Saturday, May 28, 2016
నత్తా రామేశ్వరం క్షేత్ర విశేషాలు
Posted by Viswanadh. BK at 7:49 PM 1 comments
Labels: గోస్తనీ నది, తూర్పు చాళుక్యులు, సప్తకోటేశ్వరం
Friday, May 27, 2016
గోస్తనీ నది మహత్యం
ఈ నది నిడదవోలు మండలం శెట్టిపేట వద్ద గోదావరి నుంచి పాయగా జీవం పోసుకొని ఉండ్రాజవరం, తణుకు, ఇరగవరం, పెనుమంట్ర, అత్తిలి, పాలకోడేరు మండలాలు తాకుతూ 18 గ్రామాల మీదుగా 37,600 కిలోమీటర్ల మేర ప్రవహిస్తూ పాలకోడేరు మండలం గొల్లలకోడేరు నుంచి భీమవరం మండలం యనమదుర్రు డ్రయిన్ ద్వారా సముద్రంలో కలుస్తోంది.
గోస్తని చరిత్ర విశేషాలను తెలుసుకోవాలనుకొన్న నారదుడు బ్రహ్మదేవుని చేరి గోస్తని పుట్టుక, గొప్పధనం తెల్పమని అడుగుతాడు
దానికి బ్రహ్మదేవుడు - గోస్తనీనది పరమ పవిత్రమైనది. పూర్వం పృదుమహారాజు భూమండలాన్ని పరిపాలిస్తున్నపుడు ప్రజల ఆరోగ్యానికై ఓషదులను సాధించుటకు భూదేవిపై బాణము సందిచెను. దానికి భూదేవి ప్రత్యక్షమై ఓ రాజా నీ మనోభీష్టము తప్పక తీరగలదు. అని ఒక కామదేనువును ఆయనకు ప్రసాదించెను. తన కోరిక తెల్పిన రాజుకు ఔషదులతో కూడిన క్షీర ధారలను ప్రసాదించెను. అలా ప్రవహించిన ధారల ప్రవాహం పోను పోను విస్తరించుకొని నదిగా రూపాంతరం చెందినది. దానిలో స్నానం చేసినా, సేవించినా సకల రోగభాదలు తొలగి ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లిరి.
ఈ నదీ పరీవాహక ప్రాంతాన్ని ఆనుకొని ఉన్నానేక గ్రామాలలో నత్తారామెశ్వరం, జుత్తిగ, మల్లిపూడి లాంటి చరిత్ర కలిగిన చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఈ క్షేత్రాలలో ఉత్సవాలు జరిగినపుడు (గతంలో) వేలాది మంది భక్తులు కార్తీక, మాఘ మాసాల్లో తమ విశ్వాసానికి అనుగుణంగా స్నానాలు ఆచరించే వారు. దీంతో పాటు పంట సాగుచేయడానికి వేలాది ఎకరాలకు నీరు కూడా అందించేది. వేసవిలో పశువులకు త్రాగునీరు అవసరాన్ని తీర్చేది. ఇంకా గత చరిత్ర తెలుసుకుంటే ఈ గోస్తనీ నదిలో ఇసుక రవాణా చేస్తూ పడవలు తిరిగేవని ఇప్పటి పెద్దలు చెబుతుంటారు.
అటువంటి చరిత్ర కలిగిన గోస్తనీ నదిలో ప్రస్తుతం మురుగునీరు ప్రవహిస్తూ విషపూరితంగా మారిపోయింది. దీనికి తోడు సత్యవాడ డ్రయిన్ చివటం, తేతలి, పైడిపర్రు, మండపాక మీదుగా రేలంగి వద్ద (వేల్పూరు శివారు) గోస్తనీలో కలుస్తోంది. దీంతో మరింత మురుగునీరు వచ్చి కలిసి మరింత కాలుష్యం పెంచుతోంది.
Posted by Viswanadh. BK at 1:00 PM 0 comments
Labels: gostani rever, juttiga, mallipudi, natta rameswaram, nidadavolu, prudu maharaju, shettipeta
Thursday, April 14, 2016
శ్రేష్టమైన మామిడి తాండ్ర
మొన్న వాడపల్లి వెంకన్నను దర్శించుకోడానికి వెళ్ళి అలా గోదారి గట్టంటా ఆత్రేయపురం వెళితే మామిమిడి తాండ్ర కథా కమామిషు బయటపడింది. వివరాల్లోకి వెళితే
దీని తయారీ విధానం ఇలా ఉంటుందిట
* శ్రేష్టమైన మామిడి తాండ్ర తయారీ కోసం కొన్ని రకాల జాతుల మామిడీ పళ్ళను మాత్రమే వాడుతారు. పుల్లైనన మామిడి తాంద్రకు పనికిరాదు.
* అలా సేకరించిన మామిడి పళ్ళను తొక్క తీసి మాగాయపచ్చడీకి తీసినట్టుగా పల్చని ముక్కలు తీసి టెంకలు పక్కన పెదతారు.
* మామిడి ముక్కలను పెద్ద గ్రైండర్లలో పోసి మెత్తగా ఆయేవరకూ తిప్పి ఆరసాన్ని పెద్ద బానలలో తీస్తారు.
* చెక్కర కలిపే ముందు కొందరు దానిని త్వరగా గడ్డకట్టేటందుకు నీళ్ళతో కలపి వేడి చేస్తారు. కొందరు గ్రైండింగ్ చేసేటపుడే చెక్కర కలిపి చేస్తారు.
* అలా వచ్చిన రసం పెద్ద పాత్రలలో బియ్యం జల్లెడలలో వేసి వడకడతారు
* వడకట్టిన రసం పెద్ద పాత్రలలోనే ఉంచి ఎండలో పెడతారు.
* పెద్ద అరపల మాదిరి తక్కువ ఎత్తులో పందిరి వేసి దానిపై చీరలు దుప్పట్లు వేసి వాటిమీద కొత్త తాటాకు చాపలు పరుస్తారు.
* పరిచిన చాపలను ఎత్తుపల్లాలు లేకుండా ఉండేలా రాళ్ళను పెట్టి చాపలపై నీళ్ళు కొడుతూ శుబ్రపరుస్తారు.
చాపలు శుబ్రపడి ఎండిన తరువాత వాటిమీద కొంచెం చిక్కబడిన రసం మద్యలో నుండి పోసుకు వెళతారు. చివరల వరకూ ఆఖరుగా పోస్తూ చేతులతో సరిచేస్తారు. చివరల వరకూ కారిపోకుండా చీరలను మడతపెట్టీ అడ్డుపెదతారు.
* మళ్లీ మళ్ళీ పొరలు పొరలుగా మామిడి రసం పోసుపోతారు. అది తగిన మందం అయినపుడు దాన్ని అనుకొన్న మరిమానంలో ముక్కలుగా కోస్తారు. వాటిని మైకా కవర్లలో పాకింగ్ చేసి అమ్మకానికి ఇస్తారు.
మామిడి తాండ్ర కేవలం ఎవరికి వారుగానే తయారు చేయం కాక కుటీర పరిశ్రమగా విస్తరించినది. మామిడి ఉత్పతి అదికంగా జరిగే తూర్పు గోదావరి జిల్లా, విశాఖపట్టణం జిల్ల, విజయనగరం జిల్లాలలో దీనిని బారీ ఎత్తున పెద్ద కళ్ళాలు(సిమెంటు చేయబడిన కాళీ స్థలం) లో తయారు చేస్తారు. ఈ విదంగా తయారు చేసి ఎగుమతి చేస్తుంటారు.
Posted by Viswanadh. BK at 3:04 PM 0 comments
Labels: atreyapuram, mamidi, mamidi tandra, tati tandra, vadapalli
Thursday, February 18, 2016
అంతర్వేది తీర్ధం-లాంచీ ప్రయాణం
తాటాకులతో వేసిన టెంపరరీ వంతెనల మీదుగా ఓఎన్ జీసీ పెద్ద పంట్లమీడకు దూకి -
ఒక్కో లాంచీ రాగానే లెక్క ప్రకారం ౩౦ మందిని ఎక్కిన్చగానే లాంచీ ప్రయాణం మొదలయ్యేది.
అటు లాంచీ వచ్చినప్పుడల్లా కెరటాలు రావడం మా లాంచీ ఊగిపోవడం, అందులో ఉన్న వాళ్లకు మా వాళ్ళు మా వాళ్లకు వాళ్ళు చేతులూపుతూ జనాల కేకలు అరుపులు అలా 2 గంటలు ప్రయాణం చేసేవాళ్ళం
మెల్లగా తెల్లవారు వరకూ అలా కొట్టుకొని
ఎర్ర ఎర్రని సూర్యుడు పై పైకి పసుపు రాసుకొంటూ రావడం చూచేసి ఆయన తెల్ల తెల్లగా అయ్యేవరకూ ఉండి
బట్టలు మార్చుకొని దేవాలయ దర్శనానికి వచ్చేవాళ్ళం
ఇక అక్కడి నుండి అశ్వరూడాంభిక ఆలయం, కళ్యాణ వెంకటేశ్వర ఆలయం, వశిష్టాశ్రమం, గోదావరి సముద్ర సంగమం దానికి దగ్గరలో ఉన్న లైట్ హౌస్ ఇలా అన్నీ ఒక రౌండ్ వేసి - మళ్ళీ తిరిగి లాంచీల రేవులో ఎదురు చూపులు, నరసాపురం నుండి బస్సులు - అదీ అంతర్వేది చాలా మందికి తెలిసిన కథ :)
Posted by Viswanadh. BK at 12:53 PM 0 comments
Tuesday, January 19, 2016
పెళ్ళికూతురమ్మ చెరువు తిరునాళ్ళు
దీని అసలు పేరు పద్మనాభుని చెరువు. ఇక్కడ గ్రామం కాని ఇళ్ళు కాని లేవు. ఇదొక చేల మద్య ఉన్న పెద్ద దిబ్బ వంటి పెద్ద విశాల కాళీ ప్రాంతం ప్రక్కన ఒక పెద్ద చెరువు ఒక చిన్న చెరువులు మాత్రమే ఉన్నయి. ఈ దిబ్బను వ్యవసాయదారులు కళ్ళాలు వేసుకోవడానికి, పంట నూర్పులకు, ఇతర అవసరాలకు వాడుకొంటారు.
అలాంటి ఈ దిబ్బ మద్య ఒక చిన్న ఆలయం ఉంటుంది. ఆలయంలో దేవతలెవ్వరో అని చూస్తే నుదుట బాసికాలు, బుగ్గన చుక్క తదితర అలంకారాలతో ఇద్దరు వధూవరులు కూర్చొని దర్శనమిస్తారు. విచిత్రంగా ఉన్న ఈ అలయ చరిత్రలోకెళితే పెనుగొండ నుండి ఆచంట వెళ్ళే మట్టిరోడ్డు ఈ చెరువుల గుండా వెళుతుంది.
అప్పట్లో కలిగిన వాళ్ళు పల్లకీల్లో వెళ్ళడం జరిగేది. అలా పెనుగొండలో కల వైశ్యుల ఆడపడుచు వివాహం జరిగిన పిదప ఆచంటకు పయనమై ఈ మార్గం గుండా వెళుతున్నపుడు వరుడు మూత్ర విసర్జన కొరకు దిగి పని పూర్తిఅయిన పిదప కాళ్ళు కడుక్కోడానికి చెరువులో దిగబోయినపుడు పాము కాటు వేయడం జరిగింది.
దాంతో అతడు చెరువులో పడి మృతి చెందటం గమనించి అందరూ పరుగెత్తి అత్డి వద్దకు వెళ్ళి పరీక్షించి మరణించినట్టుగా నిర్ధారించారు. అది విని పల్లకిలో ఉన్న పెళ్ళీకూతురు ఒకప్రక్కగా వెళ్ళి అదే చెరువులో దూకి అమెకూడా మృతి చెందినది. అలా ఆమె ప్రతివ్రతాధర్మ ఇష్టపూర్వక మరణానికి వారినిద్దరినీ అక్కడే సమాది చేసారు.
మునుపు సరిగా పంటలు పండక ఇబ్బందులు పడే వారైన రైతులకు అలా జరిగిన తరువాత సుభిక్షంగా పంటలు పండటం, సరియైన సమయానికి వర్షాలు కురవడం, చుట్టుప్రక్కల అందరికీ అనుకూలమైన పనులు జరుగుతూ వారు ఏ కార్యం తలపెట్టినా అవి నిర్విగ్నంగా జరగటం వంటివి జరిగేవట. ఇవన్నీ అక్కడ సమాధి చేయబడ్డ వధూవరుల వలనే అనే నమ్మకం బలపడి అక్కడ వారి మూర్తులను కొలువుతీర్చి పూజలు చేయడం జరుతూండేది. అదే కాక ఏఇంట్లో వివాహం జరిగినా వివాహానంతరం వధూవరులను ఈ దేవాలయానికి తీసుకురావడం జరుతూంతుంది. ఏ పని మొదలు పెట్టాలన్నా ఇక్కడ మొక్కుకొని చేయడం కూడా చేస్తుంటారు.
ఈ అలయానికి అటు ఆచంట నుండి ఉత్సవాలను నిర్వహించేందుకు వైశ్యప్రముఖులు వస్తారు. ఇటు పెనుగొండ నుండీ ఆలయ నిర్వహణ జరుగుతున్నది. వేరెక్కడో ఊరిలో ఉన్న ఈ ఆలయానికి రెండు పట్టణాల నుండీ ఆలయానికి ధర్మకర్తలుగా, నిర్వహణ జరగటం విచిత్రం.
మునుపు చిన్న ఆలయం ఉందేది దానిని 1982 లో పెద్ద ఆలయంగా మార్చారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున మొదలు మూడురోజులు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడ అవే చేల గట్ల మీద, చెరువు ప్రక్క దిబ్బలమీద తిరునాళ్ళు జరుగుతాయి. ఒకప్పుడు అక్కడికి చేరుకోవడానికి మట్టి రోడ్లే ఉండేవి. ఇపుడు దగ్గరవరకూ కంకర రోడ్లు ఉన్నాయి, ఆచంట, మార్టేరులను కలిపేలా చెరువుకు కొద్ది దూరంగా తారురోడ్డు నిర్మించారు. సంక్రాంతికి పల్లెల మద్య జరిగే ఈ తీర్ధం, కోడి పందాలు, గుండాటలు, చూడటానికి వేల మంది వస్తుంటారు
Posted by Viswanadh. BK at 12:47 PM 0 comments
Labels: Deva Village, padmanabhuni cheruvu, Pellikooturamma cheruvu, pellikooturamma Temple, pellikooturu teetdham
Tuesday, January 5, 2016
వెంకటాపూర్ వెంకటేశ్వర దేవస్థానం
Posted by Viswanadh. BK at 11:05 AM 0 comments
Labels: korutla, venkatapur (korutla), venkateswara swami
Wednesday, December 30, 2015
ఫేస్బుక్ - ప్రీ బేసిక్స్
* ప్రకటనలు ఇప్పుడు వేలలో ఉంతే అవి లక్షల్లో ఉండచ్చు, వాటి వీక్షణ ద్వారా వాళ్ళు ఉచితానికి పెట్టే దానికి డబల్ త్రిబుల్ ఇన్‌కం లాగుతారు.
* పోటీ తత్వం నసించి నీరసించి పోయి ఇతర సైట్‌లు చాలా కనుమరుగైపోతాయి.
* బాగా డబ్బున్న కంపెనీల ఆధిపత్యం ద్వారా అంతర్జాలాన్ని కూడా కార్పోరేట్ సంస్థల మాదిరి తయారుచేస్తారు.
* ఇదో జాడ్యంలా మారి నెటిజన్ల సృజనకు అగాధంలా మారుతుంది.
* పిచ్చి పీక్స్‌కెళ్ళడం అనే మాట, లేదా వదిలించుకోలేని దురలవాట్ల సరసన ఫేస్బుక్ కూడా చేరుతుంది.
* యువతలో పని తత్వం తగ్గి పనికిమాలిన చాటింగ్ ద్వారా విలువైన జీవితకాలాన్ని కోల్పోతారు
ఉచితం ఉచితం అని మన రాజకీయనాయకులు చేతికి ఎముకలేని గొప్పోళ్ళ మాదిరి మన డబ్బుని వెదజల్లి మనలను వెదవలను చేస్తుంటే, వాటిని చూసి మనం పొంగిపోతూ మన వెనుక తాటాకులను మర్చిపోతున్నాం - తెల్ల వాళ్ళు అలాంటి పనులు చేయడంలో మనకన్నా బాగా ముందున్నారు
Posted by Viswanadh. BK at 6:31 PM 0 comments
Wednesday, December 9, 2015
బాణభట్టు
వత్స గోత్రీకుడైన బాణుడు బీహారు రాష్ట్రంలో చాప్రా జిల్లాలో సోణా (సౌన్) నదీ తీరంలో ఉన్న పృధుకూట గ్రామంలో జన్మించాడు. ఊ గ్రామాన్ని ప్రస్తుతం ప్రీతికూటగా పిలుస్తున్నారు. ఈయన తలిదండ్రులు చిత్రభానుడు, రాజదేవి. చిన్నతనంలో విద్యాభ్యాసం అంతా తండ్రి వద్దనే నడిచింది. తల్లిదండ్రులు చిన్న తనంలోనే మరణీంచుట వలన దేశ సంచారానికి బయలుదేరాడు. దేశ సంచారంలో అనేకమంది వ్యక్తులు, పండితుల పరిచయంతో అనేక విద్యాపద్దతులు, అనుభవాలతో తనకు సహజంగా ఉన్న ప్రతిభను మెరుగుపరుచుకొన్నాడు.
బాణుడు కామ, అర్ధ, రాజనీతి, అలంకార శాస్త్రాలను అభ్యసించాడు. అతడి ప్రతిభా విశేషాలను విన్న స్థానేశ్వరం రాజు హర్షవర్ధనుడు అతడిని తన ఆస్థాన కవిగా ఉండమని ఆహ్వనించాడు. రాజాస్థానంలో అనేక సన్మానాలు పొంది కొంతకాలం అనంతరం తన స్వగ్రామానికి వెళ్లి అక్కడి జనుల కోరిక మేరకు హర్షుని జీవిత చరిత్రను కావ్య రూపంగా రచిస్తూ వారికి వినిపించాడు. దానికి సంతసించిన హర్షుడు అనేక బహుమానాలను, బంగారాన్ని కానుకలుగా సమర్పించాడని ఒక కథనం.
బాణుణి కాలం హర్షవర్ధనుని కాలంలో కనుక క్రీ.శ. 606 నుండి 648 వరకూ ఉండవచ్చునని చరిత్రకారుల అంచనా. బాణుడు హర్షచరిత్రతోపాటు కాదంబరిని కూడా రచించాడు. అయితే ఈ రెండూ కూడా అసంపూర్తి గ్రంథాలుగా వదిలేసాడు. దీనికి కారణం నడుస్తున్న చరిత్రను కదా వస్తువుగా తీసుకోవడమనేది ఒక ఊహ. తరువాత సాహిత్యాభిమనుల కోరిక మీద అతని పుత్రుడైన భూషణభట్టు పూర్తిచేసాడు. ఇతడిని ఇంకా పుళింద,పుళింద్ర పేర్లతో పిలుస్తారు. అతడు అచ్చంగా తండ్రి శైలితోనే కావ్యాన్ని పూర్తిచేసి పండితుల ప్రసంసలు పొందాడు.
సంస్కృత మూలంగా కల కాధంబరిని తెనుగులో
పేరాల భరతశర్మ గారు తన సిధ్ధాంత గ్రంధంలో మొత్తం కాదంబరి కధను చక్కని శైలిలో తెనించారు. అని హరిబాబు గారు పేర్కొన్నారు. అది ఎవరికైనా లభ్యత ఉంటె తెలియచేయగలరు.
Posted by Viswanadh. BK at 1:13 PM 0 comments
Labels: banabhattu, banudu, harsha charitra, kadambari, కాదంబరి, బాణభట్టు, బాణుడు, హర్ష చరిత్ర
Thursday, November 19, 2015
వాహన చోదకులారా జర భద్రం
పిల్లలూ రోడ్లమీదే ఆడుకుంటారు. అంట్లు, స్నానాలు, అన్నీ అక్కడే
మద్యాన్నం కాలక్షేపం, రాత్రి నిద్ర అన్నీ రోడ్ల ప్రక్కనే
వాహనాల వాళ్ళే జాగ్రత్తలు పాటించాలి, రోడ్లప్రక్కన నివసించే ప్రజలు కాదు అనేది రూల్ అని అనుకుంటారా
ఇవన్నీ ప్రక్కన పెట్టినా ఏదైనా ప్రమాదం జరిగినా అదీ వాళ్ళ పొరపాటుగానే అయినా అక్కడ జరిగే సీన్ వర్ణించలేము.
పొరపాట్లు, పరిస్థితులు, ఏమీ ఉండవు. - ఏకపక్ష నిర్ణయం - బండి వాడిదే తప్పు - వాడిని అర్జెంటుగా అడ్డంగా పట్టుకొని తన్నేసి ఆనక తీరిగ్గా విచారించి డబ్బు అయితే డబ్బు, కేసయితే కేస్
కనుక వాహన చోదకులారా జర భద్రం :)
మీరే అక్కడ ఉంటె అందరిలా కాక కొద్దిగా ఆలోచించండి - మందలో మనం ఒకరుగా కాదు
Posted by Viswanadh. BK at 6:35 PM 0 comments
Labels: a.p roads, danger accidents, road side living peoples in andhra, vehicle accidents
Monday, November 9, 2015
ఆన్లైన్లో కొనుగోళ్ళా
Posted by Viswanadh. BK at 11:51 AM 0 comments
Labels: amazon, eBay, flip cart, online buying, online purchase, speakers