Monday, October 5, 2009

వాసవీధామ్

పెనుగొండ అంటే చాలా మంది ఎరిగి ఉండచ్చు. అది వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవాలయము ద్వారా ప్రసిద్ది చెందింది. ఇటీవల వరకూ ఎక్కువగా తెలియక పోయినా ఇక ఇటుపై తప్పక గొప్పగా ప్రసిద్ది చెందవచ్చు.
ఇది చదవండి మీకూ తెలుస్తూంది.

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవికి పలు ఆలయాలున్నాయి. వీటిలో ప్రసిద్ధి చెందిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ అనే పట్టణంలో ఉన్నది. ఆలయంలో ఏడు అంతస్థులతో ఉన్న గాలి గోపురం వివిధ వర్ణాలతో,చక్కటి శిల్ప కళతో అలరారుతూ ఉంటుంది. ఇది వైశ్యులకు పవిత్ర క్షేత్రం. పెనుగొండ క్షేత్రాన్ని వైశ్యుల కాశీ గా భావిస్తారు.

ఆర్యవైశ్యుల కులదైవమయిన శ్రీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి ఆలయము చారిత్రక నేపద్యము కలిగి ఉన్నది. నిజానికి ఆలయము శ్రీ నగరేశ్వరస్వామి వారి దేవస్థాన ప్రాంగణములోనే వేరొక ప్రక్క నిర్మింపబడినది. తరువాత గోపురము మరియు విశ్రాంతి మందిరములు కళ్యాణ మండపము ఇత్యాదులతో అభివృద్ది చేయుటచే పెద్ద యాత్రా స్థలముగా మారినది.



నేను పెనుగొండ వెళ్ళి చాలా కాలం అయింది. మద్య జరిగిన మార్పులు చూస్తే చాలా బాగా అనిపించాయి. వాసవీ ధామ్ అని పేరుతో పెద్ద ప్రాజెక్టు చేపట్టారు. అసలు వాసవి ఆలయమే ఊరికి ఒక వైపు చక్కని పచ్చపొలాల ప్రక్కగా ఉంటుంది. దీనికి తోడు ఎదురుగా పెద్ద కాలువ ప్రవహిస్తుంటుంది. అలాంటి వాతావరణానికి గుడికి కొద్ది దూరంగా అనేక ఎకరాల పంట చేలను పూడ్చి నిర్మణాలు చేపట్టారు. ఇక్కడ యాత్రికులకు అనేక కాటేజీలు, వాసవి గురించిన సమస్త వివరాలూ ప్రదర్శించే పెద్ద ప్రదర్శన శాల, ద్యాన మందిరాలు , స్టార్ హొటలూ, అనేక చిన్న దేవాలయాలు ఇలా అనేకం నిర్మాణంలో ఉన్నాయి. లోనివైపుగా వాసవీమాత అగ్నిలో దహనమౌతున్న ప్రతిమను సహజంగా ఉండేలా రూపొందించారు.
ఇవన్నీ ఒక ఎత్తు తొంభై అడుగుల పైబడిన వాసవీ మాత విగ్రహం. ఇది ప్రస్తుతం సిమెంటుతో నిర్మించారు, తరువాత ఇలానే దీనిపై కాంస్యపు పలకలను తయారు చేస్తారట. దానిని రోడ్డువైపుగా వాసవీ ధామ్ ప్రధాన ద్వారం వైపు నిర్మించారు. చూడండి అద్భుతంగా ఉన్నది.

7 comments:

మంచు said...

విశ్వనాద్ గారు - మీది ఏ వూరు?

మంచు said...
This comment has been removed by the author.
రవిచంద్ర said...

విశ్వనాథ్ గారూ! గుర్తు పట్టారా? వికీపీడియా రవిచంద్రను. బాగుంది మీ పోస్ట్....

Krugusri said...

విశ్వనాద్ చాలా బావుంది

శ్రీవాసుకి said...

నా దురదృష్టం ఏమిటోగాని మా పిన్నిగారు కాకరపర్రులో ఉన్నప్పుడు, సిద్ధాంతంలో ఉన్నప్పుడుగాని నేను చాలాసార్లు ఆ ఊర్లు తిరిగానుగాని ఒక్కసారి కూడా ఈ వాసవి దేవి ఆలయం చూడలేదు. అమ్మ దయ ఎప్పుడో నా మీద.

Viswanadh. BK said...

u can see with this link my village

http://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B1%8B%E0%B0%A1%E0%B1%82%E0%B0%B0%E0%B1%81

Anonymous said...

Thank u very much viswanath to remember penugonda