ఈ మద్య మా ఫ్రెండ్స్ నన్ను బాగా మోసేస్తున్నారు. అనుకోకుండా వాళ్ళకో కారణం దొరికేసింది. ఆమద్య మంచి మూడ్లో ఉన్నపుడు ఒక అందమైన అమ్మాయి చిత్రాన్ని భీభత్సంగా గీకేసాం... అయితే మనమెంత భీభత్సంగా గీకామో ఆ బొమ్మ అంత సున్నితంగా వచ్హేసింది. సరే బావుంది కదాని రూముకు తీసుకుపోయి చిన్నగా ఫ్రేం కట్టి గోడకు తగిలించా. అదిగో అదే పెద్ద తప్పయి పోయింది.... ఇంతకూ నే వేసిన లేదా గీసిన చిత్రం ఏమిటంటే విచారగా ఏడుస్తున్న ఒక అమ్మాయి. ఇక అప్పటినుండి దాన్నెవడు చూస్తే వాడు నన్ను మోసేయటం మొదలెట్టారు. ఒరే ఎందుకురా ఆ అమ్మయిని అలా ఏడిపిస్తావ్ అంటాడొకడు. ఏరా ఏంచేసావురా ఆ అమ్మాయి అలా ఏడుస్తుంది అంటాడింకొకడు. ఎందుకురా అ అమ్మాయి ఎప్పుడూ ఏడుస్తుంటుంది అంటాడు మరొకడు. రోజూ ఎందుకురా అలా ఏడిపిస్తావ్ అడిగిందేదో ఇవ్వచ్హుగా ఎవరూ లేరనుకున్నవా తాట వలుస్తా అంటాడొకడు. ఈ రోజు కూడానా! రోజూ ఏడిపిస్తానే ఉంటవేంట్రా మరో డైలాగ్.. నాన్ స్టాప్ క్రైయింగ్లో గిన్నిస్ కెళ్ళాలనేంట్రా.... ఇలా నా మెదడు 'తడిగిణతోం తడిగిణతోం' అని వాయించేసుకుంటున్నారు. ప్రతిరోజూ.... ఇక వాళ్ళ బాధ పడలేక అక్కడినుంచి పీకేసి స్కాన్ చేసేసాను. ఇక చించి కుప్పతొట్లో ఆ బొమ్మను...అప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది...
Tuesday, September 11, 2007
అమ్మాయి ఎందుకేడుస్తుంది.
ఇది నే గీసిన అసలు బొమ్మ
"బొమ్మను క్లిక్ చేసి చూస్తేనే అమ్మాయి ఏడుస్తుందా లేదా అనేది తెలుస్తుంది"
రంగుల్లో అయితే ఎలాగుంటుందబ్బా అని.
Posted by Viswanadh. BK at 6:32 PM
Subscribe to:
Post Comments (Atom)
20 comments:
అమోఘం!
అద్భుతం గా వుంది.మీకు అభ్యంతరం లేకపోతే నేను సేవ్ చేసుకుని నా బ్లాగులో వాడుకోవచ్చా?ప్రస్తుతం రాస్తున్న కవితకి సరిపోతుందనుకుంటాను.పూర్తి గా రాసాకా గానీ తెలియదు.సరిపోక పోతే తరువాత ఎప్పుడన్నా వుపయోగిస్తాను.
మీరు గీసిన బొమ్మ నిజంగా సుపరోసూపరు.
ఐనా పాపం ఎందుకండి ఏడిపిస్తారు. :-)
చాలా బాగుంది మీ బొమ్మ, కాని చింపి వేశారా! పాపం, అలా చేస్తారు ఆనే ఏడుస్తుంది. తెలుగు తల్లి బొమ్మ కూడా బాగుంది.
బొమ్మ చాలా చాలా బాగుందండీ. రెండు మూడు రోజులు మిమ్మల్ని ఏడిపించినందుకు మీ స్నేహితులకు చాలా పెద్ద శిక్షేవేశారు. ఇకనుండీ మీతో కొంచెం జాగ్రత్తగా ఉంటారులెండి.
చాలా బాగుంది...ఇంత చక్కని అమ్మాయిని ఏడిపించింది కాకుండా ఇంకా చింపి చెత్తబుట్ట లో వేస్తారా....ప్చ్..ఏమీ బాగోలెదు.:)
-నేనుసైతం
విశ్వనాథ్ గారు మీ చిత్రలేఖన కౌస్తుభం చాలా బాగుంది. చాలా బాగా గిశారు బొమ్మ
అద్భుతం!
@ ఇస్మాయిల్గారూ-
@ విహారిగారూ-
@ రఘునాధరెడ్డిగారూ-
@ మాకినేని ప్రదీపుగారూ-
@ నేనుసైతం మీకున్నూ-
@ మాటలబాబు గారూ-
@ వికటకవి గారూ-
అందరికీ ధన్యవాదాలు.....
@ రాధిక గారూ ఏ పర్లేదు నిరభ్యంతరంగా మీ కవితల్లో నా బొమ్మలు వాడుకోవచ్హు.
@మాటలబాబు: ధర్మ సందేహం: చిత్రలేఖన కౌస్తుభం? కౌశలం కాదా?
ధర్మారావుగారూ-మాటలబాబు గారిని గురించి ఒక విషయం చెప్పాలి.
తెలుగు వికీలో చర్చలు జరిపేటపుడు టైపింగులో మాటల తప్పులు అక్షరదోషాలు ఎవరూ తప్పు పట్టకూడదని ఒక నియమం. అదే అలవాటుగా ఆయన చిన్న తప్పులు పెద్దగా పట్టించుకోరు. నిజానికి ఆయన చదివి కామెంట్ ఇవ్వడమే మహానందం{అంత బిజీ ఆయన తెవికీలో}
అందుకే ఆయన తరపున నేనే మీకు జవాబిస్తున్నాను
Your art is so good. Please do store them and don't throw them out. - Santhosh(http://santhlavvi.googlepages.com)
అంతా బానేవుంది కానీ ఆ అమ్మాయి ఎందుకేడుస్తోంది?
:)
nice drawing
Awesome.
Inta manchi bomma ni chinchenduku chetulu ela vachayanDi. :)
@ధర్మారావు గారు, తొందరలొ వ్రాయడం లొ పొరబాటు దొర్లింది. కౌశలం వ్రాయబోయి. కౌస్తుభం అని వ్రాశాను. విశ్వనాధ్ గారు సహృదయం తొ పలికిన పలుకులకు కృతార్థుడిని
@ aruna gaaroo bomma cinchesinaa save chesaa kadandee parminent gaa.
మీకు వినాయకచవితి శుభాకాంక్షలు
Really nice...
ఏందుకండి ఆ ఆమ్మాయిని అలా ఏడిపించారు.......
బాగా గిశారు
తాతబ్బాయి
Post a Comment