Sunday, March 21, 2010

పీచు మిఠాయి

                         పీచు మిఠాయి అనేది మా చిన్నప్పుడు భలే ఇష్టంగా తినే వాళ్లం. ఎర్రగా పీచుపీచుగా ఉండే అదంటే ఇష్టం ఉండని వాళ్ళు అరుదు. ప్రస్తుతం బయట చాలా తక్కువగా కనిపిస్తున్నా ప్యాకెట్లలో షాపింగ్ మాల్స్, సినిమా దియేటర్స్ వంటి వాటిలో కొద్ది ఎక్కువ ఖరీదులో అయినా బాగానే దొరుకుతున్నాయి.




అప్పట్లో సైకిల్ పై వీధులలో తిరుగుతూ పాత ఇనప సామాన్లు గాని, ప్లాస్టిక్ గాజు సీసాలు లాటివి ఇచ్చినా
అక్కడికక్కడే త్రిప్పుతూ తయారు చేసి
ఇచ్చేసేవాళ్ళు.
చిన్నప్పుడు అయితే రోజూ డబ్బులు దొరికేవి కావు. డొంకలు బొంకలు ఏదో ఒక మూల పాత ఇనప సామానో మరోటో వెతికి పట్టేసే వాళ్లం. అలా కొన్నామంటే ఇక ఆరోజుకు పండగే
దానిని తయారు చేసే పద్దతి ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంటుంది. పంచాదారతోనే చేస్తారంటే నమ్మేవాళ్ళం కాదు. ఎర్రగా ఉన్న దానిని పంచదార కాదు మరేదో అనుకొనేవాళ్ళం.
వారానికి జరిగే మా ఊరి సంతలో ఇప్పటికీ ఒకతను పెడుతుంటాడు. వెళ్ళిన ప్రతీసారీ తప్పకుండా కొంటూఉంటాను. నిజానికి అది తిప్పుతుంటే చూడ్డానికి వెళతాను కొనడానికి కాదు. డ్రమ్మును అలా తిప్పుతూ ఉంటే తీగలుగా సాలీడు దారాల్లా వచ్చే వాటిని చూడటం భలే సరదాగా ఉంటుంది. తరువాత పుల్లతో దానిని త్రిప్పుతూ గుండ్రంగా తయారుచేసి మనకివ్వడమ్ ఇంకా భలేగుంటుంది. కాని వెళ్లి అక్కడ నిల్చుంటే బావోదని కొని అక్కడ తెలిసున్న పిల్లలెవరైనా ఉంటే ఇచ్చేస్తూఉంటాను.
నా కూడా ప్రెండ్స్ ఎవరైనా వచ్చినా 'ఎహే ఇదెందుకురా' చిన్న పిల్లోడిలా' అంటూ ఉంటారు. నే చేసేది చూసి ఎవడి దూల వాడికానందం అనుకుంటారు :)
ఇలాటి చిన్న చిన్న ఆనందాలు కూడా అనుభవించడం తెలియకపోవడంమీ ఖర్మ అంటాను (అనను, అనుకుంటాను అంతే :).

7 comments:

సుభద్ర said...

good one.naaku istam peechumithayi..
avunu vaalla karmanE!!!

Anonymous said...

Yes. You are Right. Good Post. :)

మురళి said...

Same pinch :-)

శ్రీవాసుకి said...

బ్లాగ్ బాగుంది పీచు మిఠాయిలాగే. దాని రంగు చూస్తే నోరూరుతుంది. నేను మాత్రం ఏ వయసొచ్చిన పీచు మిఠాయి తినడానికి మొహమాటపడను. మా పాపతో పాటు నేను అంతే.

శ్రీవాసుకి said...

ఏమండీ ఈ మధ్య టపాలేవి వ్రాయటలేదా.

శ్రీవాసుకి

రసజ్ఞ said...

ఇప్పటికీ నాకు ఇదంటే చాలా ఇష్టం ఇక్కడ రంగుల రంగుల పీచు మిఠాయిలు దొరుకుతాయి! చక్కగా వ్రాశారండీ!

rajachandra said...

నాకు కుడా తినడం చూడటం అంటే ఇష్టం. నేను మొదటి సారి కొన్నప్పుడు మా స్నేహితుడు.. నా చేతిలోని పిచుమిఠాయి.. మారీ చిన్నాది అయిపోయింది.. ఏం జరిగిందో నాకు అర్దంకాలేదు.. వీడు లాక్కుని తినేసాడ అని అనుమానం వచ్చింది కూడా నాకు :)
ఇది నా బ్లాగు అండి http://rajachandraphotos.blogspot.in/