మా ఊళ్ళో ఇంత వరకూ క్రిష్నాష్టమికి ఉట్టి కొట్టాలంటే వీదిలో టెంపరరీగా ఆరోజు మందం ఏదో వీలయినట్టు చిన్న పందిరి వేసి అక్కడొక క్రిష్నుడి పటం పెట్టి పండగ అయిందనిపించేవారు.
కొద్దిగా గట్టిగా అయిఒతే మాత్రం బాల సంఘం గాంధీ బొమ్మల దగ్గర మెయిను గుమ్మంపైన ఎప్పుడో రాజుల కుర్రోళ్ళు కట్టించిన ఓ మాదిరి బొమ్మ దగ్గర మాత్రం ఇప్పటి కుర్రోళ్ళకు ఉత్సాహం పోయినా అప్పటి కుర్రోళ్ళు ముసలోళ్ళయిపోయినా వాల్లే చిన్న బుడ్డోళ్ళను కూడా వేసుకొని తిరిగుతూ బాల సంఘపు పెద్ద గుమ్మం పైన కట్టిన మండపంలో ఉన్న చిన్న క్రిష్ణుడి బొమ్మ దగ్గరా, ఆచుట్టు పక్కలా చేతనైన అలంకారం చేసి క్రిష్ణాష్టమి కొద్దిగా ఘనంగానే చేసాం అనిపిస్తారు.
దాంతరువాత దానికంతే కొద్దిగా తక్కువగానే అయినా మేమూ బానే చేత్తాం అనిపించుకొనే మరో కుర్రోళ్ళ టీం బస్టాండ్ సెంటర్లో ఉంది. బస్టాండును ఆనుకొని కూలిపోడానికి సిద్దంగా ఉన్న సాయిబుల సీను సైకిలు షాపు పక్కన మొన్నామద్య కుర్రోళ్ళు చందాలేసుకొనీ, ఆ సెంటర్లోని కొట్లలో వసూలు చేసిన మొత్తం కలిపి అక్కడొక దిమ్మ కట్టి దానిపై ఓ చిన్న విగ్రహం పెట్టారు. అలా నిలబెట్టిన చిన్ని క్రిష్ణుడి విగ్రహం దగ్గర మాత్రం మొదటి దానికి విరుద్దంగా పిల్లగాళ్ళు దార్లో దొరికిన వాడ్ని దొరికినట్టుగా అడ్డంపడి అటకాయించి కొందరితో తిట్లు తిని మరీ వసూలు చేసిన కొద్దిపాటి పైకంతో బానే చేసేం అనిపించేవారు.
మొన్నా మద్య వరకూ సాయిబాబా గుడి లేకపోవడంతో అంతా పక్క టౌనుకు వెళుతుండేవారు. ఇప్పుడు అదీ కట్టేసారు. ఇది లేదూ అనుకోడానికి వీల్లేకుందా అన్ని దేవాలయాలూ విశాలంగా కట్టేసారు ఊళ్ళో. ఇక లేనిదల్లా ఒక్క క్రిష్ణుడి గుడి మత్రమే అనుకుంటూ ఉండే వాళ్ళం.
అయితే ఆ కోరికా తీరిపోయింది. నాకు మొన్న ఊరెళితే అది కూడా కనిపించి భలే హాచ్చర్యమేసింది. గుడి కట్టిన తీరు మరీ భలేగనిపించింది. చుట్టూ కాళీగా, ముందు రెండు వాటర్ పౌంటెన్లు, మద్యగా పాలరాతి క్రిష్నుడు. అబ్బా భలే అందంగా ఉంది. అరె చాలా ఎక్కువ చెపుతున్నాడు ఈ పిల్లోడు అనుకోవద్దు. పల్లెటూళ్ళో ఆ మాత్రం ఉంటే గొప్పగానే ఉంటదని మీకూ తెలుసు. (సాక్షానికి బొమ్మలు కూడా ఇచ్చానండోయ్)
ఇక మీరు అర్ధం చేసుకోవలసింది ఏమిటయా అంటే ఇక నుండి అక్కడ కూడా ఉట్టి కొట్టే ఉత్సవం భలే చేస్తారని....
4 comments:
చాలా బాగుందండి.కృష్ణుడి closeup ఫోటో అయ్యి వుంటే ఇంకా బాగుండేది
విశ్వనాథ్‌గారు మీకు వినాయక చవితి శుభాకాంక్షలు
మీకు దసరా శుభాకాంక్షలు.
మీకు దీపావళి శుభాకాంక్షలు.
Post a Comment