగా చదూకుని ప్ఫది కాణీలో, వంద కాణీలో తెచ్చినా రాచ్ఛసులు చచ్చిపోతారట. లాపోతే సీగాన పెసూనాంబనిచ్చి పెళ్ళి చైరన్నమాట. ఇలాగని మా రాద చెప్పింది. రాధంటే అమ్మలే.
ఇవి బుడుగు ఆలోచనలు, అద్భుతంగా ఉండే ఇలాంటి మాటలు ఎన్ని సార్లు చదివినా మనసుకు హాయిగా ఉంటుందనడంలో సందేహం లేదు.
మీరూ మీ పిల్లలతో హాయిగా నవ్వుకోవాలంటే వెంటనే కొనండి బుడుగు.
ఇలాంటి మంచి పుస్తకాలు మన ఇళ్ళలో లేకపోవడం అంటే మన పిల్లలకు మనం చాలా దూరం చేస్తున్నట్టే.
1 comment:
బాగుందండి
Post a Comment